Tuesday, January 10, 2012

winter and skin care , చలికాలములో చర్మ రక్షణ



  • image : courtesy with Eenadu news paper-Vasundara.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు. ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నా వయసు ఇరవైరెండు. చలికాలం మొదలవుతోందంటే చాలు.. చర్మం, పెదవులు పొడిబారడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఈ సమయంలో హెన్నా కూడా ఎక్కువగా పెట్టుకోకూడదంటారు. ఈ సమస్యల్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో వివరించండి.

A : ఈ కాలంలో కురులు బిరుసుగా మారడం సర్వసాధారణం. దాన్ని నివారించాలంటే.. వారానికి కనీసం రెండుసార్త్లెనా తలకు గోరువెచ్చని నూనె రాసుకుని గంటయ్యాక తలస్నానం చేస్తే ఎంతో మార్పు ఉంటుంది.ఈ కాలంలో నెలకు రెండుసార్లు మాత్రమే హెన్నా పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువసార్లు పెట్టుకోవాల్సి వస్తే.. ముందుగా తలకు నూనె రాసుకోవడం తప్పనిసరి. నూనె వద్దనుకుంటే.. హెన్నా ఇలా తయారు చేసుకుని చూడండి. కప్పు హెన్నా పొడిలో పావుకప్పు ఉసిరిక పొడి, నాలుగు చెంచాల మందారాకుల పొడి, చెంచా నూనె కలిపి పెట్టుకుంటే.. జుట్టు ఒత్తుగా, పట్టుకుచ్చులా మెరుస్తుంది. హెన్నా తయారీలో నిమ్మరసం చేర్చడం వల్ల చుండ్రు సమస్య కూడా చాలామటుకు అదుపులో ఉంటుంది. హెన్నా ఎలా తయారుచేసుకున్నా.. గంటయ్యాక కడిగేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందని.. ఈ కాలంలో మంచినీళ్లు ఎక్కువగా తాగరు చాలామంది. కానీ పెదవులు పొడిబారకుండా ఉండాంటే.. మంచినీళ్లు సమృద్ధిగా తాగాలి. అలాగే రాత్రిళ్లు పేరిన నెయ్యి రాసుకుంటే.. పొడిబారి పగలకుండా ఉంటాయి. పగలు విటమిన్‌ ఇ తో చేసిన లిప్‌బామ్‌లు ఎంచుకోవాలి. బదులుగా బాదం నూనె లేదా తేనె కూడా రాసుకోవచ్చు. చర్మం కాంతిమంతంగా ఉండాలంటే.. పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. కనీసం పదిరోజులకోసారైనా స్నానానికి ముందు శరీరమంతా నూనె పట్టించి మర్దన చేసుకోవాలి. ప్రతిరోజు రెండుపూటలా విటమిన్‌ ఇ సుగుణాలున్న మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • =============================


visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.