Wednesday, August 12, 2015

గర్భవతిగా ఉన్న సమయంలో అయోడిన్‌ మరింత కీలకమా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



ప్ర : గర్భవతిగా ఉన్న సమయంలో అయోడిన్‌ మరింత కీలకమా?

జ : లండన్‌: గర్భవతిగా ఉన్నప్పుడు అయోడిన్‌ లోపాలు తలెత్తకుండా సంపూరక ఔషధాలను తీసుకోవడం ద్వారా... పిల్లల్లో వివేక సూచిక(ఐక్యూ)ను పెంపొందించవచ్చని సరికొత్త అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఏమాత్రం అయోడిన్‌ లోపాలు తలెత్తినా... పుట్టే పిల్లలు తక్కువ ఐక్యూ కలిగి ఉండే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు. తీవ్రస్థాయి లోపాలతో పిల్లల్లో మానసిక బలహీనతలు, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. కేవలం ఆహారం ద్వారా అందే అయోడిన్‌... గర్భవతుల్లో సరిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గర్భం దాల్చిన, చంటి పిల్లలకు పాలిస్తున్న, గర్భధారణ దిశగా ఆలోచిస్తున్నవారంతా అయోడిన్‌ సంపూరక ఔషధాలు తీసుకోవడం మేలని సూచించారు.

Tuesday, August 11, 2015

అంతర్జాలము ("internet) లో పనిచేసేవారికి ఆరోగ్యము చెడొపోతుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : అదే పనిగా అంతర్జాలము ("internet) లో పనిచేసేవారికి , అంతర్జాలములో కాలము గడిపేవారికి ఆరోగ్యము చెడొపోతుందా?

జ :అదేపనిగా ఆన్‌లైన్‌లో-గడిపితే అనారోగ్యాలు ఖాయం!!
లండన్‌: అదేపనిగా అంతర్జాలం చూస్తూ గంటలకొద్దీ సమయాన్ని గడిపేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనీ... జలుబు వంటి అనారోగ్యాల బారిన పడటం ఖాయమని స్వాన్‌సీ, మిలాన్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాలానికి బానిసలయ్యే వారికి....అదో వ్యసనంలా అలవాటు పడిన వారికి రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు. తాము నిర్వహించిన అధ్యయనంలో అంతర్జాలం బానిసలకు...అంతగా దాని జోలికి వెళ్లని వారికి మధ్య ఆరోగ్యం విషయంలో నెలకొన్న తేడాలు సుస్పష్టమైనట్లు తెలిపారు.