Thursday, December 24, 2009

డెలివరీ తర్వాత శారీరకం గా మార్పులు ఏమిటి, Body changes after delivery


ప్ర : ప్రసవం తర్వాత శారీరకం గా అనేక మార్పులు సంభవిస్తాయి కదా ! వాటి జాగ్రత్తలు ఏమిటి?.

: బిడ్డ పుట్టిన కొద్ది సేపటి నుంచే శరీరము వెనుకటి స్థాయికి వెల్ల నారంభిస్తుంది . గర్భసంచి కుంచించుకు (ReductionInSize) పోవడం ఆరంభిస్తుంది. దీని వల్ల "క్రామ్ప్స్ (AbdominalCramps) కు దారితీస్తుంది .

గర్భధారణ సమయం లో మందం గా అయిన యుటెరిన్ లైనింగ్ యశా స్థాయికి నెమ్మదిగా వస్తుంటుంది . ముందుగా రక్తస్రావము నిండు ఎరుపు లో ఎక్కువగా ఉంటుంది ... రాను రాను తేకికపడి రంగు గులాబీ నుంచి తెలుపుకు వచ్చేస్తుంది . ఒక వేల డిశ్చార్జి అకస్మాత్తుగా మారి నిండు ఎరుపు రంగులోకి వచ్చినట్లయితే పనులు (ఇంటిపనులు)ఎక్కువ గా , త్వరగా ఆరంభించారని అర్ధము . అలా అయితే పనులు తగ్గించాలి. ప్రసవము తర్వాత ఆరు వారాలకు గర్భసంచి ...గర్భము దాల్చడానికి మున్డుమాదిరి ఆకృతికి చచ్చేసి , డిశ్చార్జి ఆగిపోతుంది . సాదారణము గా (NormalDelivery) ప్రసవము అయినట్లయితే జననామ్గానికి , ఏనాస్ కు నడుమ ప్రసవ సమయం లో చిన్న కోతపెడతారు కనుక నొప్పిగా ఉంటుంది . హాట్ వాటర్ బ్యాగ్ , పెయిన్ కిల్లర్స్ వాడడం వాళ్ళ ఉపశమనం కలుగుతుంది .

ప్రసవ సమయం లో బిడ్డ బరువు , మాయ , ఉమ్మనీరు అన్నీ కలిపి ఇంచుమించు నాలుగున్నర కజీల వరకు బరువు కోల్పోతారు , గర్భాదారనప్పటి ' స్ట్రెచ్ మార్క్స్ ' అలాగే ఉండిపోతాయి . ప్రసవం తర్వాత కంటే ముందునుండే " కోకోవా బటర్ క్రీం తో మసాజ్ చేస్తుంటే మచ్చలు పూర్తిగా కాకున్నా చాలా వరకు తగ్గిపోతాయి (AloeveraCream) .

గర్భం వచ్చాక ఈస్త్రోజన్ స్థాయిలు అత్యదికముగా ఉంటాయి కాబట్టి జుట్టు రాలిపోతుంటుంది . 12 వారాలకు ఈస్త్రోజన్ స్థాయిలు స్థిరపడి జుట్టు కుదుళ్ళు పెరగడం మొదలవుతుంది .

  • =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, December 15, 2009

డెలివరీ తర్వాత పొట్ట తగ్గడము ఎలా?, How to lessen belly after delivery?





ప్ర : డెలివరీ తర్వాత పొట్ట తగ్గడం ఎలా? - విజయలక్ష్మి ,పార్వతీపురం

జ : డెలివరీ తరువాత సాసారణం గా పొట్ట ముందుకు పెరుగుతుంది . పెళ్ళైన కొత్త లో పొట్ట ప్లాట్ గా ఉంటుంది ... ప్రేగ్నేన్చి తరువాత గర్భాశయం పైకి పెరుగు వస్తుంది . ఎత్తు ఎక్కువగా ఉన్నా స్త్రీలలో కటిభాగానికి , చాటికి గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భాశయం నేరుగా పైకి పెరుగుతుంది . ఎత్తు తక్కువగా ఉన్నా వారిలో గర్భాశయం ముందుకు పెరుగుతుంది . ఇలా పెఫుగు తున్న గర్భాశయం ను పొందుపరచేందుకు కడుపు కండరాలు సాగుతాయి .

డెలివరీ తర్వాత గర్భాశయం యధాస్థానం లోకి వెళ్ళిపోతుంది ... కాని సాగిపోయిన కడుపు కండరాలు మాత్రము అలాగే ఉండిపోతాయి . కొంతవరకు మాతమే వెనక్కి ముడుచుకుంటాయి . మన కడుపులో ఉండేవి పేగులు . . అవి మన కడుపు కండరాలు బిగుతు గా ఉన్నఅప్పుడు కడుపులోనే తైట్ గా అమరి ఉంటాయి. కడుపు కండరాలు సాగిపోయినపుడు అవి గ్రావిటీ వల్ల ముందుకు పడతాయి . దాంతో పొట్ట ఎత్తుగా అవుతుంది . దాని పై వ్యక్తి బరువు పెరిగితే పొట్టలో జమఅయ్యే కొవ్వు వల్ల పొట్ట మరింత ఎత్తుగా కనబడుతుంది .

చికిత్స :
  • కొవ్వు పెరగకుండా చూసుకోవాలి ,
  • యోగా ద్వార పొట్ట సంభందిత ఎక్షరసైజులు చేయాలి .
  • డెలివరీ తర్వాత అబ్దోమినల్ బెల్ట్ కట్టుకోవాలి ,
  • కడుపులో గాలి కలిగించే ఆహారాలు తీసుకోకూడదు .
  • సెల్లో తెరం ట్రీట్ మెంట్ కుడా ఉపయోగ పడుతుంది , ఇది బరువును తగ్గిస్తుంది ,
  • ================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS