Saturday, December 7, 2013

What is the temperature in Jim or yoga room?,జిమ్‌ లో లేదా యోగా సెషన్‌ లో ఉండాల్సిన ఉష్ణోగ్రత ఎంత?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : చాలా మంది ఎక్షరసైజులు చేస్తున్నప్పుడు ఎ.సి . ఆపేస్తుంటారు. జిమ్‌ లో లేదా యోగా సెషన్‌ లో ఉండాల్సిన ఉష్ణోగ్రత ఎంత?.

జ : ఎక్సరసైజులు చేస్తున్నప్పుడు 23 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఐడియల్ టెంపరేచర్ అని అధ్యయనాలలో గుర్తించారు . వేడి  వాతావరనం లో వర్కవుట్ల వలన డీ హైడ్రేషన్‌ వస్తుంది. ఒక్కోసారి వడదెబ్బ అవకాశాలూ ఉంటాయి. వేడిగా ఉన్న గదిలో వర్కవుట్లు లేదా యోగా వంటివి చేయడం వలన అలసటగా ఉంటుంది. చేయాలన్న ఉత్సాహం , స్పూర్తి కూడా తగ్గిపోతాయి.

గదిలో చక్కని వెంటిలేషన్‌ ఉండాలి . గదిలో ఆక్షిజన్‌ స్థాయిలు సరిగా లేకపోతే మగతగా ఉంటుంది. వేడి  వాతావరణం , దానివలన కలిగే అదనపు స్వేదం శారీరక ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్  కు ఇబ్బంది కలిగిస్తాయి. ఇలాంటి సమయాలలో వట్టి మంచినీరు త్రాగడం సిఫార్సు చేయదగినది కాదు . పంచధార , ఉప్పు కలిపిన నిమ్మ నీరు తాగాలి లేదా ఓరల్ రీహడ్రేషన్‌ సొల్యూషన్‌ త్రాగాలి.

  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.