Friday, December 20, 2013

What are Growing pains in children ?, పిల్లలలో గ్రోయింగ్ పెయిన్స్ ఏంటి ?అసలు ఎందుకు వస్తాయి?.

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : పిల్లలలో గ్రోయింగ్ పెయిన్స్ అంటూ ఉంటారుకదా, అవి ఏంటి ?అసలు ఎందుకు వస్తాయి?.

జ : ఎదిగే వయసులో పిల్లలకు  కాళ్ళలో , చేతుల్లో నొప్పులు ఉంటుంటాయి. వారిలో 25 నుండి 40 శాతము మంది 3 నుంచి 6 ఏళ్ళ వయసులోనూ , 8 నుండి 13 సం.లు వయసులో ఇలాంటి నొప్పులు వస్తాయి. పిల్లలు పగలంతా ఏదోఒక రకం ఆట పాటల్లో , మెట్లెక్కి దిగడం , పరుగుపెట్టడం వంటి చురుకైన పనుల్లో నిమగ్నం కావడము వలన రాత్రివేళల్లో ఈ రకం నొప్పులు వస్తాయి. ఎముకలు ఎదుగుదల సమయములో ఇవి సహజము .

ఒక్కోసారి పోశ్చర్ సరిగ్గా లేకపోవడం కూడా నొప్పులకు దారితీస్తుంది. కండరాలపై వత్తిడి పెరుగుతుంది. ప్లాట్ ఫీట్ గల పిల్లలో ఈ గ్రోయింగ్ పెయిన్‌ ఎక్కువ . వీటివల్ల పిల్లలు  ' అర్ధరాత్రి ' నిద్రలేచిపోతుంటారు. కొందరికి అప్పుడప్పుడు వుంటే ఇంకొందరికి ప్రతిరాత్రీ ఉండవచ్చును . ఈ నొప్పుల ప్రభావము  జాయింట్ల  పై కంటే కండరాలపై ఎక్కువ .

ముందువైపు తొడలు , ముంజేతులు , మోకాళ్ళు వెనక ఈ నొప్పులు వస్తుంటాయి. వీటివల్ల వాపు , ఎర్రబారడం , బరువుపెరగడ  లాంటివి ఏమీ ఉండవు. గ్రోయిన్‌ పెయిన్స్ వైద్యచికిత్స ప్రత్యేకంగా ఏమీ లేదు.

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.