Wednesday, February 9, 2011

చిన్నపిల్లలకు మాంసాహారము ఏ వయస్సు నుండి క్షేమకరము ?,From which age onwards non-vegeterian is good for children?



ప్ర : చంటి పిల్లలకు ఏ నెల నుండి మాంసాహారము పెట్ట వచ్చును ?
ప్రభావతి -- శ్రీకాకుళం టౌన్‌.
జ : పసి పిల్లలకు పాలు పౌష్టికాహారము . తల్లి పాలు ఉన్నంతవరకూ పిల్లలకు ఇవ్వడము ఉత్తమము . సోలిడ్ ఫుడ్ ఇవ్వడం శాఖాహారము తో ప్రారంభంచాలి . ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టము . జంతు సంబంధిత ప్రోటీన్లు అయితే మరీ కష్టము గా జీర్ణం అవుతాయి . మాంసాహారాన్ని ఆరంభించే ముందు పిల్లల జీర్ణవ్యవస్థ సదరు ప్రక్రియకు సిద్ధం గా ఉండాలి . మాంసాహారము ఇచ్చే ముందు సాదారణ పప్పుదినుసులలోని ప్రోటీన్లు తినిపించి జీర్ణకియ శక్తిని తెలుసుకొని ... తొమ్మిది నెలల వయస్సులో చికెన్‌ సూప్స్ తో మొదలు పెట్టవచ్చు . ఆ తరువాత గ్రైండ్ చేసిన మీట్స్ పరిచయం చేయాలి . చిన్న చిన్న చికెన్‌ ముక్కలి ఎప్పుడు పెట్టాలనేది ... పిల్లకు పళ్ళు రావడం పై అదారపడి ఉంటుంది .

  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS