Tuesday, November 26, 2013

Is there restriction to eat all during periods?,పీరియడ్స్ సమయములో కొన్ని పదార్ధాలు తినకూడదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : పీరియడ్స్ సమయములో కొన్ని రకాల ఆహారపదార్ధాలను తినకూడంటారు నిజమేనా?

జ : ఇంట్లో నాన్నమ్మలు , అమ్మమ్మలు వంటి పెద్దవాళ్ళు ఋతుక్రమ సమయములో కొన్ని రకాల పదార్ధాలు తినకూడదని  సాధారణము గా నిబంధనలు పెడుతుంటారు . ఊరగాయలు తింటే వేడి అని , దానిమ్మ గింజలు తింటే స్రావము ఎక్కువగా ఉంటుందని , పెరుగుతింటే రక్తస్రావము దుర్వాసనతో ఉంటుందని రకరకాలుగా చెప్తుంటారు. . . . కాని ఇవన్నీ అపోహలు మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారము లేదు.

ఋతుక్రమం లో ఏ పదార్ధాలైనా తినవచ్చు . అయితే కొందరికి కడుపునొప్పి, క్రాంప్స్ , ఇతర సమస్యలు ఉంటాయి. కాబట్టి సులువుగా జీర్ణమయ్యే అయితే సౌకర్యము గా ఉంటుందని అలా నియమాలు పెట్టేరు. రెండురోజులు బలమైన ఆహారము కాకుండా తేలికైన తిండి తింటే మంచిదేకదా.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.