Saturday, December 29, 2012

ప్రోటీన్‌ షేక్స్ తీసుకోవడము వల్ల బరువు శీఘ్రము గా తగ్గుతామా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : ప్రోటీన్‌ షేక్స్ తీసుకోవడము వల్ల బరువు శీఘ్రము గా తగ్గుతామా?

జ : మామూలు భోజనము స్థానే ప్రోటీం షేక్స్ తీసుకోవడము వలన క్యాలరీల సంఖ్య తగ్గవచ్చు .. కానీ దానివలన  శరీరానికి అందాల్సిన అత్యవసర పోషకాలు అందవు . ఈ పోషకాలు పూర్తిస్థాయి ఆహారములొనే లభిస్తాయి. పోటీన్ల లో సైతం కేలరీలు ఉంటాయి. అతిగా తరచుగా తింటే లాభమేమీ ఉండదు. అది ఆరోగ్యవంతమైన మార్గము కాదు . తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన సమతుల్య ఆహారము పరిమితము గా తింటూ తగిన వ్యాయామము చేయాలి తప్ప బరువు తగ్గాలకుంటే పోటీన్‌ షేక్స్ ప్రత్యామ్నాయాలు కావు.
  •  ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

ఈ రోజుల్లో నిద్రలేమి అన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నదెందుకు?

  •  
 
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : ఈ రోజుల్లో నిద్రలేమి అన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నదెందుకు?

జ : నిద్రలేమి అన్నది ఓ వ్యాధి కాదు . నిద్రపట్టడము లేదనుకుంటూ వైద్యుని దగ్గరకు వెళ్ళడము అర్ధరహితము . ఎందుకంటే ఆ లోపము మన జీవనవిధానము లో దాగిఉంటుంది. పురుషుడి శరీరము రోజుకు కనీసము 8 గంటల హార్డ్ వర్క్ కు అనుగుణము గా ఉంటుంది. అంతపనిచేశాక నిజానికి నిద్ర హాయిగా పట్టలి... కాని నేటి జీవన విధానములో ధనాన్ని బాగా సంపాదించగలుగుతున్నారు కాని నిద్రను పొందలేకపోతున్నారు. అందుకే శతాబ్దాలుగా ఓ సామెత ఉన్నది. " చక్రవర్తులకంటే యాచకులే ఎక్కువగా నిద్రపోగలరు " అని .

మనస్సుకు ఎంత పని పెట్టినా శరీరానికి చాలినంత చురుకుదనము ఉండాలి . శరీరానికి అవసరమైన సహజ కోర్సు లేకపోవడము వల్లే నిద్ర రాకపోవడమనేది ఓ సమస్యగా పరిణమిస్తుంది.  ఏదో అనారోగ్యమో , మందులవల్లో నిద్రలేమి అనేది కొందరి వీషయములోనే ఉంటుంది తప్ప అన్నీ బావుండీనిద్రరావడములేదంటే లోపము శరీరములో కాదు మనస్సులో ఉన్నట్లు లెక్క . గంటలు కొద్దీ కంప్యూటర్ల ముందో, టివి ల ముందో , ఏ ఫైల్స్ లోనో తలదూర్చి పనిచేసుకునేవారు నిద్ర రావడము లేదనుకోవడము పొరపాటు .. ఆ పని నిద్రకు సహకరించేదో ? కాదో? విశ్లేషించుకోవాలి. మన మెదదులో బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ప్రతిరోజూ ఒకే వేలకు నిద్రకు ఉపక్రమించాలి. ఒకే వేళకు నిద్రలేవాలి. రాత్రులు పని ఎక్కువగా ఉన్నవారు, ఆలస్యముగా నిద్రపోయే వారు పగలు ఆ లోటు తీర్చుకోవాలి. పగలు నిద్ర పోవాలి. ఆ విధము గా మొత్తము 8 గంటలు నిద్ర పోయేట్లు చూసుకోవాలి. అంతకీ నిద్ర రావడము లేకపోతే డాక్టర్ ని కలిసి తగిన సలహా తీసుకోవాలి. 
  • ============== 
visit my website - > Dr.Seshagirirao-MBBS

రన్నింగ్ చేశాక వర్కవుట్లు సాగిస్తుంటే నా కాళ్ళలో సోర్నెస్ ఎక్కువగా ఉంటున్నది, sourness in legs on doiing workouts why?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : రన్నింగ్ చేశాక వర్కవుట్లు సాగిస్తుంటే  నా కాళ్ళలో సోర్నెస్ ఎక్కువగా ఉంటున్నది . కొనసాగించవచ్చా? ఆ పేయాలా?

