Monday, September 29, 2014

పిల్లలకు మురికి మంచిదే

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఏడాది లోపు పిల్లలకు మురికి కొంతవరకు మంచిదే అని ఒక వారపత్రికలో చదివాను .ఎంతవరకు నిజము ?

జ : ఇంట్లో పసిబిడ్డ ఉంటే పాపాయికి ఏ రకము రుగ్మతలూ , ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటారు. దుమ్మూ , ధూలి , చీమా , దోమా రా కుండా అత్యంత శ్రద్ద వహిస్తారు. ఐతే ఏడాదిలోపు పిల్లలు కొద్దిపాటి మురికి , ఎలర్జెన్లు , ఇంట్లో ఉండె బ్యాక్టీరియాకు ఎక్స్ పోజ్  అయినట్లయితే ....... తదుపరి వయసులో ఎలర్జీలు , వీజింగ్ , అస్తమా వంటివాటినుండి రక్షణ కల్పించబడుతుందని తాజా పరిశోధనలవలన గుర్తించారు.

తొలి బర్త్ డే కంటే ముందుగా ఇటువంటి వాటిని ఎదుర్కొన్న పిల్లలు వాటి వల్ల  ఇబ్బంది పడడము కంటే ప్రయోజనాన్ని పొందగలరని నిపుణులు చెప్తున్నారు.  దేనికీ ఎక్స్ పోజూ కాకుండా అత్యంత సున్నితము గా పెరిగినట్లయితే ఇతరత్రా బయట  ఎక్స్ పోజ్ అయితే  త్వరితంగా ప్రభావం చూపుతాయి. అదే ఇంట్లోనే చిన్నతనము నుండి వీటి ప్రభావము కొద్దికొద్ది గా పడుతున్నట్లయితే ఇట్టే తట్టుకునే శక్తి కలుగుతుంది. ఏడాది తర్వాత వీటిని పిల్లలు సులువుగా అధిగమిస్తారు. . . అంటే కొంచం మురికి , బ్యాక్టీరియా , ధూలి   పిల్లల శరీరానికి సోకడమే మంచిది.

  •  *=========================== 

టీనేజీ లో ఋతుక్రమము సరిగా ఉండదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మా అమ్మాయి 14 సం.లు.రజస్వల అయి 6 మాసాలే అయినది. ఋతుక్రమము సక్రమముగా , రెగ్యులర్ గా రావడములేదు . ఎందువలన? 

జ : టీనేజ్ లో అమ్మాయిలకు ఋతుక్రమము రెగ్యులర్ గా ఉండదు. ఒక్కోసారి  నెలలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు రావచ్చు . ఒక్కోసారి కొద్దినెలల దాకా రాకపోవచ్చు. ఎదుగుదల క్రమములో శరీరము సర్దుబాటు చేసుకునే వయసులో అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు నొప్పితో కూడుకొని ఉంటుంది. . . దీనిని డాక్టర్లు ఎనొవిలేటరీ (enovilatory) సైకిల్స్ అంటారు.

ఋతుక్రమము 2 ఏళ్ళ పరిధి లో సక్రమము గా సర్దుకుంటుంది. అయితే ఋతుస్రావము భారీగా ఉండి , నెలలో ఒకసారికంటే ఎక్కువ సార్లు వస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. దీనివలన ఐరన్‌ లోపాలు , హార్మోనుల సమస్యలు , కొన్ని సార్లు క్లాటింగ్ సమస్యలు ఉంటే ముందుగా తెలుస్తాయి. తదనుగునము గా మందులు వాడుకోవచ్చును.

  • *=========================== 

చాతినొప్పిని నిర్లక్ష్యము చేయకూడదంటారు.ఏమి?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : చాతినొప్పిని నిర్లక్ష్యము చేయకూడదంటారు.ఏమి?.

జ : ఏ నొప్పిని నీ నిర్ల క్ష్యము చేయకూడదు . గుండెపోటుకు ప్రతిసారీ చాతినొప్పి లక్షణం కావాలనేమీ లేదు . ఎడమచెయ్యి నొప్పికూడా గుండె జబ్బుకు సంకేతమే . జా.. లైన్‌ లో చాలాసార్లు తీవ్రమైన నొప్పి వస్తుంటే దానిగురించి పట్టించుకొని తీరాలి. వికారము , ఎక్కువ చెమట పట్టడము  కూడా గుండెపోటు  కు సాధారణ లక్షణాలు.

నిద్రలో గుండెపోటు వచ్చిన వారిలో 60 శాతము మంది నిద్రనుండి మేల్కొనరు . జా ... లో నొప్పి సుదీర్ఘ నిద్ర నుండి మెలుకువ తెప్పిస్తుంటుంది. సాదారణ చెయ్యి నొప్పీ అనో , మామూలు 'జా' పెయిన్‌(jaw pain) అనో నిర్లక్ష్యము చేయకుండా తగిన సమయానికి పరీక్షలు చేయించు కోవడము వల్ల ముందస్తుగా గుండెకు వచ్చిన   ముప్పును పసిగట్టే వీలుంటుంది.

  • *===========================

Sunday, September 28, 2014

ఐదేళ్ళ వయసు పిల్లలకు చెక్కెర వాడకము మంచిది కాదా?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఐదేళ్ళ వయసు పిల్లలకు చెక్కెర వాడకము మంచిది కాదా?.

జ : మంచిది కాదు . అదనపు చెక్కెర వలన ఏ ఇతర పోషక ప్రయోజమూ లేకపోగా అదనపు కేలరీలు శరీరములో పేరుకుపోతాయి. ఈ అదనపు కేలరీలు కొవ్వుగా మారి , ఆ తర్వాత క్రమములో అది స్థూలకాయానికి కారణమవుతుంది. దంత క్షయానికీ కారణమవుతాయి. పిల్లలు తినే పండ్లలలోని చెక్కెర వారికి సరిపోతుంది. కనుక ఈ వయసు పిల్లలకు నేరుగా పంచదార , పంచదారతో తయారైన పదార్ధములు ఇవ్వకూడదు.

  • *=========================== 

Tuesday, September 23, 2014

What is FODMAPS diet-ఫాడ్ మాప్స్ ఆహారము అంటే ఏమిటి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : What is FODMAPS diet-ఫాడ్ మాప్స్ ఆహారము అంటే ఏమిటి?

జ : ఫాడమాప్స్ అనేది మాలిక్యుల్ నిర్మాణానికి సంబంధించిన ఒక  సాంకేతికమైన చిన్న పేరు .సార్ట్ చైన్‌ కార్బోహైడ్రేట్ ఆహార పదార్ధాలు, డై సాక్కరైడ్స్ , మొనోసాక్కరైడ్స్ వీటిలో జతచేయడం జరిగినది.ఇవి చిన్న పేగులో పూర్తిగా గ్రహించబడవు . ఉదా: fructans , galactans , lactose, sorbitol , manitol , xylitol and maltitol . ఇవి ముఖ్యముగా  గోధుమలు , రై , ఉల్లి , వెల్లుల్లి , కాయధాన్యాలు , పాలపదార్ధాలు , తేనె ,యాపిల్స్ , పుచ్చకాయలు , పీచ్ లు , బ్లాక్ బెర్రీస్ , కృత్రిమ చెక్కెరలు , ప్రక్టోజ ఎక్కువగా ఉన్న మొక్కజొన్న మొదలగునవి. ఈ పదార్ధములు పేగులలో ఉండే బాక్టీరియా జీర్ణం చేస్తుంది. వీటివల్ల గ్యాస్ మరియు ఉబ్బరము కలుగుతాయి. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోం ఉన్నవారు ఇవి వాడకము మానేయాలి లేదా అతితక్కువగా వాడాలి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, September 21, 2014

మొటిమలు అవాంచిత రోమాలు సులువుగా బరువు పెరుగుతున్నాను పరిష్కారమేదైనా తెలియజేయండి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 18 సం.లు విపరీతం గా మొటిమలు , చాతి పై అసాధారణముగా అవాంచిత రోమాలు పెరుగుతున్నాయి. సులువుగా బరువు పెరుగుతున్నాను . నా అత్మస్థైర్యము దెబ్బతుంటుంది. పరిష్కారమేదైనా తెలియజేయండి?.

