Sunday, June 26, 2011

ముఖంపై చెమటపొక్కులు, Heat rash on face



ప్ర : నాకు ముఖంపై చెమటపొక్కులు వస్తున్నాయి. దీనికి ఆయుర్వేద పరిష్కారం చెప్పగలరు.

- కవిత, శ్రీకాకుళం

జ :
ఆయుర్వేదం(ఇంటివైద్యము) : వేసవిలో అధిక వేడి, చెమట వల్ల ఇలా అవుతుంది. వాతావరణంలోని కాలుష్యం చెమట గ్రంథులలో చేరి వాటిని మూసివేయడం వల్ల చెమట పొక్కులు వస్తుంటాయి. ఇది ముఖంపైనే కాదు, శరీరంలో ఎక్కడైౖనా రావచ్చును.
* ఈ కాలంలో రోజూ రెండుపూటలా చల్లటి నీళ్లతో స్నానం చేయడం, ఎండలో ఎక్కువగా తిరగకపోవడం, చెమటను తగ్గించుకునేందుకు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
* ఆహారంలో చల్లటి మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకురసం లాంటివి తీసుకోవాలి. మజ్జిగలో కొత్తిమీర రసం, మెంతి ఆకుల రసం, పుదీనా రసం వేసి పుచ్చుకొంటే శరీర వేడి తగ్గుతుంది. చెమట ఎక్కువగా పట్టదు. పొక్కులు మానుతాయి. గంధం అరగదీసి దానిని చల్లటి నీళ్లలో వేసి మధ్యాహ్నం పుచ్చుకోవడం వల్లా ఫలితం ఉంటుంది.
* ఆహారంలో మసాలాలు, నూనె అధికంగా వేసిన వేపుళ్లు, పచ్చళ్లు తగ్గించి తినాలి.
* వేప ఆకుల పొడి, గులాబీ రేకల పొడి, గంధ కచ్చోరాలు, గంధం చూర్ణం సమానంగా కలిపి దానికి 8 రెట్లు బియ్యంపిండి, 16 రెట్లు పెసర పిండి కలిపి శరీరానికి నూనె రాయకుండా నలుగుపెట్టి స్నానం చేస్తే పుండ్లు, చెమట పొక్కుల వంటి సమస్యలు దూరమవుతాయి. చర్మం కాంతిమంతి అవుతుంది కూడా.
* ఆయుర్వేదంలో శరీర వేడి తగ్గడానికి చెమటపొక్కులు, మొటిమలు తగ్గడానికి సారిబాది.. షడంగ పానీయాలు లభిస్తాయి.

అల్లోపతిక్ వైద్యము :
ఉక్క పోతకు గురికాకుండా బహిరంగగా గాలి తగిలే ప్రదేశాలలో ఉండాలి ,
మిట్ట మధ్యాన్నము నీడ పట్టునే ఉండాలి ,
ఈ కాలంలో రోజూ రెండుపూటలా చల్లటి నీళ్లతో స్నానం చేయడం, ఎండలో ఎక్కువగా తిరగకపోవడం, చెమటను తగ్గించుకునేందుకు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి,
Nycil powder
ponds prickly-heat powder వంటి పౌడర్లు బజారులో దొరుకు తాయి . వాడవచ్చును . కొంత ఉపశయనం కలుగుతుంది .

===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, June 23, 2011

అబద్దాలు చెప్పే అలవాటు ఎలా పోగొట్టాలి ?, How to prevent child from telling lie?



ప్ర : మా పాపకు నాలుగేళ్ళు . బాగా అబద్దాలు చెప్తోంది .నెపాన్నీ తోటివారిపై వేస్తుందే తప్ప ... తప్పు ఒప్పుకోదు . అది తప్పు అని తనకు ఎలా చెప్పాలి ?

జ : చాలామంది పిల్లలు పనిష్మెంట్ ని భయపడి అబద్దాలు చెప్తుంటారు . కొందరు తాము చూసింది , చేసింది అతిగా వర్ణించేందుకు అబద్దాలు చెప్తుంటారు . ఇంకొందరు తాము చెప్పే అబద్దాలకు కలిగే ప్రతిస్పందనను ఎంజాయ్ చేస్తూ చెప్తారు . మీపాపకు నిర్భయము గా నిజం చెప్పే అలవాటు చేయాలి . అంటే ప్రతిదానికీ మీరు దండించరనే భరోసా ఇస్తుండాలి . ఆమె అంతర్గత దృక్పధాన్ని వినే ప్రయత్నం చేయాలి . అబద్దాలు ఆమె ఊహాశక్తి నుండి పుట్టే ఉత్పత్తులు . ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తుల నమ్మకం ఉంటుందని , అబద్దాలు చెప్తే ఎవరూ నమ్మరని వివరించాలి . మీ పాపకు మీరే రోల్ మోడల్ కావాలి .