జ : వర్కవుట్ ప్రోగ్రమ్‌స్  అప్పుడప్పుడే ఆరంభించి ఉంటే కనుక కాళ్ళలో సోర్నెస్  ఉంటుంది. ఇంతకు ముందు ఈ కండరాలతో వ్యాయామము చేయకపోవడమే ఇందుకు కారణము అయ్యిఉంటుంది. మీ తొలివారం , ప్లాన్‌ లో రన్నింగ్ గనుక భాగం అయితే , సోర్ నెస్ ఉన్నా వర్కవుట్లు సాగించవచ్చు.  వారము తర్వాత కూడా అదే నొప్పి ఉన్న పక్షములో మీ రన్నింగ్ సమయాన్ని దూరాన్ని తగ్గించాలి. లేదా ఇతర వర్కవుట్లు పెంచుకొని నెమ్మది నెమ్మది గా రన్నింగ్ సమయాన్ని , దిస్టెన్‌స్ ను ని పెంచుకోవాలి . మిగతా అదే సర్ధుకుంటాది.
  • =============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, December 24, 2012

Do I take alcohol if Cholestirol is high?,కొలెస్టిరాల్ ఎక్కువ ఉన్నప్పుడు మందు తాగవచ్చునా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నాకు వ్యాపారము ఉంది . పార్టీలలో మందు తీసుకోవడము తప్పదు . కొలెస్టిరాల్ ఉందని డాక్టర్ చెప్పారు.ఏమి చేయమంటారు ?

జ : ఏ వృత్తి అయినా మందు తాగడము ఆరోగ్యానికి మంచిది కాదు . ఇంతకాలము ఎంజాయ్ చేసారుగా .. ఇక వయసు పెరిగే కొద్ది మనిషి కి వచ్చే వ్యాదులను(బి.పి, సుగరు, గుండె జబ్బులు ) దృష్టిలో ఉంచుకొని మందు తాగడము మానెయ్యాలి . అప్పటికీ తప్పదు అంటే 10-15 రోజులకొక సారి 2 లేదా 3 పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోకూడదు . అలాగే ఆహారములో పంచదార , పంచదార కలిసిన పానీయాలు , చాక్లేట్లు , ఎక్కువ తేనె , జామ్‌ ,జున్ను, వెన్న , నూనె వేపుడు కూరలు , వేయించిన జీడిపప్పు, వేరుశనగ పప్పు తినకుండా జాగ్రత్త పడాలి . మొత్తము మీద కొలెస్టిరాల్ ను ఎక్కువ చేసే పదార్ధాలు తినకూడదు .
  • ================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Advise for Double chin-నాకు డబుల్ చిన్‌ ఉన్నది.సరిచేసుకునే ప్రక్రియ ఏమైనా ఉన్నదా?

  •  
  •  image : courtesy with -Wikipedia.org-
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నాకు డబుల్ చిన్‌ ఉన్నది . దీనివల్ల నేను ఉన్న వయస్సు కంటే పెద్దగా కనపడుతున్నాను . దీన్ని సరిచేసుకునే ప్రక్రియ ఏమైనా ఉన్నదా?

జ : వయసు పెరిగే కొద్ది మెడపైన కండరము నేరుగా చుబుకము కింద సాగడము తో ఇలా డబుల్ చిన్‌ ఏర్పడుతుంది . వయస్సు పెరుతున్న కొద్దీ వచ్చినా వాంచనీయము కాదు . దీనికి కాస్మటెక్ సర్జన్లు చిన్న ఆపరేషన్‌ తో ఎక్ష్ట్రా ఫ్యాట్ ను తీసివేసి సరిచేస్తారు. సర్జరీ లేకుండా దీనిని పోగొట్టుకునే అవకాశము  ఉంది. దీనికి ఇతర కారణాలు : జెనెటిక్ టెండెన్సీ , వ్యాయామ లోపము , నీరుచేరడము వంటివి కావచ్చు.
ఒక వేళ మీరు అధిక బరువు ఉంటే లో-ఫ్యాట్ , లో-క్యాలరీ, లో-కార్బోహైడ్రేట్ తీసుకుంటూ ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలి .
క్రమము తప్పకుండా వ్యాయామము చేయాలి.
ఫేషియల్ ఎక్షరసైజ్లు ప్రభావంతం గా చుబుకం కండర్రాల్ని బుగుతు గా మార్చుతాయి.
ఇలా కొంతకాలము ప్రత్యేక శ్రద్ద చూపితే ఫలితము కనబడుతుంది.
  • =================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Solution for Snoring during sleep?,నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడతాను పరిష్కారము?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 40 సంవత్సరాలు . డయాబిటీస్ , బి.పి. ఉనాయి. నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడతాను . నా బరువు 128 కె.జి.లు  నా సమస్యకు పరిష్కారము ఉండా?

జ :  అసలు గురక ఎందుకు వస్తుంది...?  సాధారణంగా నిద్రించే సమయంలో ముక్కుతో గాలి పీలుస్తుంటాం. ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే మనకు తెలియకుండానే నోటి ద్వారా శ్వాసిస్తుంటాం. ఇలాంటి సందర్భంలో శ్వాసకోసం సంకోచ వ్యాకోచాలకు గురై నాలుక, అంగిటను నియంత్రించే కండరాల నియంత్రణ విఫలం అయినప్పుడు వచ్చే శబ్దమే గురక.

మీరు స్థూలకాయము అనే సమయతో మరియు తత్సంబంధిత కో-మార్బిడిటీస్ తో బాధపదుతున్నారు. మొదట స్థూలకాయము తగ్గే మార్గాలు చూడండి .ఈ క్రింది  లింక్ లో చూడవచ్చును .

Obesity : http://vydyaratnakaram.blogspot.in/2009/12/obesity.html 

అవసరమనుకుంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోండి . మీ సమస్యకు పరిష్కారము లభిస్తుంది .
 ============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, December 18, 2012

Pain in Lower abdome during sex-ఉదరభాగము కింద గుచ్చుకున్నట్లుగా నొప్పి

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 

 ప్ర : సెక్ష్ లో పాల్గొన్న ప్రతిసారి ఉదరభాగము కింద గుచ్చుకున్నట్లుగా నొప్పి వస్తోంది . సిస్ట్ ఉంటే ఇలా జరుగుతుందా? (ఒక సోదరి)

జ : పొత్తికడుపులో  నొప్పిరావడానికి చాలా కారణాలు ఉంటాయీ. సిస్ట్స్ కావచ్చును. ఎండోమెట్రియాసిస్ , ఇతర గైనకాలజికల్ పరిస్థితులు కావచ్చు . స్థానికము గా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా నొప్పి ఉంటుంది. కామన్‌ గా యూనరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారికి ఈ విధము గా నొప్పి ఉంటుంది. కొంతమందికి హెర్పీస్ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా గుచ్చుకున్నట్లు నొప్పి రావచ్చును. ఏది ఏమైనా లేడీ డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి . లేకపోతే సెక్ష్ జీవితము బాధాకరముగా ఉండును . నరకమే .
  •  ============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, December 16, 2012

Tell hints those could push back age some time, వయసు కొంత వెనక్కి మళ్ళినట్లు కనిపించగల సూచనల్ని వివరించండి

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q: Tell hints those could push back age some time, వయసు కొంత వెనక్కి మళ్ళినట్లు కనిపించగల సూచనల్ని వివరించండి .

:ఖరీదైన యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు యవ్వనవంతమైన చర్మానికి సంబంధించి ప్రధానపాత్ర పోషించినప్పటికీ  మనము చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. అవి ->..

మంచినీళ్ళు : చర్మము చక్కని తేమతో ఉండి శరీరము లోపలి విషతుల్యాలు వెలికి పోవాలంటే రోజుకు కనీసము 5-6 గ్లాసులు (1 లీ.-1.5 లీ) నీరు తాగుతుండాలి . మంచినీళ్ళు , బ్లాక్ లేదా గ్రీన్‌ టీ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఫ్లేవనాయిడ్స్ ను అందిస్తాయి. బాగా రసాలతో నిండి ఉండే పండ్లు , కూరలు  చర్మము హైడ్రే్షన్‌ ను , డెన్సిటీని పెంచుతాయి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ : సల్మాన్‌ , సార్డిన్స్ , వాల్ నట్స్ , గుడ్లు లలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నందున చర్మకణాలకు బాగా మంచిది.

ఎ,సి,ఇ  విటమిన్లు : ఈ మూడు విటమిన్లు చర్మానికి మంచి చేస్తాయి. పాలకూర , క్యారెట్లు , చిలగడదుంపలు , యాప్రికోట్స్ లలో ఉండే యాంటీ ఆక్షిడెంట్స్ త్వరితము గా వార్ధక్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. కివి , సిట్రస్ పండ్లు , బ్రొకోలి లలో ఉండే విటమిన్‌ ' సి" , కొల్లాజిన్‌ మెరుగుపరిచే గుణము , ఆకుకూరలలో ఉండే విటమిన్‌ " ఇ " సూర్యకిరణాలనుండి చర్మాన్ని రక్షిస్తాయి .

పూరిస్థాయి ధాన్యాలు : వీటిలో లభించే యాంటీ ఏజింగ్  యాంటి ఆక్షిడెంట్లు , పీచు చర్మానికి హానిచేసే చెడు కొలెస్టిరాల్ నుండి , విషపదార్ధాలు (టాక్షిన్‌లు )నుండి కాపాడుతాయి.

సిలికా : ఇది చర్మము లోని తేమను పట్టివుంచి వెలాసిటీ ని మెయిన్‌టైన్‌ చేయడము లో సహకరిస్తుంది .

కెరొటినాయిడ్స్ : ఆకుకూరలు , పండ్లు , క్యారట్  లలో ఉండే కెరొటినాయిడ్స్  చర్మాన్ని ఆరోగ్యవంతం గాను , కాంతివంతం గాను ఉండేందుకు సహకరిస్తాయి.

ఈ విధము గా ఆహార ఆలవాట్లు , వ్యాయామ అలవాట్లు , తగినంత నిద్ర  వయసు తక్కువగా కనబడేందుకు దోహదం చేస్తాయి.

  • ============================

 visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, December 8, 2012

Feeling guilty for very little sister-చిన్న చెల్లెలు ఉందని తన ఫ్రండ్స్ కు చెప్పడానికి సిగ్గుపడుతుంది

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : మా ఇద్దరమ్మాయిల నడుమ వ్యత్యాసము 12 సంవత్సరాలు . పెద్దమ్మాయి తనకంత చిన్న చెల్లెలు ఉందని తన ఫ్రండ్స్ కు చెప్పడానికి సిగ్గుపడుతుంటుంది . ఇంట్లో చెల్లెలి తో  ప్రేమగా నే ఉంటుంది . కాని స్నేహితులముందే అదో రకము గా ఉంటుంది . ఏమి చేయాలి?.

జ : ముందుగా ఇద్దరమ్మాయిల మధ్య మంచి బాంధవ్యాన్ని ఏర్పరచడము అవసరము . ఇద్దరూ ఇంటి బయట ఎక్కువసేపు గడిపేలా చూడాలి. ఇద్దరూ కబుర్లు  చెప్పు కోవడము చేస్తూఉంటే వారి మధ్య బాంధవ్యము దృఢమవుతుంది. పెద్దవాళ్ళలో కొంత అధికారిక ప్రవర్తన సహజమే. పైగా వయసు  వ్యత్యాసము ఎక్కువ కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రకము ధోరణి వల్ల చిన్నపాప ఏవిధముగా ప్రభావితము అవుతుందనేది ముఖ్యము . ఇంట్లో మీరు లేని సమయము లో చిన్న పాప బాధ్యతలు  పెద్దపాపకు  అప్పగించి చూడండి. దీనివల్ల ఆమెలో బాధ్యత పెరుగుతుంది . నెమ్మది నెమ్మదిగా ఇలా రకరకాలు గా ఆమె ధోరణి మానేలా చేయాలే తప్ప చీదరించుకోకూడదు , దండించరాదు . . . ఒక్క రోజులో మార్చేయాలని ప్రయత్నించకండి.
  • ============================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, December 2, 2012

Lumps in Breast-రొమ్ములో గడ్డలు

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర  : నా భార్య వయసు 40. ఆమెకు రొమ్ములో గడ్డలు వస్తే డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే మళ్లీ మళ్లీ రావచ్చని, అవి క్యాన్సర్ గడ్డలుగా మారవచ్చని కూడా అన్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. ఇలాంటి గడ్డలు మళ్లీ రాకుండా  మంచి ఔషధాలు సూచించండి.

జ :రొమ్ము లో అన్ని గడ్డలు క్యాన్‌సర్ గడ్డలు కావు . కొన్ని  ఫైబ్రోఎడినోమా అనే బినైన్ ట్యూమర్స్. ఇవి క్యాన్సర్‌లా హానికరమైనవి కావు. మహిళలకు 30 ఏళ్ల వయసులో ఇలాంటి గడ్డలు రొమ్ములో రావడం మామూలే. ఇలాంటివి కనిపించినప్పుడు రెండు నెలలకోసారి అల్ట్రాసౌండ్ లేదా మమ్మోగ్రఫీ వంటి పరీక్షలు చేయించి జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయాక ఇలాంటి గడ్డలు రావడం కూడా చాలామందిలో తగ్గిపోతుంది. అయితే ఇలాంటి గడ్డలు వచ్చినప్పుడు... వాటి కారణాలేమిటి, వారి మానసిక పరిస్థితులు, తత్వం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇచ్చి, వాటిని పూర్తిగా నయం చేయవచ్చు. గడ్డలు వచ్చే శరీర తత్వం ఉన్నవారికి ఆపరేషన్ చేసినా ఇవి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి  వైద్యుడికి చూపించాకే మందులు వాడటం మంచిది. 
 Some fibroadenomas respond to treatment with ormeloxifene.
  • ========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

Blisters on Lips-పెదవులపై నీటిపొక్కులు

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నా వయుసు 25 ఏళ్లు. నాకు పెదవులపై నీటిపొక్కులు వస్తున్నాయి. ఇది ఏమైనా అంటువ్యాధా? వాటికి ఏ మందులు వాడాలి? నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి.

జ : పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫివర్ బ్లిస్టర్స్ అంటారు. ఇవి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ''హెర్పీస్ సింప్లెక్ష్'' వలన  వస్తాయి. టీబీ, సిఫిలిస్, లుకేమియా, ఎనీమియా, ఏదైనా మందుల వల్ల, అలర్జీ వంటి వాటివల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది.. ఒకటి నుంచి రెండు వారాల్లో ఇవి వాతంతట అవే తగ్గిపోయి... మళ్లీ శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడో బయటపడటం సాధారణం. ఈ నీటిపొక్కులు అంటువ్యాధి . వీటికి(herpes simplex) .. నోటిలోపల వచ్చే ఆఫ్థస్ అల్సర్(canker sore) లకి తేడా ను గుర్తించాలి. ఆఫ్థస్ అల్సర్స్ అంటువ్యాధి కాదు .

పూర్తి సమాచారము కోసము -> హెర్పీస్ సింప్లెక్ష్
  •  ==========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS