Friday, December 26, 2014

Is there Age increasing hormone present?,ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ ఉంటుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ ఉంటుందా?

  • జ : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ మానవ శరీములో నే తయారవుతుంది. మానవ  శరీరము లో ఉన్న వినాళగ్రంధులలో ఎడ్రినల్ గ్రంధి ఒకటి .. మూత్రపిండం మీద టోపీలాగా కూర్చుని కనిపించే ఈఅ గ్రంధి స్రవించే అనేక హార్మోనులలో డి.హెచ్.ఇ.ఎస్.( ACTH-dependent. hormone,. DHEA,. also. known. as. DHES-sulfate.) అనే హార్మోన్‌ జీవితం ఆయుర్ధాయం ను పెంచుతుంది. అయితే ఈ హార్మోన్‌ స్రవించడము అందరిలో ఒకేలా ఉండదు . 
  • ఎవరైతే సంపూర్ణ పోషకపదార్ధాలను తీసుకుంటారో , 
  • ఎవరైతే క్రమము తప్పకుండా వ్యాయామను చేస్తారో , 
  • ఎవరికైతే ఇష్టపడి చేసే వ్యాపకాలు ఉంటాయో, 
  • ఎవరిలో అయితే మానవ సంబంధాలు మెరుగా ఉంటాయో , 
........... వారిలో మాత్రమే ఈ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ హార్మోన్‌ ఉత్పత్తికి మానసిక స్థితికి ఎంతో దగ్గర సంబంధము ఉంది. సక్రమైన మానసిక స్థాయి, ఒత్తిడులకు  గురికాని వారి  ఆయుర్ధాయాన్ని పెంచుతుంది. 

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, December 18, 2014

పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

జ : ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము . పిల్లలు ఈ విధమౌగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి.
  • ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు 
  • అలవాటు గానో కావచ్చు , 
  • ఎవరినైఅనా అనుకరిస్తూనో చేయవచ్చు ,
  • ఖాళీ గా  ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూ వచ్చు.
చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్నా ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి . ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి.  పరీక్షల భయము , స్నేహితుల ఒత్తిడి , కుటుంబసబ్యులలో లేదా స్కూల్లో తోటి పిల్లలతో తగాదాలు వంటివి కారనమైతే ... ఆ దిశగా పిల్లల యాంగ్జైటీని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి.  ఓ అలవాటుగా చేస్తుంటే ఇదెంతటి దురలవాటో , దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, పిల్లల పట్ల  ఎదుటివారి అభిప్రాయము ఏవిధముగా ప్రభావితము అవుతుందో వారికి వివరించాలి .బలవంతము గానో , పనిష్మెంట్ల భయం తోనో కాక అవగాహనతో మానిపించే దిశగా ప్రయత్నించాలి. పనిష్మిమెంట్లు ఇవ్వడము వల్ల పిల్లలు గోళ్లు కొరకడాన్ని మానకపోగా ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే వేళ్ళకు చేదు రాయడము వంటివి చేయకూడదు ఇతరత్రా పనులలో వారిని ఎంగేజ్ చెయ్యడము వల్ల వారికి గోళ్ళు కొరుక్కోవాలన్న తలంపు రాదు .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, December 11, 2014

foods to eat for controle weight gain?,బరువు పెరగ కుండా ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బరువు పెరగ కుండా మంచి ఆరోగ్యము కోసము ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?.

జ : కొద్దికొద్దిగా తినండి . ముఖ్యము గా ఆరోగ్యకరం కాని వాటి విషయము లో ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. చీజీ , పిజ్జాల వంటి వాటిని పూర్తిగా ఆహారము నూడి తీసెయ్యాలి . కొద్ది గా ఎప్పుడైనా తినవచ్చు. పూర్తిష్థాయి  ధాన్యాలు , గింజలు , పప్పులు వంటి కాంప్లెక్స్ కార్భోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవచ్చు.

పండ్లు , కూరగాయలు  ఎక్కువగా తినాలి. చెక్కెర పదార్ధాలు , రిఫైండ్ ఉత్పత్తులు పరిమితముగా తినాలి. రోజుకి సుమారు 2 లీటర్ల నీటిని తాగాలి. ప్రతిరోజూ 30 నుండి 60 నిముషాలు పాటు వ్యాయామము చేయాలి. ఇలా ఆరోగ్యవంతము కాని పదార్ధాలు తక్కువగా తింటూ, ఆరోగ్యవంతమైనవి అధికమౌగా తింటూ చురుకైన జీవన విధానము అనుసరించినంత కాలము బరువు పెరగరు.

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, December 9, 2014

Sleep disturbences in Pregnency ?,గర్భిణి లలో తరచు రాత్రులలో మెలకువ వచ్చేస్తుందెందుకు ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నేను 7 వ నెల గర్భవతిని. రాత్రివేళ చాలా సార్లు మెలుకువ వచ్చేస్తుంటుంది . బరువు మోయలేనట్లు గాను , అలసటగాను ఉంటుంది. ఏమి చేయాలి ? 

జ : అవకాశము , వీలుకలిగినప్పుడల్ల ఎంతోకొంత విశ్రాంతి తీసుకోండి . రాత్రి భోజనము చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించవద్దు. 5 నిముషాలు నడవాలి. ఒకవేళ రాత్రిల్లు తక్కువ నిద్ర పోయినప్పటికీ అందోళన చెందవద్దు . . ఊరికే అలా కళ్ళుమూసుకొని పడుకొని శరీరానికి అవసరమైన స్థాయిలో రెస్ట్ తీసుకుంటూ ఉండాలి.

బి.ప్. , సుగరు వ్యాధులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి. కాలు వాపులు (పొంగులు) ఉండకూడదు. మూతములో ఆల్బుమిన్‌ పోతుందేమో తనికీ చేయిందుకోవాలి. రక్తహీనత ఉందేమో హీమోగ్లోబిన్‌ తనికీ చేయిందుకోవాలి. వీటిలో ఏది ఉన్నా మీకు ఆయాసము , బరువుగా ఉన్నట్లు అనిపించును.  మంది డాక్తర్ ని సంప్రదించి తగిన మందులు వాడాలి. గుర్రపు వాతము ('elcampsia ) రాకుండా జాగ్రత్త పడాలి.

  •  *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do we not use vitamin tablets?,విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము
  •  

  •  

ప్ర : మా ఫామిలీ డాక్టర్ మల్టీవిటమిన్‌ మాత్రలు ఎక్కువగా వాడకూడదని అన్నారు. మనము విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

జ : విటమిన్‌ మాత్రలు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటి లేమి శరీరము నకు  అనేక రోగాలకు  తట్టుకునే శక్తి ఉండదు. అయితే వైద్యులు చెప్పకుండా విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదు. విటమిన్లు శరీరానికి అవసరమే కాని వాటిని మితముగా అవసరమున్నంతవరకే వాడాలి. విటమిన్ల లో నీటిలో కరిగేవి , నూనెలో కరిగేవి అని రండురకాలు . .   'A,'D,'E అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అతిగా వేసుకుంటే శరీరానికి ఇబ్బందులు తప్పవు . ఇవి ఎక్కువగా తింటే కాలేయములో నిలువచేయబడి శరీరము మీద వ్యతిరేక ప్రభావము చూపుతాయి.
  • జుట్టు రాలిపోవడము,
  • ఆకలి మందగించడము ,
  • ఎకుకల నొప్పులు , 
  • కొన్ని సమయాలలో లివర్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశము , ఉంటుంది.
నీటిలో కరిగే విటమిన్లు ఎక్కువగా వాడినా  ... అవి మూత్రము ద్వారా విసర్జించబడి నందున సైడు ఎఫెక్ట్ (వ్యతిరేక ప్రబావము) ఉండదు . వీటిని అంటే 'B,'C, విటమిన్లను  వాడుకోవచ్చును.

అందువలన మల్టీవిటమిలు ఎలాబడితే అలా  వేసుకోవద్దు . మంచిది కాదు.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, December 8, 2014

How to remove Spots on teeth ?,పళ్ళపై మరకలు పోయేదెలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

ప్ర : పళ్ళపై మరకలు పోయేదెలా?

జ : పళ్ళ గురించి ఎంతగా శ్రద్ద వహించినా పడిన మచ్చలు , గార తొలగదు . అందుకు సరియైన జాగ్రత్తలు తీసుకుని కొన్ని కిటుకలు పాటిస్తే తొలగించుకోవడము సులువవుతుంది.  కాఫీ , టీ , వైన్‌, సోడా అలవాటు మచ్చల కి , గారకు దారితీస్తుంది . వీటిని కొన్ని గృహచికిత్సలతో తొలగించుకునే వీలు ఉన్నది.
1.స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ ప్రభావ వంతమయిన టీత్ -వైట్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలు చిదిమి , ఆ గుజ్జుతో ముందుగా బ్రెష్ చేసి తరువాత టూత్ పేస్ట్ వాడాలి. ఇలా వారానికి కనీసము ఒకసారైనా చేస్తుండాలి . ఎక్కువసార్లు చేస్తే దీనిలోని యాసిడ్ పంటిపై ఉండే ఎనామిల్ కు హాని కలిగిస్తుంది.
2.బేకిగ్ సోడాలొ టూత్ బ్రెష్ అద్ది బ్రెష్ చేసుకుని తరువాత సాధారణ పేస్ట్ తో పళ్ళు తోముకోవాలి.  ఎప్పుడైనా నిమ్మరసము చుక్కలు వేసినా ఫలితము బాగుంటుంది.
3 . నెలకోసారి ఉప్పు , బేకింగ్ సోడా నీరు  కలిపి బ్రెష్ చేసుకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి. మరీ గట్టిగా రుద్దకూడదు.
4. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న కొన్నిరకాల వైట్నింగ్ టూత్ పేస్టులు కూడా ఉన్నాయి.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -