Sunday, January 22, 2012

పి.ఎం.ఎస్. premenstrual syndrome




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : ఋతుక్రమానికి ముందువచ్చే లక్షణాలను (పి.ఎం.ఎస్)ఏవిధముగా తగ్గించుకోవచ్చును ?.

A : p.m.s -- పి.ఎం.ఎస్. అనగా premenstrual syndrome . . . బయట లేదా బహిస్ట పడే ముందు కలిగే బాధల సముదాయము . ఒకొక్కరికి ఒక్కోవిధముగా చిరాకు పెట్టే అనరోగ్య సమస్య. దీనిలో శారీరక మరియు మానసిక లక్షణాలు మిలితమై ఉంటాయి.
లక్షణాలు : మూడు ప్రముఖ లక్షణాలు -- చిరాకు , ఒత్తిడి , మరియు మనస్సుకు అసౌకర్యమైన స్థితి . నిద్రలేమి , తలనొప్పి , అలసట , లిబిడోమార్పులు ,

ప్రమాద కారకాలు :
  • హై కెఫిన్‌ తీసుకోవడము ,
  • ఒత్తిడికి గురికావడము ,
  • వయసు పెరుగుతున్న చరిత్ర ,
  • కుటుంబ చరిత్ర ,
  • ఆహార కారకాలు : ముఖ్యము గా మెగ్నీషియం , విటమిన్‌ ఇ , విటమిం డి , తక్కువ స్థాయి లో ఉండడము ,

కారణము :
  • రక్తము లో " ప్రోలాక్టిన్‌ " హార్మోన్‌ అతిగా ఉండడము లేదా ఈ హార్మోన్‌ అసాధారణ స్పందన పి.ఎం.ఎస్ లక్షణాలకు కారణమని పరిశోధకుల అంచనా.
చికిత్స :
ఆహారము లేదా జీవన శైలి లో మార్పులు వలన దీని ప్రబావము తగ్గించవచ్చును ,
సెరిటోనిన్‌ రీఅప్టేక్ (seritonin re-uptake) అవరోధకాలు వలన
  • =================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, January 10, 2012

Winter and makeup , శీతాకాలం మేకప్‌ వేసుకునే ముందు జాగ్రత్తలు .


  • image : courtesy with Eenadu news paper (vasundara )

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నా విధుల్లో భాగంగా ప్రతిరోజూ మేకప్‌ తప్పనిసరి. కానీ దానికోసం అరగంట నుంచి ముప్పావు గంటదాకా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఆ సమయాన్ని తగ్గించి.. సులువైన అలంకరణ చేసుకోవడం సాధ్యమవుతుందా. మేకప్‌ వేసుకునేముందు ఈ కాలంలో జాగ్రత్తలేమైనా తీసుకోవాల్సి ఉంటుందా?

A : ఏ కాలమైనా సరే.. చిన్నచిన్న అంశాలపై దృష్టిసారిస్తే.. సులువుగా మేకప్‌ చేసుకోవచ్చు. శీతాకాలంలో.. మేకప్‌ వేసుకునే ముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. దానికి బదులుగా మేకప్‌ సీరమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. నాలుగైదు చుక్కలు రాసుకుంటే.. ఎక్కువ సమయం తాజాగా కనిపించవచ్చు. ఇది శీతాకాలం కాబట్టి లిక్విడ్‌ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. చలికాలంలో పాన్‌ కేక్‌ మేకప్‌నకు దూరంగా ఉండాలి. చాలా తక్కువగా పౌడర్‌ను అద్దుకోవాలి. చలికాలమంటే.. కళ్లు కూడా పొడిబారి ఉంటాయి కాబట్టి ఐలైనర్‌ లేదా కాటుకను కొద్దిగా రాసుకోవాలి. పెదవులకు విటమిన్‌ ఇ సుగుణాలున్న లిప్‌స్టిక్‌లు ఎంచుకొంటే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. బ్లషర్‌ అవసరం లేదు. పగటివేళకు నప్పే ఈ అలంకరణ చేసుకోవడానికి కేవలం పదిహేను నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

  • =================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

winter and skin care , చలికాలములో చర్మ రక్షణ



  • image : courtesy with Eenadu news paper-Vasundara.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నా వయసు ఇరవైరెండు. చలికాలం మొదలవుతోందంటే చాలు.. చర్మం, పెదవులు పొడిబారడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఈ సమయంలో హెన్నా కూడా ఎక్కువగా పెట్టుకోకూడదంటారు. ఈ సమస్యల్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో వివరించండి.

A : ఈ కాలంలో కురులు బిరుసుగా మారడం సర్వసాధారణం. దాన్ని నివారించాలంటే.. వారానికి కనీసం రెండుసార్త్లెనా తలకు గోరువెచ్చని నూనె రాసుకుని గంటయ్యాక తలస్నానం చేస్తే ఎంతో మార్పు ఉంటుంది.ఈ కాలంలో నెలకు రెండుసార్లు మాత్రమే హెన్నా పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువసార్లు పెట్టుకోవాల్సి వస్తే.. ముందుగా తలకు నూనె రాసుకోవడం తప్పనిసరి. నూనె వద్దనుకుంటే.. హెన్నా ఇలా తయారు చేసుకుని చూడండి. కప్పు హెన్నా పొడిలో పావుకప్పు ఉసిరిక పొడి, నాలుగు చెంచాల మందారాకుల పొడి, చెంచా నూనె కలిపి పెట్టుకుంటే.. జుట్టు ఒత్తుగా, పట్టుకుచ్చులా మెరుస్తుంది. హెన్నా తయారీలో నిమ్మరసం చేర్చడం వల్ల చుండ్రు సమస్య కూడా చాలామటుకు అదుపులో ఉంటుంది. హెన్నా ఎలా తయారుచేసుకున్నా.. గంటయ్యాక కడిగేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందని.. ఈ కాలంలో మంచినీళ్లు ఎక్కువగా తాగరు చాలామంది. కానీ పెదవులు పొడిబారకుండా ఉండాంటే.. మంచినీళ్లు సమృద్ధిగా తాగాలి. అలాగే రాత్రిళ్లు పేరిన నెయ్యి రాసుకుంటే.. పొడిబారి పగలకుండా ఉంటాయి. పగలు విటమిన్‌ ఇ తో చేసిన లిప్‌బామ్‌లు ఎంచుకోవాలి. బదులుగా బాదం నూనె లేదా తేనె కూడా రాసుకోవచ్చు. చర్మం కాంతిమంతంగా ఉండాలంటే.. పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. కనీసం పదిరోజులకోసారైనా స్నానానికి ముందు శరీరమంతా నూనె పట్టించి మర్దన చేసుకోవాలి. ప్రతిరోజు రెండుపూటలా విటమిన్‌ ఇ సుగుణాలున్న మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • =============================


visit my website - > Dr.Seshagirirao-MBBS