జ : ఈ జనరేషన్‌ లో సాధారణము గా ఉండే సమస్య ఇది . సరియైన పరీక్షలు చేయించుకోండి . పెల్విక్ ఆల్ట్రా సౌండ్ , హార్మోనల్ ఎవల్యూషన్‌ అవసరమవుతాయి. " పాలిసిస్టిక్ ఒవేరియన్‌ డిసీజ్ " గలవారికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇన్సులిన్‌ మెటబాలిజం అసాధారణత ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనబడతాయి. దీనివల్ల ఓవరీస్ నుంచి మేల్ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంటుంది.

మీకు వ్యాయామము అవసరము ప్రతిరోజూ ఓ గంట పాటు వాకింగ్ చేయండి.  అధిక ప్రోటీన్‌ , పీచు పదార్ధాలు తింటూ , తీపి , కొవ్వుపదార్ధాలు తినడము మానేయండి. మంచి డాక్టర్ ని సంప్రదించి మేల్ హార్మోన్‌ ప్రభావము తగ్గిందే ట్రీట్మెంట్ తీసుకోండి.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

బిడ్డకు కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?, బిడ్డ ఏడుపుకు కారణాలు.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బిడ్డకు కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?, బిడ్డ ఏడుపుకు కారణాలు తెలియజేయండి?

జ : బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్‌ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణంగా పిల్లల్లో కడుపు నొప్పి మూడు నాలుగు నెలల వయసు నుంచే మెదలవుతుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పి వస్తుందని చెప్పలేరు, దాన్ని పెద్దలే తెల్సుకోవాలి. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు. ఇలా ఏడవడంతో ముఖం, అరచేతులు, అరికాళ్ళు బాగా ఎరబ్రడతాయి పడుకోబెట్టిన కొద్ది సేపట్లోనే లేచి మళ్లీ ఏడుపు అందుకుంటారు.

ఏడుపుకు కారణాలెన్నో
సాధారణంగా మూడు నెలల వయసు నుంచే పిల్లలు తల్లిని, తమ చుట్టూ ఉన్న వారిని పదే పదే చూస్తూ గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తుంటారు.కాళ్ళూ,చేతులుఅదేపనిగాఆడిస్తూ వుంటా రు. ఊకొట్టి కబుర్లు చెప్పే వారు లేకున్నా ఏడుస్తుంటారు. అదే విధంగా చిన్న అసౌకర్యం కలిగినా గుక్కపట్టి ఏడ్చి పెద్దలకు ఊపిరి ఆడకుండా చేస్తుం టారు. శారీరకంగా ఇతర సమస్య లేమైనా ఉన్నాయేమో గమనించి తగు చికిత్సఇప్పించండి. పాల కోసం ఏడుస్తున్నారేమో తెలుసుకొని పాలుపట్టండి. నాప్కిన్‌ ఎప్పటికప్పుడు మార్చుతున్నారో లేదో చెక్‌ చేయండి. ఏదైనా వంటికి గుచ్చుకుని బిడ్డ అసౌకర్యానికిగురవుతున్నదేమో పరిశీ లించండి. పాలు తాగిన తర్వాత పిల్లవాడిని భుజం మీదుగా ఎత్తుకుంటే త్రేన్పు వస్తుంది. త్రేన్పు రాకపోయినా పిల్లవాడికి కడుపులోఅసౌకర్యంగా ఉండి ఏడుస్తూంటాడు.పిల్లవాడి భుజాల కిందుగా చేతులు వేసి పట్టుకొని చిన్నగా నడిపించండి దీంతో దేహమంతా కదిలి వ్యాయామం అవుతుంది. అజీర్తి లక్షణాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి.సంగీతపరమైన పాటలు వినిపించండి. లేదంటే మీరే ఓచక్కని పాటపాడండి.అబ్బాయి ఏడుపు హంఫట్‌ అయిపోతుంది. వెచ్చని నీటితోస్నానం చేయించండి. ఆరుబయట తిప్పుతూ పరిసరాలను పరిచయం చేయండి, ఏడుపు ఆపేస్తారు.మల,మూత్రాదులు సాఫీగా అవుతున్నాయా లేదా గమనించండి. ఇంట్లో ఎవరివైనా కడుపునొప్పి మందులు వుంటే వాటిని వేసే ప్రయత్నం చేయకండి. ఇలాంటి సొంత వైద్యాలు పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తాయి.

సాయంకాలమే ఎందుకు ఏడుస్తారు? సాయంకాలం కాగానే వీరికి ఏమవుతుంది?
సాధారణంగా చంటిపిల్లలు సాయంకాలంఎక్కువగా ఏడుస్తుం టారు, పగలంతాబాగానే ఉంటారు. అనిచాలా మంది ఆదుర్ధా పడుతుంటారు. దీనికి కారణంఉంది, పాలు తాగించేప్పుడు ఊపిరిపీల్చుకోవడంద్వారాపాలతోబాటుగాలికూడా కడుపులో కి చేరుతుంది. అయితే పాలు,గాలి కన్నాబరువుగావుండంతో డుపులో కింది భాగానికి చేరుతాయి. గాలి పైన వుంటుంది. పాలు తాగించిన తర్వాత బిడ్డను భుజం మీతుగా వేసుకొని త్రేన్పు వేస్తేగాలి బైటకి పోయి పిల్లవాడికి అసౌకర్యంగా అనిపించదు.అలాకాకుండా పాలుతాగిన వెంటనేపడుకోబెడితే పాలు, గాలికలిసిపోయిపాలు విరిగిపోయి వాంతికి వస్తుంది దీంతో పిల్లవాడు ఉక్కిరిబిక్కిరి ఏడుస్తాడు. ఈ నొప్పి 99శాతం వరకు సాయంత్రాలే ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోకుండా అదే పనిగా ఏడిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదిం చండి.

సాయంకాలం నిద్ర వద్దు ?
సాయంకాలాలు పిల్లల్ని నిద్రపోనివ్వకుండా ఆడిస్తూ వుండండి. మీ పిల్లల వయసున్న ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయండి. పెద్ద పిల్లలయితే వారి స్నేహితులతో ఆడుకోమని ప్రోత్సహించండి. దీని వలన శారీరక వ్యాయమం అవుతుంది.మానసికంగా ఆరోగ్యంగా వుంటారు. ఆటలాడి అలిసిపోవడం వలన త్వరగా నిద్రపోతారు. ఇది ఎదిగే పిల్లలందరికీ వర్తిస్తుంది. కాస్త పెద్ద పిల్లలయితే భయంకరమైన దృశ్యాలు చూసినా, విన్నా నిద్రలో కలవరించి లేచి ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు దెయ్యం,భూతం వస్తుంది పడుకో అని చాలా మంది పెద్దవాళ్ళు ఈ రకమైన భయాల్ని పిల్లలు నిద్రపోవ డానికి ఉపయోగిస్తుంటారు. అప్పటికి నిద్రపోతారేమో కాని, ఏ చిన్న అలికిడి అయినా దెయ్యం వస్తుందేమోనని భయంతో బిగుసుకుపోయి ఏడుస్తారు. కనుక పిల్లలకి భయం కలిగించే విషయాలను పదే పదే చెప్పి నిద్రపుచ్చడం మంచిది కాదు. దానికన్నా ఏదైనా శాస్త్రీయ సంగీతమో...లైట్‌ మ్యూజిక్కో పిల్లలకు వినిపిస్తూ నిద్రపుచ్చాలి . కొంచెం పెద్దవాళ్లయితే నీతి కథలను చెప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నించాలి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, September 20, 2014

మష్కిటో రిప్లెంట్స్(Mosquito replents) సురక్షితమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మష్కిటో రిప్లెంట్స్(Mosquito replents) సురక్షితమేనా?

