
Q : నాకు 58 ఏళ్లు. నా స్నేహితుడు ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. అతనికి అన్ని పరీక్షల రిపోట్స్ నార్మల్‌గానే వచ్చినవి . మరి గుండెపోటు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిసారి గుండెపోటు వల్ల కూడా మరణం సంభవించవచ్చా?
జ : -గుండెపోటు హఠాత్తుగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారే ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు బీపీ పెరిగి గుండెకు రక్తసరఫరాలో అలజడి కలగవచ్చు. దాంతో సడెన్‌గా గుండెపోటు రావచ్చు. నాలుగైదుసార్లు గుండెపోటు వస్తేనే ప్రమాదం అనుకోకూడదు. గుండెపోటు ఒక్కసారి వచ్చినా కష్టమే. ఒక్కసారిగా పెద్ద గుండెపోటుతో హార్ట్ ఫెయిల్యూర్ కావడమో, హృదయ స్పందనలు గతి తప్పడమో జరిగి మరణం సంభవించవచ్చు.
- ===========================
