Thursday, November 14, 2013

Is our hapyness in our hands?,సంతోషం మన చేతుల్లోనే ఉందా?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : సంతోషం మన చేతుల్లోనే ఉందా?

జ : చిన్న చిన్న సమస్యలకే చెదిరిపోవడం, ఒత్తిడికి గురవడం చాలామంది విషయంలో జరిగేదే. అయితే ఒక్కసారి ఎందుకలా జరుగుతోంది అని సమీక్షించుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఆనందంగా ఉండటం సాధ్యమేనని అర్థమవుతుంది. జీవితంలో సంతోషంతో పాటూ కోపతాపాలూ, ఆశ నిరాశలూ ఉంటాయి. అది తెలుసుకోకుండా చిన్న విషయాలకే బాధపడుతుంటే ఆనందానికి ఆమడ దూరంలో ఉంటాం. సమస్యలూ, బాధలూ వచ్చి పోతుంటాయే తప్ప శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రతికూల భావోద్వేగాలను ఎంత త్వరగా నియంత్రించుకుంటే అంతగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో బలాలూ, బలహీనతలూ ఉంటాయి. వాటిని సరిగ్గా అంచనా వేసుకుంటే సామర్థ్యానికి తగిన లక్ష్యాలను రూపొందించుకుని, విజయం సాధించడమూ సులువే. బలహీనతలను తగ్గించుకుంటూ బలాలను పెంచుకుంటూ ముందుకు సాగడమే గెలుపు సూత్రం అని వేరే చెప్పాలా!

ఏ పనిచేసినా అది ఆత్మవిశ్వాసాన్నీ, గౌరవాన్నీ పెంచేదిగా ఉండాలి. అయితే అతి విశ్వాసం మంచిది కాదు. 'నేను తప్ప ఆ పని ఎవరూ చేయలేరు' అనుకొనే అతి విశ్వాసం అన్నివేళలా సానుకూల ఫలితాలను ఇవ్వదు. సరికదా, కొన్నిసార్లు పని తక్కువ, డాంబికాలు ఎక్కువ అన్న పేరు తెచ్చి పెడుతుంది. ప్రతి పనికీ కచ్చితంగా ఒక సమయాన్ని నిర్దేశించుకొని అటో ఇటో తేల్చుకొనే చొరవా, తెగింపూ కొన్నిసార్లు అవసరమే. అది సానుకూల ఫలితం ఇవ్వకపోయినా బెంగపడాల్సిన పనిలేదు. వచ్చిన ఫలితాల్ని విశ్లేషించుకుని పొరబాట్లను సరిదిద్దుకుంటే అనుకొన్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమే.
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.