Wednesday, March 30, 2011

ఋతుక్రమం లో ఒత్తికడుపులో విపరీతమైన నొప్పి.Dysmenorrhoea


  • [Dysmenorrhoea.jpg]

ప్ర : నాకు ఋతుక్రమం లో ఒత్తికడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది . ఒక్కోసారి వారము రోజులు ఉంటుంది . నాలుగేళ్ళు గా ఇదే పరిస్థితి . ఏమి చేయాలి ? -- నరసమ్మ కొమ్మూరి ;;కోటపల్లి .

జ : దీనిని డిస్మెనోరియా అంటారు . ఇటువంటి నొప్పికి సాధారణంగా ఎండోమెట్రియోసిస్ కారణము కావచ్చును . గర్భసంచి వెలుపల యుటెరస్ లైనింగ్ డొపొజిషన్‌ వల్ల టిష్యూ ఇన్‌ఫెక్ట్ అయి , ఉదరము లోపల కొద్దిగా రక్తస్రావము కావచ్చు . దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది .
చికిత్స : ఉపశయనం కోసము పెయిన్‌ కిల్లర్స్ -- Tab. Dysmen రోజుకి 2 లేదా 3 మాత్రలు వాడవచ్చును. వాంతులు ఉంటే -- Tab Stemtil 1 tab 2time / day ... 1-2 days . దీర్ఘకాలిక నివారణకోసం ఎండోమెట్రియల్ డిపాజిట్స్ కాటరైజేషన్‌ అవసరము ఉంటుంది . గైనకాలజిస్ట్ ని సంప్రదించి ... స్కానింగ్ చేయించుకొని కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ఇటువంటి వారికి సంతానము కూడా కలుగడం ఆలస్యము అవుతుంది .

పూర్తి వివరాలకు : ఇక్కడ క్లిక్ చేయండి ->Dysmenorrhoea (in Telugu)



  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, March 15, 2011

నాకు జలుబు చేసింది . సరియైన చికిత్స చెప్పగలరా?,I am suffering from common cold Treatment please?



ప్ర : నాకు జలుబు చేసింది . సరియైన చికిత్స చెప్పగలరా?--- కోమటి శశిభూషం రావు . ఇప్పిలి .

జ : వాతావరణం మారినప్పుడు జలుబు చేస్తుంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లలకు సంక్రమిస్తుంది. (also known as nasopharyngitis, rhinopharyngitis, acute coryza, head cold, or simply a cold) జలుబు చేసినప్పుడు గొంతు పొడిగానూ, నసగానూ ముక్కు బిగదీసినట్లుగాను ఉంటుంది. ముక్కు వెంట నీరు కారటం, వెంటవెంటనే తుమ్ములు రావటం జరుగుతుంది.జలుబు వచ్చిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా సమీపంలో ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ క్రిములు ప్రవేశిస్తాయి. ఫలితంగా వారికి కూడా జలుబు సంక్రమిస్తుంది.
The common cold is a viral infection of the upper respiratory tract. The most commonly implicated virus is a rhinovirus (30–80%), a type of picornavirus with 99 known serotypes. Others include: human coronavirus (~15%), influenza viruses (10-15%), adenoviruses (5%), human parainfluenza viruses, human respiratory syncytial virus, enteroviruses other than rhinoviruses, and metapneumovirus. Frequently more than one virus is present. In total over 200 different viral types are associated with colds.

జలుబు తగ్గటానికి సరియైన యాంటివైరల్  మందు అందుబాటులో లేదు. ఏ మందు వాడినప్పటికీ ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గించలేవు. ఎందువలన అంటే జలుబు కలుగనేసే వైరస్ లు చాలా రకాలు , అందులోన ఈ వైరస్ లు వాతావరణ పరిస్థితుల బట్టి రూపాంతము చెందుతూ ఉంటాయి.    దీనికి కావలసినంత విశ్రాంతి తీసుకుంటే శరీరమే దీనిని నిరోధించగలదని వైద్యులు చెబుతున్నారు.

ఉపశమనం కోసం మందులు :
జ్వరానికి + పడిశం కోసం : Sucet Plus tablets రోజుకి రెండు లేదా మూడు మాత్రలు --- 3-4 రోజులు ,
దగ్గుకి : Delitus-D సిరఫ్ 5 మి.లీ. చొప్పున్న రోజుకి 3 సార్లు ,
ఇన్ఫెక్షన్‌ ఉంటే -- యాంటి బయోటిక్స్ ఉదా: Azithromycin 250/500 m.g . రోజుకి వయసును బట్టి 2-3 మాత్రలు ...3-5 రోజులు వాడాలి ,


  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, March 14, 2011

చర్మము పై దద్దుర్లు వస్తే అది అమ్మవారా?,Skin Rash indictes Measles?



ప్ర: చర్మము పై దద్దుర్లు వస్తే అది అమ్మవారా?

జ : చర్మము పై దద్దుర్లు వస్తే 'వైరల్ ఇన్ఫెక్షన్‌ (అమ్మవారు)' కావచ్చు , కాకపోవచ్చును. చర్మము పై వచ్చే దద్దుర్లు స్వభావము బట్టి ఎలర్జీ వల్ల వచ్చే రాష్ (Rash) కి మీజిల్స్ వల్ల వచ్చే రాష్ (Rash) కీ తేడా గుర్తించవచ్చును .

తట్టు లేదా పొంగు అనబడే ఈ వ్యాధినే ఆంగ్ల భాషలో మీజిల్స్ (Measles లేదా rubeola) అని పిలుస్తారు. ఈ అంటు వ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. ఇది మార్‌బిల్లీ వైరస్ అనే వైరస్ వల్ల కలుగుతుంది. తట్టు ప్రపంచములొ ఉన్నట్లుగా క్రీ.పూ.600 సంవత్సరము నుండి ఆధారాలున్నయి . తట్టు గురించి శాస్త్రీయమైన విశ్లేషణ 860-932 సంవత్సరాల మధ్య పర్షియా వైద్యుడు ఇబిన్ రాజీ (రాజెస్) చేశాడు. రాజెస్ ఆటలమ్మకు తట్టుకి గల వత్యాసాలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. మొట్టమొదటిసారిగా తట్టుని కలిగించే ఈ వైరస్ 1954వ సంవత్సరములో అమెరికాలో డేవిడ్ ఎడ్‌మాన్‌స్టన్ వర్ధనం చేశాడు. డేవిడ్ ఈ వైరస్ వేరు చేసి కోడి గుడ్డు భ్రూణం (చిక్ ఎంబ్రియో)లో వ్యాప్తి చెందేటట్లు చేశాడు. ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్ వైరస్ జాతులు వేరు చేయబడ్డాయి. 1963 సంవత్సరములో తట్టు వ్యాధి నిరోధక టీకా తయారి జరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జెర్మన్ మీజిల్స్ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది.

వ్యాధి వ్యాప్తి

తట్టు సంబంధించిన వైరస్ సాధారణంగా శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్నప్రదేశాలలో జబ్బు ఎక్కువగా ప్రబలుతుంది. సాధారణంగా ఈ జబ్బు ఇన్‌కుబేషన్ పీరియడ్ 4-12 రోజులు (రోగ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటినుండి రోగ లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం). తట్టు వచ్చిన వారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన 3 రోజులనుంచి మొదలుకొని దద్దుర్లు పూర్తిగా తగ్గిన 5 రోజుల వరకు వ్యాప్తిగావించగలరు(ఇన్‌ఫెక్షియస్).

వ్యాధి నిర్ధారణ చేయాడానికి ఈ ప్రధాన లక్షణాలు ఉండాలి.

* కళ్ళు ఎర్రపడడం (కంజక్టైవల్ కంజషన్)
* నోటి లోపలి బుగ్గలలొ కాప్లిక్ స్పాట్స్ (ఇసుక రేణువుల వంటి మచ్చలు)కనిపించడం, ఇవి 24-36 గంటలు మాత్రమే ఉంటాయి.రాష్ ప్రారంభ్యం అయి జ్వరం తగ్గుముఖం పట్టగానే కాప్‌లిక్ స్పాట్స్ కనిపించవు
* మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం,
* రాష్ (దద్దుర్లు) ముఖం నుండి ప్రారంభమయి కాళ్ళ వైపు పాకడం.
* దగ్గు,
* మగతగా ఉండడం,
* అన్న హితవు లేక పోవడం,

ఈ వ్యాధి చాలా తేలికగా పాక గలిగే అంటువ్యాది కాబట్టి ముఖ్యంగా తట్టు ఉన్న వారితో కలవడం అనే విషయం రోగిని అడగడం ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స
రోగిని వైద్యుడు పరిక్షించడం ద్వారా,
వ్యాధి విర్ధారణ ముఖ్యంగా రోగి వ్యాధి లక్షణాలు, కనిపించే రోగి చర్మము పై దద్దుర్లు (రాష్)ద్వారా చేస్తారు. వైరస్ వల్ల కలిగే అన్ని వ్యాధులలొ రాష మరియు జ్వరం కనిపిస్తుంది. మిగతా వైరల్ జ్వరాలనుండి మీజిల్స్ లేదా తట్టు ని పైన పేర్కొన్న ముఖ్యమైన లక్షణాల ద్వారా వేరు చేస్తారు.

