Thursday, December 12, 2013

What type of food good in winter and kaarteeka maasam?,కార్తీక మాసము లో(చలికాలములో )ఎటువంటి ఆహారము తీసుకోవాలి ?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : What type of food good in winter and kaarteeka maasam?,కార్తీక మాసము లో (చలికాలములో ) ఎటువంటి ఆహారము తీసుకోవాలి ?

జ : చలి మెల్లగా పెరుగుతూ వెళ్ళే కార్తీకము లో ఏ వ్యక్తికున్న జఠరసమైనా తగినంత వేడిమిని పుట్టించలేదు. దాంతో మనము తిన్న ఆహారము జీర్ణము కావడానికి ఎప్పటికంటే మరికొంత సమయం పడుతూఉంటుంది . అందుకని తక్కువగా తినడం , వీలైతే ఒకపూట భోజన్నాన్ని మానెయ్యడం మంచిది. వీటికితోడుగా వేడిచేసే చిమ్మిలి , చలిమిడి , జీళ్ళు వంటివాటిని తినడం మంచిది.

ఒకసారి వండేశాక ''అన్నాన్ని'' , ''నూనెని'' , ''నేతిని'' , ''కూరనీ '' . . మళ్ళీ వేడిచేసి తింటే అది అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. . . కాబట్టి తినకూడదు . ఫ్రిజ్ లో పెట్టి బధ్రపరిచినవి ఒవెన్‌ లో వేడిచేసుకొని తినడం అనారోగ్యము . ఇలా వేడిచేయడము వలన ఎక్కువగా " ట్రాన్స్ ఫాట్స్ " తయారవుతాయి .
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.