Sunday, November 10, 2013

Does patient die with first heart attack?,మొట్టమొదటిసారి గుండెపోటు వల్ల మరణం సంభవించవచ్చా?

  •  



  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *


 Q : నాకు 58 ఏళ్లు. నా స్నేహితుడు ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. అతనికి అన్ని పరీక్షల రిపోట్స్ నార్మల్‌గానే వచ్చినవి . మరి గుండెపోటు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిసారి గుండెపోటు వల్ల కూడా మరణం సంభవించవచ్చా?


జ  : -గుండెపోటు హఠాత్తుగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారే ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు బీపీ పెరిగి గుండెకు రక్తసరఫరాలో అలజడి కలగవచ్చు. దాంతో సడెన్‌గా గుండెపోటు రావచ్చు. నాలుగైదుసార్లు గుండెపోటు వస్తేనే ప్రమాదం అనుకోకూడదు. గుండెపోటు ఒక్కసారి వచ్చినా కష్టమే. ఒక్కసారిగా పెద్ద గుండెపోటుతో హార్ట్ ఫెయిల్యూర్ కావడమో, హృదయ స్పందనలు గతి తప్పడమో జరిగి మరణం సంభవించవచ్చు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.