Wednesday, December 4, 2013

food care in pregnancy,గర్భవతులు తిండిలో పాటించవలసిన జాగ్రత్తలు




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఐదు నెలల గర్భవతిని . తరచూ ఆకలి వేస్తుంది. ఎక్కువగా తింటున్నాను . దీనివల్ల గుండెలో మంట వస్తుంది. సలహాఇవ్వండి ?,
జ : గర్భము దాల్చాక తరచుగా కొద్ది కొద్దిగా తింటుండాలి. ఎందుకంటే ఆహారము జీర్ణముకావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈసోఫేగస్ చివర ఉన్న వాల్వ్ సాధారణముగా మూసుకొని ఉండి ... గర్భము దాల్చిన తర్వాత ఓపెన్‌ అవుతుంది. . . అంటే స్పింకటర్ బలహీనమవుతుంది. దీనితో జీర్ణము కాని పదార్ధాలు పైకి రిగర్జిటేషన్‌ అవడము వల్ల గుండెలో మంట వస్తుంది. తినగానే పడుకోవద్దు . కనీషం 20 నిముషాలు అయినా తిన్నగా కూర్చోండి. అలాగే ఓ పక్కకు తిరిగి ఓ మాదిరిగా తిన్నగా ఉండేపోశ్చర్ లో పడుకోవాలి. ఇవన్నీ వీలుపడకపోతే . . . యాంటాసిడ్ సిరప్ తో ఉపశమనం పొందవచ్చును. . . మీ డాక్టర్ ని సంప్రదించే యాంటాసిడ్స్ వాడాలి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.