జ : దోమల సీజన్‌ లో మస్కిటోరెపెల్లెంట్స్ వాడకం తప్పని పరిష్థితి. వీటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లలపై ఎలా ఉంటాయోననా సందేహం , ఆందోలన కలుగుతుంటాయి .అసలు పిల్లల గదిలో ఇవి దాడొచ్చో? లేదో కూడా  భయం గానే ఉంటుంది.

రెండు రకాల మస్కిటో రిపెల్లెంట్స్ అభిస్తాయి.  ఒకటి మనుషుల చర్మానికి , దుస్తులకు , నెట్ కు  అప్లై చెసేది. . . అవి - డీట్ (డైథిల్ టొల్యుమైడ్) , పెర్మిథ్రిన్‌.  రెండోది ... కాల్చడము ద్వారా దోమల్ని దూరంగా తెరిమేసేవి. . . అవి మ్యాట్స్ , కాయిల్స్ , లిక్విడేటర్లు రూపం లో ఉంటాయి. prallethrin liquid ,Transfluthrin liquid usally 1.6% w/w గా వాడుతారు .  ఎక్కువ కాన్‌సెంట్రేషన్‌ గా ఉంటే దుస్ప్రభాలు ఎక్కువ . . . అవి ఇరిటేషన్‌, చర్మము పై ర్యాష్ వంటివాటితో పాటు ఫిట్స్ , స్పృహకోల్పోవడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఉండవచ్చును. కనుక క్రీమ్‌ చాలా తక్కువ కాన్సెంట్రేషన్‌ తో ఉండాలి . కొద్ది కొద్ది గా నుదురు , చెవులు , పాదాలకు మాత్రమే రాయాలి.  మ్యాట్స్ , కాయిల్స్ , లిక్విడేటర్లు ... దగ్గు మరియు ఇతర శ్వాస సంభందిత సమస్యలకు కారణ మవుతాయి. ఎలర్జీలు , ఆస్తమా వంటి సమస్యలున్న కుటుంబాలలో  వీటిని వాడనే వాడకూడదు.

అల్పమైన ఒక ప్రాణి గుట్టుచప్పుడు కాకుండా మనల్ని దెబ్బతీసి అనారోగ్యానికి గురి చేసి కొద్ది వారాలపాటు మంచానికి కట్టిపడేస్తుంది. అదే దోమ. దోమలు మనతోపాటు సహజీవనం చేస్తూ రక్తం పీల్చి వ్యాధులకు గురిచేస్తాయి. రక్తాన్ని ఇన్ఫెక్షన్ కు గురిచేస్తున్న దోమలు, దోమకాటుకు గురవడంవల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా మరియు ప్రాణాంతకరమైన ఎల్లో ఫీవర్ తదితర వ్యాధులు సంక్రమించి అనేకమందిని శక్తిహీనులను చేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి , దోమల నివారణోపాయ మందులు వాడటం మంచిది. అయితే ఇవి చాలా వరకూ రసాయనాలతో తయారుచేసినవి . వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఊపిరితిత్తులకు మీద దుష్ప్రభాలు చూపెడుతాయి.

ఇంట్లో తయారుచేసుకొనే నేచురల్ దోమ నిరోధకాలు: దోమల నివారణకు 5 నేచురల్ హోం రెమడీస్ 1. లావెండర్ ఎసెన్సెషియల్ ఆయిల్ చాలా గ్రేట్ గా వాసన వస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఎఫెక్టివ్ మస్కిటో రిపిలెంట్ గా ఉపయోగిస్తుంటారు.  దోమ నిరోధకాలలో ఇది ఒక ఎఫెక్టివ్ దోమ నిరోధక ఉపాయం. లావెండ్ ఆయిల్ మరియు బ్లీచింగ్ పౌడర్ ద్రవాన్ని రెడీ చేసుకొని. ఈ మిశ్రమాన్ని కట్ చేసుకొన్న బాటిల్లో పోయాలి. పోసిన ఈ బాటిల్ ను ఒక మూల పెట్టాలి. అంతే ఈ వాసనకు దోమలను నివారించవచ్చు. 2. బాటిల్లో అరకప్పు వేడి నీళ్ళు పోసి అందులో పంచదార వేయాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత, ఈ బాటిల్లో ఈస్ట్ ను జతచేయాలి. ఈ సగం నింపిన బాటిల్ రివర్స్(బాటిల్ మూతి క్రిందికి)లో పెట్టి న్యూస్ పేపర్ చుట్టి లేదా పాత వస్త్రాన్ని చుట్టి, దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి. 3. బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు వేపనూనెను వేడినీటిలో మిక్స్ చేసి బాటిల్లో పోయాలి. చల్లారిన తర్వాత అందులో ఈస్ట్ ను జత చేయాలి. తర్వాత న్యూస్ పేపర్ ను చుట్టాలి. దీన్ని దోమలు ఎక్కువగా ఉన్నప్రదేశంలో చుట్టాలి. 4. మరో దోమ నిరోధకం తామర పువ్వులతో తయారుచేసుకోవచ్చు. తామరపువ్వులున్న నీళ్ళు కూడా దోమలను చంపటానికి బాగా సహాయపడుతాయి. ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ మస్కిటో రిపిలెంట్స్ . 5. అరగ్లాసు నీటిలో కొద్దిగా యూకలిప్టస్ నూనెను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్ప్రే బాటిల్లో వేసి దోమలున్న ప్రదేశంలో స్ప్రే చేయలి .

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

పిల్లలకు ఎంతనిద్ర అవసరమో తెలియజేయండి?

  •  
 
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : పిల్లలకు ఎంతనిద్ర అవసరమో తెలియజేయండి?

Ans : నిద్ర ఎవరికైనా అవసరం, పిల్లలకు మరీ అవసరం.పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలు మధ్యలో నిద్రలేస్తున్నారా?లేస్తే మళ్లీ పడుకోబెట్టటానికి కష్టమవుతోందా? పొద్దున్నే వేళకు లేవటం లేదా? అనేవి ముఖ్యం. సరిగా నిద్రపోని పిల్లల్లో చిరాకు కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ నాణ్యమైన నిద్ర లేకపోతే, పొద్దున లేవటానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. పదిపన్నెండేళ్ల వయసు పిల్లలు త్వరగా పడుకోరు. రాత్రి పన్నెండు గంటలదాకా కంప్యూటర్‌ గేమ్స్‌, టీవీలు, సినిమాలు చూడటం వంటివాటిలో గడిపేస్తారు. ఇవన్నీ నిద్ర నాణ్యతను దెబ్బతీసేవే. కొంతమంది నిద్ర మధ్యలో తరచూ లేచి ఏడుస్తుంటారు.ఇలాంటివారిలో నాణ్యమైన నిద్ర లేకపోవటం వల్ల పగలు నిద్రపోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఫలితంగా తరగతి గదిలో కునికిపాట్లు, పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవటం, నేర్చుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి, విషయగ్రాహ్య శక్తీ తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్లో  కోపం, పిచ్చిపిచ్చిగా, అతిగా ప్రవర్తించటం వంటివి ఎక్కువవుతాయి. ఇవన్నీ ప్రవర్తన సంబంధ సమస్యలు. వీటన్నింటి ఫలితంగా మార్కులూ తగ్గుతాయి. ఇలాంటి లక్షణాలన్నింటినీ ప్రదర్శించే పిల్లలు రాత్రివేళల్లో సక్రమంగా నిద్రపోతున్నారా? అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.

శిశువులు 3నెలలు వచ్చేవరకు రోజులో కనీసం 18-20 గంటలైనా విడతలవారిగా నిద్రపోవాలి . మధ్యమధ్యలో పాలు తాగటానికి లేవటం, మళ్లీ పడుకోవటం.. ఇలా ఉంటుంది వాళ్ల నిద్రశైలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంటుంది.