లాబ్ పరిక్షలు

రోగ పరిక్షించడం ద్వారా నిర్ధారణ రాక పోతే లాబ్ పరిక్షలు చేయవచ్చు.లాలాజలాన్ని వైరస్ పరిక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్ వైరస్ దాడి చేత మానవ శరీరం వ్యాధి నిరోధక ఆంటీబాడీస్ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధి ని నిర్థారించవచ్చు. ఈ వ్యాధి నిరోధకా ఆంటీబాడీస్ రెండు రకాలు IgM IgG. మీజిల్స్ IgM రక్తములొ కనిపిస్తే మీజిల్స్ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్ IgG రక్తం లొ కనిపడితే పూర్వం మీజిల్స్ గ్రస్తమయ్యినట్లు లేదా పూర్వము మీజిల్స్ కి సంబంధించిన టీకా తిసుకొన్నట్లు అర్థము.

చికిత్స

  • మిగతా వైరల్ జబ్బుల వలే తట్టు కి ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు అనుసరించిన మందులు వాడాలి. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి.
  • మిగతా వారితో కలియరాదు.
  • జ్వరానికి పేరాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే బిళ్ళలు వాడాలి.
  • దగ్గు కి కాఫ్ సిరఫ్ వాడాలి ,
  • దురద కి - సిట్రజైన్‌ మాత్రలు వాడాలి ,
  • చర్మము పై పుళ్ళు కి -- Femcinal-A ... skin oint. రాయాలి ,
  • నీరసం తగ్గడానికి --- బి.కాంప్లెక్ష్ మాత్రలు లేద సిరఫ్ వాడాలి ,
ఎలర్జీ కి ట్రీట్మెంట్ :
ఎలర్జీ ని కలిగించే పదార్దము గుర్తించి దానికి దూరము గా ఉండాలి ... అటువంటి పదార్దాలు తినరాదు .
Tab. Levo-cetrazine 2 tab per day 4-5 days,
Tab. Betnesol ... Tapering డోస్ లో వాడాలి.

అలెర్జీ మధ్యవర్తుల చర్యలను నిరోధించేందుకు లేదా కణాలు మరియు డీగ్రాన్యులేషన్ ప్రక్రియలను అడ్డుకునేందుకు అనేక ఎంటాగోనిస్టిక్స్ (వ్యతిరిక్త) మందులను ఉపయోగిస్తున్నారు. యాంటీహిస్టామైన్‌లు, గ్లూకోకార్టికాయిడ్‌లు, ఎపినెర్ఫిన్ (ఆడ్రెనాలిన్), థియోఫిలిన్ మరియు క్రోమోలైన్ సోడియం వీటిలో ముఖ్యమైనవి. మోంటెల్యూకాస్ట్ (సింగ్యులాయిర్) లేదా జాఫిర్లుకాస్ట్ (ఎకోలేట్) వంటి యాంటీ-ల్యూకోట్రియెన్‌లను అలెర్జీ వ్యాధుల చికిత్స కోసం FDA ఆమోదించింది. యాంటీ-కొలినెర్జిక్‌లు, డెకోన్‌జెస్టాంట్‌లు, మాస్ట్ సెల్ స్టెబిలైజర్లు మరియు ఎసినోఫిల్ కీమోటాక్సిస్‌ను బలహీనపరుస్తాయని భావిస్తున్న ఇతర సమ్మేళనాలను కూడా సాధారణంగా ఉపయోగిస్తున్నారు. ఈ మందులు అలెర్జీ యొక్క లక్షణాలను తగ్గించేందుకు సాయపడతాయి, తీవ్ర అనాఫిలాక్సిస్ నుంచి ఉపశమనం పొందేందుకు అత్యవసరమైనవి, అయితే అలెర్జీ వ్యాధుల దీర్ఘ చికిత్సలో ఇవి పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తాయి.


  • ===================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

గర్భనిరోధక మాత్రలు వాడకం సెక్స్ కోర్కెలను దూరము చేస్తాయని విన్నాను . నిజమేనా?

ప్ర : గర్భనిరోధక మాత్రలు వాడకం సెక్స్ కోర్కెలను దూరము చేస్తాయని విన్నాను . నిజమేనా?(We heard that contraceptive pills decrease sex desires. Is it true?.

జ : మీరు విన్న దానిలో కొంత నిజమున్నది . గర్భనిరోధక మాత్రలు స్త్రీల సెక్స్ హార్మోనుల మీద ప్రభావము చూపి అండాల విడుదలలో జోక్యము చేసుకుంటాయి. కాబట్టి స్త్రీల సెక్స్ కోర్కెలు కలిగించే హార్మొన్ల ప్రబావాన్ని లేకుండా ఈ మాత్రలు చేస్తాయి. ఇది తాత్కాలికంగా కావచ్చు . శాశ్వితమూ కావచ్చు .

గర్భనిరోధక మాత్రల వాడకంతో కలిగే సైడ్ ఎఫెక్ట్ లలో ఒకటి యోనిలో ద్రవాలు ఊరడం తగ్గి పోవడం . దీనివలన యోని పొడిబారినట్టుగా అయి అంగప్రవేశము భాదాకరమవుతుంది . స్తనాలలో నొప్పి వస్తుంది . డిప్రషన్‌ కి గురవుతారు. బరువు పెరగడం జరుగుతుంది .

  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS