Saturday, December 14, 2013

Whsy are the uses of Saliva,నోటిలో ఉమ్మెందుకు ఊరుతుంది?,లాలాజలం ఉపయోగం ఏంటి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : Whsy are the uses of Saliva,నోటిలో ఉమ్మెందుకు ఊరుతుంది?,లాలాజలం ఉపయోగం ఏంటి?

Ans : మన నోటిభాగమ్లో ఉండే లాలాజల గ్రంధుల నుంది ఊరే లాలాజలం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పెదవులు , నోరు ,నాలుక ను తేమగా ఉంచుతుంది .అది లేకుంటే నోరు ఎండిపోయినట్లవుతుంది , పెదవులు పలుగుతాయి, నాలుక బిడసకట్టుకు (dry)పోతుంది.  మనం మన ఆహారాన్ని మింగేందుకు, అది జీర్ణమయ్యేందుకు లాలాజలం చాలా అవసరం. మన నోట్లో, మనకు హాని చేసే వివిధ రకాల సూక్ష్మజీవులు పెరగకుండా చేయటంలో కూడా లాలాజలం చాలా ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది.

మన నోట్లో లాలాజలం ఊరకపొతే పాలు, నీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగటానికి ఏమంత ఇబ్బంది వుండదు గాని, అన్నం, చపాతీలు, ఇడ్లీలు, బ్రెడ్‌లు వంటి ఘన పదార్ధాలును తినటం మాత్రం సాధ్యం కాదు.ఆయా పదార్ధాలను మన నోట్లో మెత్తగా మార్చి మింగాలంటే అందుకు లాలాజలం తప్పనిసరి. మన నోటిలో సుమారు 700 రకాల దాకా సూక్ష్మజీవులు నివసించగల్గుతాయి.వీటిలో కొన్ని మనకు మేలు చేస్తే మరికొన్ని కీడు కలిగిస్తాయి. అయితే మనం ఏదైనా ఆహారాన్ని తింటున్నప్పుడు మన నోట్లో ఊరే లాలాజలం ఈ బ్యాక్టీరియాను అదుపు చేయటంలో బాగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా అది రోగకారక క్రిములను చంపే యాటీబయాటిక్‌ మందు లాగ కూడా పనిచేస్తుంది .సరిగ్గా ఈ కారణం వల్లనే నాలుక, బుగ్గ వంటివి కొరుక్కున్నప్పుడు అయ్యే గాయాలు ఏ మందులు వాడకుండానే త్వరగానే నయమైపోతాయి.

పిల్లులు, కుక్కలతో సహా పలు జంతువులు తమ ఒంటి మీద గాయాలను నాలుకతో పదే పదే నాక్కోవటాన్ని మీరు గమనించే వుటారు. ఆ విధంగా తమ తమ లాలాజలాన్ని గాయాలకు రాయటం వలన వాటి గాయాలు త్వరగా మానిపోతాయి.

లాలాజలంలో ఉండే ఎంజైములు మనం తినే ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి, అంతేకాదు, దానిలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి కొన్ని పదార్ధాలు మన పళ్ళ మీద ఎనామిల్‌ పొరను కాపాడడం లో సహకరిస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో విలువైన లాలాజలాన్ని ఉమ్మి రూపం లో మనం పదే పదే ఊసేయకుండా, అది మన శరీరానికి ఉపయోగపడేలా చేసుకోవాలి.

 *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.