మూడు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు రోజులో 14 -15 గంటలు నిద్రపోవాలి .

2- 4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో సుమారు 12 గంటలు నిద్రపోవాలి .

స్కూలుకెళ్లే వయసు (5-9 ఏళ్లు) పిల్లలు కనీసం 10-12 గంటలైనా నిద్రపోవాలి.

యుక్తవయసు వచ్చేసరికి పిల్లల్లో నిద్ర అవసరం తగ్గినా, వీళ్లుకూడా కనీసం 9 గంటలైనా పడుకోవాలి.

ఇక యుక్తవయసు దాటిన పెద్దవాళ్లు రోజులో 6-8 గంటలు పడుకున్నా సరిపోతుంది.
.
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో పగటినిద్ర తగ్గినా ఏడాది వయసు పిల్లలు పగటివేళ కనీసం మూడు గంటలైనా నిద్రపోవాలి . మిగతా పదీ పదకొండు గంటలు రాత్రివేళలో పడుకోవాలి .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, September 19, 2014

ముప్ఫైల్లో అడుగుపెట్టగానే మహిళల్ని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది.కారణం?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : ముప్ఫైల్లో అడుగుపెట్టగానే మహిళల్ని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది.కారణం?.

జ : ముప్ఫైల్లో అడుగుపెట్టగానే ఈ మధ్య మహిళల్ని కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తోంది. ఇది రావడానికి కారణం కాలేజీకెళ్లే వయసులో అమ్మాయిలు ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియంను సరిగ్గా తీసుకోకపోవడమే అని తాజా అధ్యయనం తెలిపింది. తాజా కాయగూరలూ, ఆకుకూరలూ తింటే వాటితో అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. కానీ చక్కని పోషకాహారాన్ని తీసుకోవడంలో అమ్మాయిలు పూర్తిగా విఫలమవుతున్నారని ఈ అధ్యయనం వివరించింది. అందువల్లే ఎదిగే వయసులో కీలకంగా అవసరమైన క్యాల్షియంను వీరు తగినంతగా పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎవరింట్లో అయినా విందుకి వెళ్లినప్పుడూ... ఏదయినా వేడుకకి హాజరైనప్పుడూ కూరగాయలూ, ఫాస్ట్‌ఫుడ్‌ ఎదురెదురుగా ఉన్నప్పుడూ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం కన్నా.. హానిచేసే పదార్థాలనే తీసుకుంటున్నారు. క్యాల్షియం లోపించడం కారణంగా చిన్నవయసులోనే ఆర్థరైటిస్‌ బారిన పడుతున్నారని విశ్లేషించారు. ముఖ్యంగా పద్దెనిమిదేళ్ల వయసులో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా క్యాల్షియం అధికంగా ఉండే రాగులూ, నువ్వులూ, పెరుగూ, పాలూ, పాలకూరా, గుడ్డూ వంటి ఆహారానికి అమ్మాయిలు ప్రాధాన్యం ఇస్తే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

వ్యాయామం తో లైంగికవాంఛలు పెరిగేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: మాకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మా వారిలో లైంగికవాంఛలు అసలు లేవనే చెప్పాలి. సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటున్నారు. అలాగని ఆరోగ్య సమస్యలూ లేవు. ఇలాంటివారిలో మళ్లీ లైంగికవాంఛలు పెరగాలంటే వ్యాయామం సరైన పరిష్కారం అని ఓ చోట చదివా. వ్యాయామం చేయడం వల్ల అంత ఫలితం ఉంటుందా?

జ: శారీరకంగా దృఢంగా లేనివారితో పోలిస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు లైంగిక చర్యను ఎక్కువగా ఆనందిస్తారని చెప్పొచ్చు. వ్యాయామం చేయడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. దీనివల్ల లైంగిక వాంఛలు పెరుగుతాయి. కలిగే సంతృప్తీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పురుషుల్లో వయసుపెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్‌ హార్మోను స్థాయులు తగ్గుతాయి. లైంగిక వాంఛలు తగ్గడానికీ అది కూడా ఒక కారణమే. అయితే వ్యాయామం చేయడం వల్ల ఆ హార్మోను నిలకడగా ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసిక ఆనందం కూడా సొంతమవుతుంది. వ్యాయామంతో అందం, ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. ఇవన్నీ కూడా పరోక్షంగా లైంగిక వాంఛలు పెంచే మార్గాలే. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడిని అధిగమిస్తూ, సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోగలిగితే ఏ వయసులోనైనా లైంగికవాంఛలు తగ్గకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాయామం అనేది కేవలం పురుషులకే కాదు కాబట్టి.. మీరూ చేయడానికి ప్రయత్నించండి. ఇద్దరూ కలిసి రోజూ కాసేపు నడిస్తే మంచిది. దీనివల్ల మానసికంగా కూడా అనుబంధం పెరిగి క్రమంగా దగ్గరవుతారు.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, September 18, 2014

Any health problem if ovary removed ?,ఆపరేషన్‌ తో అండాశయాలు తీసివేస్తే నష్టమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : ఆపరేషన్‌ తో అండాశయాలు తీసివేస్తే నష్టమా?

Ans : మెనోపాజ్‌ అనంతరం అండాశయాలతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావిస్తుంటారు. అందుకే గర్భసంచిని తొలగించే శస్త్రచికిత్స (హిస్టెరెక్టమీ) చేసే సమయంలో చాలామందికి అండాశయాలనూ తొలగిస్తుంటారు. కానీ వీటిని కాపాడుకోవాల్సిన అవసరముందని, అకారణంగా తొలగించొద్దని తాజా అధ్యయనం సూచిస్తోంది. నెలసరి నిలిచిపోవటం (మెనోపాజ్‌) కన్నా పదేళ్ల ముందుగా అండాశయాల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న వృద్ధ మహిళలకు ఎముక క్షీణత ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ముఖ్యంగా తుంటి, నడ్డిపూస (లంబార్‌ స్పైన్‌), తొడ ఎముక ముందుభాగంలో ఎముక సాంద్రత గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. అంతేకాదు.. గుండె రక్తనాళాలు గట్టిపడటమూ అధికంగానే ఉంటున్నట్టు తేలింది. అండాశయ క్యాన్సర్‌ ముప్పు లేనివారికి హిస్టెరెక్టమీ చేసే సమయంలో అండాశయాలను తొలగించాల్సిన అవసరం లేదని, దీంతో మెనోపాజ్‌ అనంతరం మంచి ఫలితాలు ఉంటాయని గతంలో చేసిన పరిశోధనలూ సూచించాయి. తాజా అధ్యయనం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా స్త్రీలకు వయసు పెరుగుతున్నకొద్దీ ముఖ్యంగా.. నెలసరి నిలిచిపోయిన తర్వాత ఎముకలు గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌), గుండెజబ్బుల ముప్పులు పెరుగుతుంటాయి. ఇందుకు హార్మోన్ల స్థాయిలు పడిపోవటం దోహదం చేస్తుంది. నిజానికి మెనోపాజ్‌లో హార్మోన్ల మోతాదులు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ అండాశయాల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో వీటి స్థాయులు హఠాత్తుగా పడిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సమస్యలూ ముందుగానే దాడి చేయటానికి ఆస్కారం కలుగుతోందన్నమాట. వృద్ధ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌తో మరణించే వారితో పోలిస్తే.. గుండెజబ్బు, ఎముకలు గుల్లబారటం మూలంగా మంచానికి పరిమితమయ్యేవారి సంఖ్యే అధికం. అందువల్ల ఏ వయసులోనైనా గర్భసంచి తొలగించాల్సిన అవసరమొస్తే.. అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ ముప్పులు లేనివారికి అండాశయాలను అలాగే ఉంచటం మంచిదని సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన సారా జె.మకౌస్కీ చెబుతున్నారు.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?,రెండుచేతులకూ ఉన్న రక్తపోటు లో తేడా ఎక్కువ ఉంటే ప్రమాదమా?

  •  
 
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?,రెండుచేతులకూ ఉన్న రక్తపోటు లో తేడా ఎక్కువ ఉంటే ప్రమాదమా?

జ : మనం ఏ సమస్యతో వెళ్లినా డాక్టర్లు రక్తపోటు పరీక్ష కూడా చేస్తుంటారు. దీంతో రక్తపోటు ఎక్కువగా ఉంటే బయటపడుతుంది. ఇక అప్పటికే హైబీపీతో బాధపడుతుంటే రక్తపోటు అదుపులో ఉందో లేదో తెలుస్తుంది. అయితే రక్తపోటు పరీక్షను ఒక చేయికి కాకుండా.. రెండు చేతులకూ చేయటం మంచిదని బ్రిటన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుడి చేయి, ఎడమ చేయిలో రక్తపోటు కొలతల మధ్య తేడా ఎక్కువగా ఉండటమనేది పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బు, గుండెకు దూరంగా ఉండే అవయవాల్లో రక్తనాళాల సమస్యలకు (పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌) సూచిక కావొచ్చు. రెండు కొలతల మధ్య 15, అంతకన్నా ఎక్కువ పాయింట్ల తేడా గలవారికి పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ఈ కొలతల్లో 10-15 పాయింట్ల వ్యత్యాసం గలవారికి పక్షవాతం లేదా గుండె జబ్బు మూలంగా మరణించే ముప్పూ పెరుగుతున్నట్టు బయటపడింది.

ఎందుకీ తేడా?
నిజానికి రెండు చేతుల్లోనూ రక్తపోటు కొలతల్లో కొంత తేడా ఉండటం సహజమే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ ఈ తేడా 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం ఎందుకు కనబడుతుంది? యువకుల్లోనైతే.. చేతికి రక్తసరఫరా చేసే ధమనిని కండరం గానీ మరేదైనా గానీ నొక్కినపుడు లేదా రక్తసరఫరా సరిగా జరగకుండా నిరోధించే నిర్మాణలోపం వంటివి దీనికి కారణమవుతాయి. మధ్యవయసువారిలో, వృద్ధుల్లోనైతే.. రక్తనాళాల్లో పూడిక ఏర్పడటం వల్ల ఇలా రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం కనబడుతుంది. అరుదుగా మరికొందరిలో బృహద్ధమని కవాటంలో చీలిక తలెత్తినా కొలతల్లో తేడాలు వస్తాయి. అందువల్ల ఈసారి రక్తపోటు పరీక్ష చేయించుకునే సమయంలో రెండు చేతులకూ చేయించుకోవటం మరచిపోకండి. అలాగే రక్తపోటు పరీక్ష చేయించుకోవటానికి 30 నిమిషాల ముందుగా కెఫీన్‌, మద్యం, నికోటిన్‌ వంటివి తీసుకోవద్దనీ గుర్తుంచుకోండి. కొద్ది నిమిషాల సేపు ప్రశాంతంగా కూచోవాలి కూడా. ఇక పరీక్ష కోసం చేతిని ముందుకు చాచినపుడు మోచేయి గుండెకు సమానమైన ఎత్తులో ఉండేలానూ చూసుకోవాలి.

  •  *=========================== 

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Salt is not good even in children?,ఉప్పుచిన్న వయసులోనూ ముప్పేఅంటారు. నిజమేనా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఉప్పుచిన్న వయసులోనూ ముప్పేఅంటారు. నిజమేనా?

జ : యుక్తవయసులో ఆహార నియమాలేంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. కానీ చిన్నప్పటి జీవనశైలి, ఆహార అలవాట్లు పెద్దయ్యాక గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో ఉప్పూ మినహాయింపు కాదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఉప్పు ఎక్కువగా గల ఆహారాన్ని తినే యుక్తవయసు పిల్లల్లో.. ముఖ్యంగా అధిక బరువు, వూబకాయుల్లో కణాల వయసు వేగంగా తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన క్రోమోజోముల చివర టెలోమేర్స్‌ అనే రక్షణ తొడుగులు ఉంటాయి. కణాలు విభజన చెందిన ప్రతిసారీ వీటి పొడవు తగ్గుతుంది. ఇవి చాలా పొట్టిగా అయిపోయినప్పుడు కణ విభజన ఆగిపోతుంది. వయసుతో పాటు వచ్చే గుండెజబ్బు, క్యాన్సర్‌, మధుమేహం వంటి పలు సమస్యలకు ఈ కణ వయసుతో సంబంధం ఉండటం గమనార్హం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం మూలంగానూ టెలోమేర్స్‌ పొడవు తగ్గుతుంటుంది. అయితే ఉప్పు ఎక్కువగా తినటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటున్నట్టు బయటపడటం గమనార్హం. అందువల్ల అధికబరువు, వూబకాయ పిల్లలు ఉప్పును తగ్గిస్తే.. కణ వయసు ప్రక్రియ నెమ్మదించే అవకాశముందని అధ్యయన నేత, జార్జియా రెజెంట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ హైడాంగ్‌ ఝు పేర్కొంటున్నారు. ఉప్పుతో కూడిన పిజ్జాలు, చిప్స్‌ వంటివి యుక్తవయసు పిల్లలు ఎక్కువగా తింటుంటారు. కేవలం వీటిల్లోనే కాదు.. కొన్నిరకాల బ్రెడ్స్‌, అల్పాహార తృణధాన్యాలు, సాస్‌లల్లోనూ ఉప్పు మోతాదు అధికంగానే ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

When do we eat last meal of the day-రోజులో చివరి ఆహారము ఎప్పుడు తీసుకోవాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  రోజులో చివరి ఆహారము ఎప్పుడు తీసుకోవాలి?.

జ : ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి అంటారు మన పెద్దేలు . ..కాని ఆరోగ్యానికి అందానికి ఆహారం చాలా ముఖ్యం. అదే ఆహారం వేళ కాని వేళల్లో తింటే అధిక బరువుకు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. రోజులో చివరి ఆహారం అంటే... రాత్రి భోజనం నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందే తింటే మంచిది. అందులోనూ రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్య భోంచేస్తే ఇంకా మేలు. రాత్రిపూట ఎక్కువగా తినేసి వెంటనే నిద్రపోతే శరీరంలో కొవ్వు చేరిపోవడమే కాదు, నిద్ర కూడా అరకొరగానే పడుతుంది. సాధారణంగా ఎవరికైనా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య బాగా ఆకలేస్తుంది. ఆ సమయంలో ఏవో చిరుతిళ్లు తినేయడం వల్ల రాత్రి ఆహారం ఎనిమిదికల్లా తినం. కనుక సాయంత్రం వేళల్లో మిర్చీలూ, బజ్జీలూ, పకోడీల్లాంటివి ఎక్కువగా తినేయకుండా చాలా తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోవాలి. ఒక యాపిల్‌ పండు లేదా గుప్పెడు నట్స్‌ తింటే మంచిది. పని ఒత్తిడితో నిద్రపోవడానికి కాస్త ముందే భోంచేయాల్సి వస్తే మితంగా తినే ప్రయత్నం చేయాలి. లేదంటే నిద్రపోయాక జీర్ణక్రియ చాలా మందకొడిగా సాగుతుంది. అజీర్తి సమస్యలు ఎదురవుతాయి.

  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, September 14, 2014

Less weight is dangerous?,బరువు తక్కువున్నా ప్రమాదమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  Less weight is dangerous?,బరువు తక్కువున్నా ప్రమాదమేనా?

జ : అధికబరువుతో రకరకాల అనర్థాలు పొంచి ఉన్న మాట నిజమే. కానీ తక్కువ బరువునూ తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. ఎందుకంటే శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) సాధారణ స్థాయిలో (18.5-25.9) గలవారి కన్నా తక్కువ బీఎంఐ (18.5, అంతకన్నా తక్కువ) గలవారికి రకరకాల కారణాలతో మరణించే ముప్పు 1.8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే వూబకాయులకు (బీఎంఐ 30-34.9) మరణ ముప్పు 1.2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక బీఎంఐ 35, అంతకంటే ఎక్కువగల ఊబకాయులకు ఈ ముప్పు 1.3 రెట్లు ఎక్కువని తేలింది. అంటే వూబకాయం కంటే తక్కువ బరువే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నమాట. మన బీఎంఐ కేవలం శరీరంలోని కొవ్వును మాత్రమే కాదు. కండరాల మోతాదునూ ప్రతిబింబిస్తుంది. అందువల్ల వూబకాయాన్ని తగ్గించే విషయంలో కొవ్వు, కండరాల, ఎముక మోతాదులు తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ జోయెల్‌ రే చెబుతున్నారు.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

మన పేగుల్లో మంచి బాక్టీరియా కూడా ఉంటుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బాక్టీరియా అంటే మనకు హానిచేసేవి అని అంటారు కాని మన పేగుల్లో మంచిబాక్టీరియా ఉంటుందని విన్నాను నిజమేనా?.

జ : మంచి బ్యాక్టీరియా : మన పేగుల్లో 500 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వీటిల్లో హాని చేసేవే కాదు. మేలు చేసేవీ ఉంటాయి. మన ఆహారం, జీవనశైలి ఈ బ్యాక్టీరియా సరైన పాళ్లలో ఉండేందుకు తోడ్పడతాయి. ఎప్పుడైనా మంచి బ్యాక్టీరియా తగ్గిపోయినప్పుడు డాక్టర్లు మాత్రల రూపంలో ప్రొబయోటిక్స్‌ ఇస్తుండటం తెలిసిందే. అయితే మాత్రల అవసరం లేకుండా సహజంగానే మంచి బ్యాక్టీరియాను పెంచుకునే అవకాశమూ ఉంది.

* పెరుగు : రోజూ పెరుగు తినటం మూలంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

* పీచు : మనం తినే ఆహారాన్నే పేగుల్లోని బ్యాక్టీరియా తిని జీవిస్తుంది. మంచి బ్యాక్టీరియా పీచును.. చెడ్డ బ్యాక్టీరియా చక్కెర, మద్యపానాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అందువల్ల పీచు దండిగా ఉండే ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాల వంటివి తింటే మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, September 13, 2014

Is good to reuse oils onec used in cooking?,నూనెలు మిగిలితే తిరిగి వాడొచ్చా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  Q :   Is good to reuse oils onec used in cooking?,నూనెలు మిగిలితే తిరిగి వాడొచ్చా?

Ans : పిండి వంటకాలో, వేపుళ్లో చేసుకున్నప్పుడు చాలాసార్లు నూనె మిగిలిపోతుంటుంది. దీన్ని పోపు పెట్టటానికో, వేపుళ్లు చేయటానికో తిరిగి వాడుతుంటారు. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగించినపుడు దానిలోంచి విశృంఖల కణాలు పుట్టుకొచ్చి రకరకాల జబ్బులకు దారితీసే అవకాశముంది. విశృంఖల కణాలు క్యాన్సర్‌ కారకాలు కావటం వల్ల దీర్ఘకాలంలో కొన్నిరకాల క్యాన్సర్లనూ తెచ్చిపెట్టొచ్చు. ఛాతీలో మంట, గుండెజబ్బు, అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి జబ్బుల ముప్పూ పొంచి ఉంటుంది. కాబట్టి మిగిలిపోయిన నూనెను వాడటంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుష్ప్రభావాలను తగ్గించుకునే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు.

* మిగిలిపోయిన నూనెలను ఎన్నిసార్లు వాడుకోవచ్చనేది నూనెల రకాలు, వేడి చేసిన సమయం, ఎలాంటి పదార్థాల తయారీకోసం వినియోగించారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

*మిగిలిపోయిన నూనె పూర్తిగా చల్లబడిన తర్వాత శుభ్రంగా వడపోసి గాలిదూరని సీసాలో భద్రపరచుకోవటం మంచిది. దీంతో నూనెలోని ఆహార పదార్థాలు తొలగిపోతాయి. త్వరగా చెడిపోకుండా ఉంటుంది.

* ఈ నూనెల రంగు, చిక్కదనాన్ని కూడా గమనిస్తుండాలి. రంగు బాగా ముదిరినట్టు కనిపించినా, మరీ చిక్కగా ఉన్నట్టు తోచినా వెంటనే నూనెని వాడకపోవటమే మంచిది.

* కాస్త వేడెక్కగానే నూనెలోంచి పొగ వస్తున్నట్టయితే అందులో 'హెచ్‌ఎన్‌ఈ' అనే హానికారక పదార్థం ఉండే అవకాశముంది. హెచ్‌ఎన్‌ఈకి పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌, కాలేయ వ్యాధి వంటి జబ్బులతో సంబంధం ఉండటం గమనార్హం.

* నిజానికి అన్ని నూనెలు ఒకే రకమైనవి కావనీ గుర్తించాలి. కొన్ని వేడిని ఎక్కువగా తట్టుకుంటే మరికొన్ని తక్కువ వేడికే పొగలు కక్కుతాయి. వేడిని ఎక్కువగా తట్టుకునే పొద్దుతిరుగుడు నూనె, తవుడు నూనె, పల్లీ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె వంటివి వేపుళ్లకు, పిండి పదార్థాల తయారీకి బాగా పనికొస్తాయి. ఇక వేడిని అంతగా తట్టుకోని ఆలివ్‌ నూనె వంటివి పోపుళ్ల వంటి తక్కువ వేడి అవసరమైనవాటకి పనికొస్తాయి. అందువల్ల వంటకాలకు అనుగుణంగా తగిన నూనెని ఎంచుకోవటం మేలు.

ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే.. తిరిగి వేపుళ్లకు వాడకూడదని గుర్తుంచుకోవాలి.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

What is Soluble and insoluble fiber ?,సాల్యుబుల్ ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండింటికీ ఉన్న తేడా ఏమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటారు కదా, ఈ రెండింటికీ ఉన్న తేడా ఏమిటి?

జవాబు : సరియైన జీర్ణశక్తికి రెండు రకాలు కీలకమైనవే.అయితే ఒక్కోదానికి ఒక్కో పని , ప్రక్రియ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్  ఓట్ బ్రాన్‌ , బార్లీ , నట్స్ , పప్పు గింజలు , బీన్స్ లలో అత్యధికం గా ఉంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణశక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీనివలన శరీరము ఎక్కువ పోషకాలను గ్రహించగలదు ,
ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ -- వీట్ బ్రాన్‌, కూరగాయలు , పూర్తి ష్థాయి  ధాన్యాలలో  లలో ఎక్కువగా లభిస్తుంది. కోలన్‌ద్వార వృదాపదార్ధాలు తోసివేయబడ్డాయ. దీని వలన మలబద్దకం అనే ప్రోబ్లం ఉండదు.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

What is Spa treatment?, స్పా-చికిత్సలు అంటే ఏమిటి? జాగ్రత్తలేమైనా ఉన్నాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : What is Spa treatment?, స్పా-చికిత్సలు అంటే ఏమిటి? జాగ్రత్తలేమైనా ఉన్నాయా?

జ : స్పా(spa) అంటే సౌందర్య సంరక్షణకోసం కావచ్చు.. అలసిన శరీరానికి సాంత్వన నందించేందుకు కావచ్చు మినరల్ రిచ్ ... స్ప్రింగ్ వాటర్ గాని సముద్రం వాటర్ గాని వాడి మెడిషినల్ బాత్ ఇవ్వడము . కొన్ని రకాల నూనెలతో మసాజ్ చేయడము జరుగుతుంటుందీ క్లినిక్ లలో. ఈ విధానము మొదటిగా బెల్జియం దేశములో "స్పా" అనే  పట్టణములో అంకురార్పణం జరగడము వలన  స్పా చికిత్స అని పేరు వచ్చినది. ఐరన్‌ మరియు ఖనిజ లవణాలు లోపము వలన అనేక ఆరోగ్య రుగ్మతలు వచ్చేవని రోమనులు భావించేవారు.. . అందుకే ఈ విధమైన స్పా చికిత్సలు . ఇవి ఒక విధంగా బ్యూటీ పార్లర్ లాంటివే.
    సౌందర్య సంరక్షణకోసం కావచ్చు.. అలసిన శరీరానికి సాంత్వన నందించేందుకు కావచ్చు. ''స్పా'' లల్లో చికిత్స తీసుకోవాలనుకుంటున్నవారు . . . ఈ జాగ్రత్తలూ పాటించండి.

* ఫలానా సమస్య ఉంది. చికిత్స చేయించుకోవచ్చా అని సందేహిస్తుంటారు కొందరు. చెప్పాలంటే స్పా చికిత్సలు ఎవరైనా చేయించుకోవచ్చు అయితే గర్భిణులూ, నెలసరి సమయంలో, ఏదయినా శస్త్రచిక్సితో చేయించుకున్నప్పుడూ, జ్వరంగా ఉన్నప్పుడూ, చర్మసమస్యల్లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రం చికిత్స తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ముందే అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా చికిత్సకు వెళ్లేముందు వైద్యుల సలహా పాటించడం చాలా అవసరం.

* చికిత్స తీసుకునేందుకు గంట ముందు ఏమీ తినకపోవడం, తాగకపోవడం మంచిది. దానివల్ల మీకు ఆ సమయంలో ఏ ఇబ్బందీ కలగకుండా ఉంటుంది. చికిత్స పూర్తయ్యాక ఎంతసేపటి తరవాత నీళ్లు తాగాలి, ఆహారం తీసుకోవాలనేది ముందే అడిగి తెలుసుకోవడం మంచిది.

* స్పాలకు వెళ్లి చికిత్సలు తీసుకునే ముందు.. ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. సాధ్యమైంతవరకూ మీకు సౌకర్యంగా, సులువుగా మార్చుకునేవి అయ్యుంటే మంచిది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, September 11, 2014

మెనోపాజ్‌ తరవాత కలయిక అసౌకర్యంగా ఉంటుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పెళ్లయినప్పటినుంచీ నేను లైంగికచర్యను ఆనందిస్తున్నా. ఇప్పుడు నా వయసు యాభై సమీపిస్తోంది. మెనోపాజ్‌ తరవాత జననేంద్రియాల్లో మార్పు వస్తుందని విన్నా. అది నిజమైతే ఎలాంటి మార్పులు జరుగుతాయి? కలయిక అసౌకర్యంగా ఉంటుందా?

జ : మెనోపాజ్‌ దశ మొదలయ్యాక అండాశయాలు ఈస్ట్రోజెన్‌ విడుదలను ఆపేస్తాయి. దాంతో మెనోపాజ్‌లో జననేంద్రియాలు పొడిబారతాయి. అంతేకాదు కలయిక సమయంలో సంకోచవ్యాకోచాలు చాలామటుకు తగ్గుతాయి. ఈ సమయంలో ఈస్ట్రోజెన్‌ని చాలా తక్కువ మోతాదులో జననేంద్రియాల నుంచి తీసుకోవడంతో ఇలాంటి సమస్యల్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. అందుకు వైద్యుల సూచన మేరకు క్రీంలు వాడొచ్చు. అవి వాడుతున్నా జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలంటే మెనోపాజ్‌ దశలోనూ క్రమం తప్పకుండా లైంగికచర్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జననేంద్రియాల కండరాలు దృఢంగా మారతాయి. అప్పుడు కొంత అసౌకర్యం ఉన్నా, కలయిక సమయంలో సంకోచవ్యాకోచాలు సరిగ్గా ఉంటాయి. సాధారణంగా ఆ అసౌకర్యాన్ని నివారించడానికి వైద్యులు ఎక్కువసేపు పనిచేసే వెజైనల్‌ మాయిశ్చరైజర్లను సూచిస్తారు. వాటిని వాడుతూనే కలయికలో పాల్గొనడం వల్ల మెనోపాజ్‌లో ఎదురయ్యే బాధా, అసౌకర్యం తగ్గుతాయి.

  • courtesy with : Dr.Sharmila Mujundhar(sexologist) Hyd.

 *===========================

గర్భివతిని. వెజైనా చాలా టెండర్ ( నొప్పి) గా ఉంటున్నది. కారనమేమిటి?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను 2 నెలల గర్భివతిని. వెజైనా చాలా టెండర్ గా ఉంటున్నది. విరోచనము అయ్యేటపుడు కూడా నొప్పిగా ఉంటున్నది. కారనమేమిటి?.

జ : గర్భము ధరించాక శారీరక హార్మోన్లలో తేడాలు వస్తాయి. దీని వలన వాతులు , ఉదరములో ఇబ్బందులు , వికారము , కడుపుబ్బరము , స్తనాలలో బవువెక్కడము వంటి తేడాలు కనబడతాయి. వెజైనాకు రక్తప్రసరణ ఎక్కువవుతుంది. (congestion of vagina) వీటితో పాటు తరచు మూత్రానికి వెళ్ళాల్సిరావడము , మలబద్దకం ఉంటాయి. అందువలన వెజైనా నొప్పిగాను , బరువుగాను ఉంటుంది. వ్యాయామము(నడక) చేస్తూ డాక్టర్ ని సంప్రందించి తగిన చికిత్స తీసుకోవాలి.
మలబద్దకం కోసము " ఇసాబ్ గల్ " అనే ప్రభావవంతమైన ఆయువేదిక్  లాక్జేటివ్ ను రాత్రివేళ ఒక  గ్లాసునీటిలో కలుపుకొని క్రమము తప్పకుండా  తాగుతుంటే విరోచనము సాఫీ గా అవుతుంది.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

పొట్టదగ్గర ఫ్యాట్ (కొవ్వు)పెరుగుతుంది.ఏంచేయాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నేను స్లిమ్‌గానే ఉంటాను ... కాని పొట్టదగ్గర ఫ్యాట్ (కొవ్వు)పెరుగుతుంది.ఏంచేయాలి?.

జ : ఎవరి శరీరం లొనైనా ఉదరం బాగా పాపులర్ స్టోరేజ్ ఏరియా. మనము ఎక్ష్ట్రా ఏమితిన్నా అది పొ్ట్టబాగానే మొదటిగా స్టోరేజ్ అవుతుంది. కొంతమందిలో గ్యాస్ ట్రబుల్ ఉన్నా ... ఈ పొట్టబాగానే కొవ్వు పెరుగుతుంది. తినే ఆహారములో పోషకాల పట్ల శ్రద్ద తీసుకోండి. ముఖ్యముగా జంక్ ఫుడ్స్ తినకూడదు. చెక్కెరలు , కొవ్వుప్దార్ధాలకు దూరముగా ఉండాలి . ఎప్పుడైనా అయితే పరవాలేదు కాని ... రోజూ అదేపనిగా తినకూడదు. పీచుపదార్ధము గల కార్బోహైడ్రేట్స్ , రాగులు వంటి గింజధాన్యాలు తింటూఉండండి. నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. రోజూ వ్యాయామము (నడక, సైక్లింగ్ , యోగా) చేస్తూఉండాలి. మన నిత్యజీవితములో వ్యాయామము ఒక ముఖ్య బాగంగా చేస్తూఉండాలి. 

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, September 2, 2014

What type of food to take for constipation, మలబద్దకకం వస్తోంది.ఎటువంటి ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : మా బాబు వయసు 7 సంవత్సరాలు , తరచూ మలబద్దకకం వస్తోంది. ఎటువంటి ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి?

జ : మలబద్ధకాన్ని తొలగించే ఉత్తమ పదార్ధాలు మంచినీరు , పీచుపధార్ధము . మంచినీరు ఎక్కువగా త్రాగేలా చూడంది. పండ్లు  ... ఆప్రికోట్స్ , ప్లమ్స్ , ఫియర్స్ , ఆరెంజ్  లలో పీజు ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ , బార్లీ , బ్రౌన్‌ బ్రెడ్ వంటివి ఎక్కువగా తినేలా చూడాలి.

వైట్ బ్రెడ్ , పిస్తా , కుకీలు తినకూడదు ... ఎక్కువ పాలు తాగుతుండడం వలన కూడా మలబద్దకం వస్తుంది. ఈ మార్పులన్నీ క్రమముగా చేయాలి . ఒక్కరోజులో అన్నీ మార్చేయవద్దు.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, September 1, 2014

అవాంచిత రోమాల తొలగింపుకు లేజర్ పద్దతి మంచిదేనా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : అవాంచిత రోమాల తొలగింపుకు లేజర్ పద్దతి మంచిదేనా?

జ : మంచిదే . . . ఎన్‌.డి.యాగ్  లేదా డియోడ్ లేజర్ ద్వారా అవాంచితరోమాల తొలగింపు సురక్షిత మార్గము . ఇదేమంత ఖరీదైన ప్రక్రియ కాదు . జీవితకాల పెట్టుబడి లాంటిది. అవాంచిత రోమాల తొలగింపుకు 6-8 సిట్టింగ్స్ అవసరమవుతాయి.  అయితే ఇటువండి చికిత్సలకు వెళ్లేముందు పార్తి హార్మోనల్ చెకప్ అవసరము . ఏవిధమైన హార్మోనల ఇబ్బందీ లేదనుకున్నాప్పుడే చికిత్స ఆరంభించాలి. మంచి ఫలితాలూ ఉంటాయి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

గర్భము తొలి నెలల్లో ఐరన్‌-కాల్సియం -బికాంప్లెక్ష్ సప్లిమెంట్స్ వాడవచ్చునా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఏడు వారాల గర్భవతిని. మందులు వేసుకోవాలేమోఅన్న ఆలోచనవల్ల సిక్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది . ఐరన్‌, క్యాల్సియం , బి కాంప్లెక్ష్ వంటి సప్లిమెంట్లు రోజూ వాడవలసిందేనా?.

జ : తొలి పన్నెండు వారాల్లో బిడ్డ పతి అవయము రూపుదిద్దుకుంటుంది. ఈ తొలి మూడు నెలల్లో మందులు వాడకూడదన్నది (అవసరమైతే మినహా) ప్రాథమిక నిబంధన . 16 వారాలు పూర్తయ్యేదాకా ఐరన్‌ , క్యాల్సియం , బి కాంప్లెక్ష్ సప్లిమెంట్లు అవసరం లేదు.  పైగా తొలి 4 వారాల్లోపు  వికారము , వాంతులు ఎక్కువగా ఉంటాయి. కనుక ఐరన్‌ వాడితే ఈ లక్షణాలు కొంచెము పెరగవచ్చును . ఈ దశలో ఫోలిక్ యాసిడ్ మాత్ర చాలు. పండ్లు , కాయగూరలు , పాలు ఎక్కువగా ఇస్తుండాలి. మీరు బలహీనముగా ఉంటే-తప్ప ఏ మందులు (సప్లిమెంట్సు ) అవసరము ఉండదు. 4 గో నెలనుండి మాతము సప్లిమెంట్స్ వాడవలసినదే.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

సన్‌స్క్రీన్‌ రాస్తున్నా నా చర్మము దురదగా , ప్యాచీగా ఉంటున్నది ... ఏమి చేయాలి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : సన్‌స్క్రీన్‌ రాస్తున్నా నా చర్మము దురదగా , ప్యాచీగా ఉంటున్నది ... ఏమి చేయాలి?

జ : సూర్య కిరణాలు ఎక్కువగా తగలడము ఒక కారణము . దురద చర్మము అనేది సన్‌బర్న్‌ లో ఓ భాగము . పైగా ఎక్కువగా చెమటి పోసినప్పుడు చర్మము పై ఉండే ఫంగస్ బాగా పెరిగిపోతుంది. అది చర్మము పై ఎక్కడైతే ఉంటుందో అక్కడ పిగ్మెంట్ ను తొలగిస్తుంది ... కావున తెల్లని ప్యాచ్ లు వస్తుంటాయి . దీనికి గల్ ఏకైక పరిష్కారము సన్‌స్క్రీన్‌ అప్లై చేయడము . ఎస్.పి.ఎఫ్  50 గల బ్రాడ్ స్పెక్ట్రం వాడండి ... అది వాటర్ ఫ్రూఫ్ , స్వెట్ ప్రూఫ్ అయిఉండాలి . ఎండలో 3 గంటలకంటే ఎక్కువ సేపు ఉంటే తిరిగి అప్లయ్ చేయాలి. సరైన కవరేజ్ కోసము కనిసము ఒక టీ ప్పూన్‌ సన్‌స్క్రీన్‌ ను ఒక్కోసారి వాడుతూవుండాలి .
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Increase in weight if sleeps lights on ?,లైట్లేసుకుని నిద్రపోతే లావవుతారా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : లైట్లేసుకుని నిద్రపోతే లావవుతారా?

జ : లండన్‌: బాగా కాంతిమంతంగా ఉండేపరిసరాల్లో నిద్రించేవారు బరువు బాగా పెరుగుతారని పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రివేళల్లో లైట్లేసుకుని హాయిగా నిద్రపోయాం అనుకునేవారిలో బరువు పెరుగుదల స్పష్టంగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బీఎంఐ, పొట్ట, నడుము చుట్టుకొలతలు బాగా పెరిగినట్లు తేలింది. బరువుపెరుగుదలకు...రాత్రివేళల్లో కాంతిమంతమైన పరిసరాల్లో నిద్రించడానికి స్పష్టమైన సంబంధం ఉన్నట్లు తేలినప్పటికీ, అది ఎలాసాధ్యపడుతోందనే అంశంపై ఈ దశలో తమ వద్ద కచ్చితమైన రుజువులేవీ లేవని శాస్త్రవేత్తల బృంద సారథి ఆంటోనీ స్వెర్‌డ్లో తెలిపారు.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Is it good to climbing staircase daily?,రోజూ మెట్లెక్కుతున్నాను.ఆరోగ్యానికి మంచిదేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : రోజూ మెట్లెక్కుతున్నాను.ఆరోగ్యానికి మంచిదేనా?

జ : దినచర్యలో భాగంగా తరచూ మెట్లెక్కుతుంటాం.. అయితే అది కూడా వ్యాయామ మార్గాల్లో ఒకటని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఇది అత్యంత సులువైన వ్యాయామం. రోజూ కాసేపు మెట్లెక్కి దిగితే సరిపోతుంది. నడుము కిందిభాగంలోని కండరాలకు శక్తి అందుతుంది. వాటి పనితీరు బాగుంటుంది. శరీరం తీరుగా మారుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలూ తగ్గుతాయి. సులువుగా కెలొరీలు కరుగుతాయి. దాంతో సన్నబడటం తేలికవుతుంది. ముఖ్యంగా బరువున్న వారు ఏడాది పొడవునా రోజుకోసారి మెట్లెక్కి దిగడం చాలా అవసరం. దానివల్ల శరీరానికి సరైన వ్యాయామం అందుతుంది. సులువుగా బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే హార్ట్ ఎటాక్ (IHD)లేదా గుండె పోటు ఉన్నవారు ఈ వ్యాయామము చేయకూడదు. . . గుండెపోటు ఎక్కువయ్యే ప్రమాదముంది.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -