Saturday, December 7, 2013

can we remove Tatoo marks?, పచ్చబొట్టు తొలగించుకునే మార్గం ఉందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : నాకు టాటూ ఉంది . దాన్ని తొలగించుకునే వీలుంటుందా?

జ : సాధారణము గా పచ్చబొట్లు తొలగించడము కష్టము. సరైన పరికరాలు వాడితే  గతం తాలూకు శరీరం పై వేసుకున్న పచ్చబొట్లలను తొలగించుకోవచ్చును . చాలామంది డెర్మటాలజిస్టులు " క్యు-స్విచ్డ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించడానికి వాడుతుంటారు. అయితే పచ్చబొట్ల తొలగించే టెక్నిక్ ను నిర్ణయించేది పచ్చబొట్లలో వాడిన రంగులు. నలుపు , నీలము రంగుల పచ్చబొట్లను క్యు-స్విచ్డ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు .ఎరుపు , నారింజ . పసుపు , ఆకుపచ్చ టాటూలను " పల్స్ డై లేజర్ తో తొలగించ వచ్చు నని స్కిన్‌ స్పెషలిస్ట్ లు అంటారు . దీనిలో ఐదు అంగులాల స్క్వేర్ లేదా అంతకంటే పెద్దవాటిని తొలగించడం కష్టము .

పాదాలు లేదా కాళ్ళపై గల పచ్చబొట్లు మూడు సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ కాలవ్యవధిగలవైతే  వాటికి ఈ లేజర్లు అంతగా పనిచేయవు . మంచి డ్ర్ర్మటాలజిస్ట్ ను కలవాలి . తొలగింపు ప్రక్రియ కోసము హడావిడిపడకూడదు. కొన్ని నెలల పాటు ప్రక్రియ సాగితేనే ఫలితము కనపడుతుంది. తొలగింపు పద్దతిని ఆరు లేదా ఎనిమిది వారాలకు ఒకసారి చేస్తుండాలి . సూర్యకిరణాలను తగల నీయకూడదు . లేజర్ చికిత్స చర్మం సహజ పిగ్మెంట్ నూ తొలగిస్తుంది. సూర్య కిరణాల తాకిడివలన రంగు మరింత మారి అసహ్యము గా కనపడడమే కాకుండా చికిత్స ఎక్కువకాలము పడుతుంది.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.