  • =================================
visit my website - > Dr.Seshagirirao-

Wednesday, June 15, 2011

బాబుకు తరచూ కడుపునొప్పి?, frequent pain abdomen for my son ?



A : మా అబ్బాయికి ఆరేళ్లు. కొన్ని నెలలుగా వాడికి తరచూ కడుపునొప్పి వస్తోంది. గత పది రోజులు నుంచి మళ్లీ మళ్లీ వస్తోంది. డాక్టర్లకు చూపించాం. కొన్ని పరీక్షలు చేసి నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయితే ఇప్పుడు స్కాన్‌లో కొన్ని లింఫ్‌గ్రంథులు పెద్దవి అయినట్లుగా కనిపిస్తోంది చెప్పారు. మా బాబు విషయం ఆందోళనగా ఉంది. వాడికి ఉన్న సమస్య ఏమిటి? మాకు సరైన సలహా ఇవ్వండి.
- సుహాసిని, రాజమండ్రి

A : లక్షణాలను బట్టి మీ బాబు క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి తరచూ వస్తూండటానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, లివర్‌కు సంబంధించిన రుగ్మతలు, మూత్ర విసర్జన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషాలు శరీరంలో వ్యాపించడం (పాయిజనింగ్), శరీర జీవక్రియల్లో (మెటబాలిక్ ఫంక్షన్స్) మార్పులు, మానసిక సమస్యల వల్ల కడుపునొప్పి రావచ్చు.

ఇక మీ బాబు విషయంలో పరీక్షలు చేసి, అవి నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి పైన పేర్కొన్న కారణాలు అతడి కడుపునొప్పికి కారణం కాకపోవచ్చు. రిపోర్ట్స్‌లో లింఫ్‌నోడ్స్ పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి అతడి సమస్యను మిసెంట్రిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ (యెర్సీనియా, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లు) వచ్చినప్పుడు, అక్కడి కణజాలం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు ఇలా గ్రంథుల సైజ్ పెరుగుతుంది.

అంతేకాదు... గొంతు, కడుపు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అపెండిసైటిస్‌లో కూడా లింఫ్ గ్రంథుల సైజ్ పెరుగుతుంది. ఈ పరిస్థితి రెండు నుంచి పదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యమధ్యన ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఉండటం, మందులు వాడగానే నొప్పి తగ్గడం వంటివి చూస్తుంటే దీన్ని నాన్-స్పెసిఫిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. అంటే ఇది అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. అయితే చాలా అరుదుగా ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు కూడా గ్రంథులు పెద్దవి కావచ్చు. అయితే అలాంటి పిల్లల్లో దీనితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఎవరికైనా సరే... నొప్పి లేకుండా గ్రంథుల పరిమాణం 15 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతుంటే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. అలాంటప్పుడు అది తీవ్రమైన, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితి కావచ్చు

మీ అబ్బాయికి మరికొన్ని రోజులు ఆగి మరోసారి స్కాన్ తీసి చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సమస్య తీవ్రతను అంచనా వేయడం మంచిది. దాదాపు 80 శాతం నుంచి 90 శాతం పిల్లల్లో గ్రంథుల సైజ్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే సీటీస్కాన్, అవసరమైన సందర్భాల్లో వాటి బయాప్సీ చేసి వాటి పెరుగుదలకు కారణం ఏమిటో చూడాల్సి ఉంటుంది. ఈలోపు మీ బాబుకు మీ డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్ కోర్సు వాడితే సరిపోతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు మీ పీడియాట్రీషియన్ ఆధ్వర్యంలో బాబుకు తగిన చికిత్స చేయించండి. పిల్లల్లో ఈ పరిస్థితిని నివారించాలంటే... అన్‌పాశ్చరైజ్డ్ పాలు, సరిగా ఉడికించని ఆహారం (ముఖ్యంగా మాంసా హారం), శుభ్రంగా లేని నీళ్లు వాడకూడదు.

డాక్టర్ దాసరి రమేష్‌బాబు--పిడియాట్రీషియన్,--కేర్ ఆసుపత్రి

  • ============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS