Tuesday, December 28, 2010

Thyroid problem conception, థైరాయిడ్ సమస్య పిల్లలు పుట్టడం

Q : నా వయసు 26. పెళ్లై నాలుగేళ్లు అవుతోంది. పిల్లలు కలగడం లేదని టెస్టులు చేయించుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్టు పోయిన ఏడాది తెలిసింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాను. దాంతో సమస్య అదుపులోనే ఉంది. కాని ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అయితే నాలుగు నెలల నుంచి పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని సంప్రదించాను. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో ఈ సమస్య సాధారణమే అన్నారు. పిల్లలు పుట్టేందుకు థైరాయిడ్ సమస్య అవుతుందా? నాకు పిల్లలు కలిగే యోగం ఉందా? దయచేసి చెప్పగలరు.



A : థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో చాలా భాగాల పెరుగుదలపై, వాటి పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఫెర్టిలిటీ, రీ-ప్రొడక్షన్ ముఖ్యమైనవి. థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి మారతాయి. టాబ్లెట్లు వాడుతున్నప్పుడు నెలసరి సరిగ్గా ఉందన్నారు కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించండి. అది మామూలుగా ఉన్నట్లయితే పీరియడ్స్ నాలుగు నెలల పాటు రాకపోవడానికి ఇతర కారణాలు వెతకవలసి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ మామూలుగా లేకపోతే, వాటి స్థాయులను బట్టి మందులు వాడాలి. దీంతో పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్ లెవల్ మామూలుగా ఉండి, పీరియడ్స్ సాధారణంగా ఉన్నట్లయితే పిల్లలు పుట్టడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. కాని ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ హార్మోన్ టాబ్లెట్లు వాడాలి. తరచుగా థైరాయిడ్ లెవల్స్‌ని టెస్ట్ చేయించుకోవాలి. బిడ్డకి కూడా పుట్టిన కొద్ది రోజులకే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.


  • =======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి,Poly cystic Overian Disease(PCOD)




Q : నా వయసు 22. పెళ్లయి రెండేళ్లవుతోంది. మెచ్యూర్ అయిన నాటి నుంచి పీరియడ్స్ రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే స్కానింగ్ చేసి పి.సి.ఓ.డి వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఐదు నెలలుగా హార్మోనల్ ఇంజక్షన్స్ ఓవులేషన్... ఇస్తున్నారు. నా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్లు ఈ ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపెడుతున్నారు, ఇది నిజమేనా? ఐదు నెలల తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. బరువు 75 కేజీలు ఉన్నాను. తలనొప్పి, చెవి నొప్పి విపరీతంగా బాధిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు. - సుగుణ,



A : ఇంతకు ముందు ఎన్నోసార్లు పాలిసిస్ట్‌క్ ఓవరీస్ గురించి మనం తెలుసుకున్నాం. పీరియడ్స్ సక్రమంగా వచ్చే స్ర్తీలలో అండాశయాలలో ప్రతినెలా కొన్ని అండాలు వృద్ధిచెందడం మొదలవుతుంది. వీటిలో అన్నింటికన్నా ఆరోగ్యంగా ఉన్న అండం పరిమాణంలో వేగంగా పెరిగి 12 నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. మిగిలిన అండాలన్నీ వృధా అయిపోతాయి. కొన్ని సందర్భాలలో ఇలా జరగక మిగిలిన అండాలన్నీ ఎంతో కొంత ఎదిగి అలాగే ఉండిపోతాయి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన ప్పుడు ఇవి చిన్న చిన్న నీటి బుడగలుగా లేదా సిస్టుల్లాగ కనపడతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఓవరీస్‌లో సిస్టులు ఉండటంతో పాటు అధిక బరువు, ఇరెగ్యులర్ పీరియడ్స్, అవాంఛిత రోమాలు... వంటి సమస్యలు కూడా తోడైనప్పుడు దీనినే పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి. అంటాం. ఇది ఉన్న స్ర్తీలలో ట్యాబెట్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ప్రెగ్నెన్సీ కోసం అండం విడుదలను నియంత్రిస్తారు.

ఈ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు హార్మోన్లకు సంబంధించినవి అయి ఉండటం వల్ల ఇవి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఒక నెలకి మందులు రాయించుకొని డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మళ్లీ అదే ట్రీట్‌మెంట్ కొనసాగించిన వారిలో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఈ ట్రీట్‌మెంట్ వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వంటి సమస్యలు కలగవు. చెవి ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలు లేదా సైనసైటిస్ వంటి కారణాల వల్ల కూడా తల, చెవి నొప్పి కలగవచ్చు. కాబట్టి మీరు ఇ.ఎన్.టి డాక్టర్ చేత పరీక్ష చేయించుకొని తగిన సూచనలు పొందండి. ఇక పాలిసిస్ట్‌క్ ఓవరీకీ ఎన్నో రకాల ట్రీట్‌మెంట్‌లు ఉన్నాయి.

మొదటిది: ఈస్ట్రోజెన్+ప్రొజెస్టరాన్ కలిపిన ట్యాబ్లెట్లు వాడటం

రెండవది: ప్రొజెస్టరాన్ మాత్రమే కలిగిన ట్యాబ్లెట్లు వాడటం

మూడవది: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే అండం ఎదుగుదలకు, విడుదలకు ట్రీట్‌మెంట్ తీసుకోవడం

నాలుగవది: పేషెంట్‌కు జీవనశైలిలో మార్పుల గురించిన అవగాహన కలిగించడం

ఐదవది: ట్యాబ్లెట్ల వల్ల ఫలితం లేనట్లయితే ల్యాపరోస్కోపీ ద్వారా ఈ సిస్టులను పంక్చర్ చేయడం

{పతి పేషెంట్‌కు వారి వారి సమస్య తీవ్రతను బట్టి పై చెప్పిన ట్రీట్‌మెంట్లలో ఏది సరియైనదో డాక్టర్ నిర్ణయిస్తారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న అందరిలో ట్రీట్‌మెంట్ ఒకేలా ఉండకపోవచ్చు. అందుచేత మీరు మీ స్నేహాతులు, చుట్టుపక్కల వారు చెప్పిన విధంగా లేదా పుస్తకాలు, పేపర్లలో ఎవరి సమస్యలో ఉన్న విధంగా మీ సమస్యను పోల్చుకోకండి. మీకు అనువైన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్ సలహా మేరకు వాడి తగిన ఫలితాన్ని పొందండి.

  • ==========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Sunday, December 19, 2010

టిటానస్ టీకా ఇచ్చే విధానము , Tetanus vaccination schedule

ప్ర : మా పాపకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి టెటానస్ వ్యాక్షిన్‌ను ఏ గాయము కాకపొయినా ఇస్తుండాలి అని డాక్టర్ చెప్పారు . ఇది అవసరమా?

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKKaqtagJdRM_7tFgpOp2-Rdi0KKcDK6NbzpxrUazq_c1bVvc_PPwVJd1KyjA15U39Jv5kotmvnuS0ALiCTq-OF6r-_Pi08358HIO3hPqORXF00atWG8pGwgZTABKT8oNB3RZmSBx_Hqk/s1600/Vaccination+injecting.jpg

జ : శారీరక కండరాల్ని , నరాల్ని ప్రభావితం చేయగల టెటానస్ సీరియస్ వ్యాధి అయినా నయము చేయగలదే . దుమ్ము , ధూళి , ముల్లు , పాత లోహాలు పైన టేటానస్ స్పోర్స్ స్థావరాలు ఏర్పరచుకుంటాయి. చర్మము పైన , శరీరము పైన గాయాలు అయినపుడు ఈ టెటానస్ స్ఫోర్స్ మన శరీరము లో ప్రవేశించి దనుర్వాతము అనే జబ్బును కలుగుజేస్తాయి .

అలాగే నియోనాటల్ టెటానస్ మరో రకము . అది అపరిశుభ్ర వాతావరణములో ప్రసవించిన నూతన శిశువులకు సోకుతుంది . గర్భవతులు రొటీన్‌ ఇమ్యునైజేషన్‌ వల్ల తల్లి ద్వారా గర్భము లో ఉన్న శిశువులకు యాంటిబాడీస్ అందుతాయి . గర్భినీలు 6, 7, 8 నెలల గర్భినీ కాలములో 3 లెదా 2 టెటనస్ టాక్షాయిడ్ ఇంజెక్షన్‌ తీసుకోవాలి .

చిన్నపిల్లకు : 2, 4, 6 , 18 నెలల వయసు లో టెటానస్ టీకాలు ఇప్పించాలి . తరువాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి గాయాలు అయిన ... అవకపోయినా... బూస్టర్ డోసు ఇస్తూ ఉండాలి .


  • ==============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Thursday, November 11, 2010

గర్భిణీ లో నొప్పినివారణ మందులు , Pain killers in pregnency

ప్ర : నేను ఏడునెలల గర్భవతిని . తరచుగా వెన్నునొప్పి వస్తోంది . పెయిన్‌ కిల్లర్స్ వాడొచ్చా?.

జ : వైద్యుల సలహాలేకుండా పెయిన్‌ కిల్లర్స్ వాడవద్దు . కొన్ని పెయిన్‌ కిల్లర్స్ కిడ్నీల పై దుష్పలితాలు చూపే అవకాశాలున్నాయి . ఎక్కువ నొప్పి అయిఉంటే బయట (external) మూవ్ లాంటి లేపనాలు రాయవచ్చును .
పారాసెటమాల్ మాత్రలు ... జ్వరానికి , నొప్పులకు వాడవచ్చును .. రోజుకు 3 *500 మి.గ్రా. మించి వాడరాదు .
ఇబుపోఫెన్‌ (Ibuprofen) , కొడిన్‌ (Codin) యాస్ప్రిన్(Asprin) లాంటి నొప్పిమాత్రలు అస్సలు వాడకూడదు . వీటివలన గర్భస్రావాలు(Abortions) జరిగే అవకాశాలు ఎక్కువ . మగపిల్లలు పుడితే వృషణాలు కిదికి దిగకుండా(Cryptorchidism) ఉండి అభివృద్ధిచెందవు .
కొన్ని ఉదాహరణలు :
Asprin -------------------- low birth weight ,
all NSAIDS(ibuprofen)----- abortions , still births,
Quinine ------------------- miscarriages and premature labour,
Beta blockers-------------- Long term use cause IUGR

  • =======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, October 12, 2010

పిల్లలకు తరచు గా జ్వ్రము రావడం , Frequent attack of fever in children

ప్ర : మాపాప వయసు 7 సంవత్సరాలు తరచూ జ్వరము వస్తుంది ఎందుకు ? .. 104 డిగ్రీలు ఉంటుంది .

జ : శరీరము లోపల సంభవించే బ్యాక్టీరియల్ , వైరల్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు శారీరక రోగనిరోధక ప్రక్రియ చేసే ప్రయత్నం లో ' జ్వరము ' ఒక లక్షణము . శరీరములొ ఏదో అనరోగ్యము ఉందనడానికి జ్వరము ముఖ్యమైన సూచన .

ఇందుకోసము వైద్యసహాయము అవసరము . థెర్మోరెగ్యులేటరీ సెట్ - పోయింట్లో తేడా జ్వరము తీవ్రతకు కారణమవుతుంది . సాదారణముగా ఈ సెట్ పోయింట్ తగ్గించే క్రమంగా శారీరక ఉష్ణోగ్రత తగ్గించే చికిత్స చేస్తారు . తడిగుడ్డ తో శరీరాన్ని తుడవడం , నుదుటపై తడి గుడ్డ వేయడం చేయాలి . అప్పటికీ తగ్గక పోతే డా్క్టర్ ని చూపించాలి .

  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Monday, August 9, 2010

మిరప ఘాటు మాయం , Chilly hotness in the mouth

ప్రశ్న : మిరపకాయ తినడం వల్ల నోటి కారము ఎలా పోతుంది ? రఘు - దేవర వీధి -శ్రీకాకుళం .

జవాబు : ఒక్కోసారి భోజనం చేస్తుంటే చటుక్కున పచ్చిమిరపకాయముక్క నమిలేస్తాం. ఇంకేముంది నోరంతా ఒకటే మంట. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు? ఏముంది వెంటనే ఓ గ్లాసు మంచినీళ్లు తాగుతాం అంటారు కదూ! కానీ మంచినీళ్లు ఘాటును తగ్గించలేవట. ఎందుకంటే.. పచ్చి మిరపకాయ నమలగానే అందులోని నూనె గుణాలు నోరంతా విస్తరిస్తాయి. ఈ సమయంలో మంచినీళ్లు తాగితే అవి నూనెను గ్రహించలేవు. అందుకే వెంటనే ఘాటు తగ్గదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా..! రెండు చుక్కల మజ్జిగ లేదా చెంచా పెరుగును నోటిలో వేసుకోండి. ఇవి నూనెనంతా గ్రహించివేసి కారాన్ని తగ్గిస్తాయి. అదే పిల్లలకైతే అరగ్లాసు పాలు లేదా ఓ బ్రెడ్డు ముక్క తినిపించండి .



  • =======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, May 15, 2010

నిద్రలో పళ్ళు కొరకడం , Teeth biting in Sleep

ప్రశ్న : మా పాప కి ఎనిమిదేళ్ళు నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్నది . దీన్ని నయము చేసే మార్గము ఉందా? పొట్టలో పురుగులు ఉంటే ఈ విదం గా చేస్తారంటే పాముల మందు పట్టేను ఫలితం లేదు .
జ : నిద్రలో పళ్ళుకొరకడం అన్నది నిద్రకు సంబంధించిన ఓ లోపమే తప్ప కడుపులొ పురుగులకు ఏమాతం సంబంధించినది కాదు . నిద్రలోకి బాగా (deep) వెళ్ళిన దసలో ఇలా పళ్ళుకొరుకుతారు .

ఇది స్లీప్ వాకింగ్ , స్లీప్ టాకింగ్ లాంటి రుగ్మతే . దీనికి ఖచ్చితమైన కారణం ఇదీ అని ఎవరూ చెప్పలేరు . అయితే మనషు లోపల ఉన్న ఎమోషన్లను వ్యక్తీకరంచే రకము , లేదా ఆ రోజు జరిగిన విషయాలకు పతిస్పందన అని సధారణం గా చెప్పుకుంటాము . దీనికి ప్రత్యేకమైన చికిత్స లేదు . ప్రక్కనే పకున్న వారికి నిద్రాబంగము కలుగు తుంటుంది కాబట్టి దంతవైద్యుడిని సంప్రదిస్తే రాత్రివేళ నోటిలో పెట్టుకునే "మౌత్ గార్డ్ " తయారుచేసి ఇస్తారు . దీని వల్ల పళ్ళు అరిగిపోవడం లాంటివి ఉండవు .
  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Tuesday, May 11, 2010

Self Confidence importance , ఆత్మ విశ్వాసము అంటే ఏమిటి ?

ఫ్ర : ఆత్మ విశ్వాసము అంటే ఏమిటి ? దానిని ఓ అలవాటుగా మార్చుకోవడం సాధ్య పడుతుందా?




జ : కాన్క్ష్ఫిడెనంట్ అనేది ఓ మైండ్ గేమ్ , ఇది ఒక నమ్మకము తో కూడుకున్నది . సాధ్యపడుతుందా ? లేదా అని సందేహపడకుండా దాన్ని ఓ అలవాటుగా మార్చుకుని తీరాలి . దానికోసం అభ్యాసం అవసరము . మన చుట్టూ ఉండే వారిలో ఆత్మ విశ్వాసము తొణికిస లాడే వారినుంచి నేర్చుకొవాలి . వారేమి చేస్తున్నారు , తమను తాము ఎలా ఆర్గనైజ్ చేసుముంటున్నారు అన్న విషయాల్ని నిశితం గ పరిశీలించాలి . అవసరమైతే వారి సహాయము కోరాలి .

మీలోని బలాలపై మీరు ఫొకస్ మేసుకోగగాలి . వాటన్నింటినీ ఓ జాబితా తయారుచేసుకుని , వాటిని స్పూర్తిగా తీసుకోవాలి .అపజయాల్ని కాకుండా విజయాల్ని పరిగణలోకి తీసుకుంటే విశ్వాసము ఇనుమడిస్తుంది . నడిచేటప్పుడు , నిలబడేటప్పడు నిఠారుగా ఉండండి . హాయిగా నవ్వంది , స్పష్టంగా మాట్లాడండి . ఇవన్నీ ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేసేవే . ఏ పనినైనా స్లువుగా ముగించగల మార్గాలు అన్వేషిస్తూ ఉండాలి . మీరు ఎప్పుడూ ఎవ్వరితోను పోల్చుకోకూడదు . ఎవరి దృక్పధం , ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయి . స్వంత ప్రాధాన్యతాక్రమాలు ఏర్పరుచుకుని ఆ దిశ గా పయనించాలే తప్ప ఇంకొకరిని అనుకరించడాలు , అభినయించడాలు చేయకూడదు .
  • ==============================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Hot flashes in women ? , హాట్ ఫ్లాషెస్ అంటే ఏమిటి ?



ప్ర : హాట్ ఫ్లాషెస్ అంటే ఏమిటి ? వాటినుండి బయటపడే మార్గాలు వివరించండి ? (రమాదెవి , గూనపాలెం శ్రీకాకుళం టౌన్)
జ : శరీరం పైభాగం లో లేదా శరీరం అంతటా అకస్మికం గా వేడిరావడాన్ని హాట్ ఫ్లాషెస్ అంటారు . ముఖం , మెడ , చాతీ , వీపు , ముంజేతులు , వేడెక్కినట్లు అనిపిస్తూ చెమటలు పట్టి ... తరువాత చలిగా ఉంటుంది. . ఈ పరిస్థితి కొద్ది సెకన్ల నుంచి , అర గంట దాకా ఉండవచ్చు , లేదా ఇంకా ఎక్కువసేపే ఉండవచ్చును . ఈ హాట్ ఫ్లాషెస్ సాదారణంగా ముట్టులు ( బహి్స్టులు ) ఆగి పోయే వయసులో వస్తాయి . 80 శాతము మహిళలకు 2 యేళ్ళు వరకు కొనసాగితే , కొద్దిమందికి మాత్రము 5 సం.లు పైబడే బాధించవచ్చు .

కారణము : ఈస్ట్రోజెన్ హార్మోను స్థాయి తగ్గుతున్నప్పుడు ఇతర గ్రంధులనుంది సత్సంభందిత హార్మొనులు అధికం గా విడుదల చేస్తుంటాయి . దానిమూలం గా శరీర ఉష్ణొగ్రత హెచ్చు .. తగ్గుల ప్రభావము ఎక్కువకావదం వల్ల ఈ హాట్ ఫ్లాషెస్ పరిస్థితి ఏర్పడుతుంది . ఇది శరీర తత్వము బట్టి వ్యక్తి వ్యక్తికీ తేడాలు ఉంటాయి .

ట్రీట్ మింట్ :
  • హార్మోను రిప్లేస్ మెంట్ థెరపి ,
  • ఆహార పానీయాల విషయములో జాగ్రత్తలు ,
  • జీవన విధానము లొ మార్పులు .
  • వైధ్యుల సహాయం తో మందులు ,


  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

Saturday, February 20, 2010

పాదాల పగుళ్ళు , Foot cracks




ప్ర : నా వయస్సు 32 సం.లు ... పాదాల పగుళ్ళు తగ్గడము లేదు . శీతాకాలం లో మరీ అసహ్యము గా కనిపిస్తున్నాయి . వీటినెలా తగ్గించుకోవాలి ? .

జ : శీతాకాలం లో పగుల్ల బాధ ఎక్కువే .. కొద్దిపాటి ప్రయత్నం తో ఈ సమస్యను సులువుగా నివారించుకోవచ్చును . సాలిసిలిక్ యాసిడ్ గల క్రీము ను (Dipsalic)ను పడుకునే ముందు పాదాలకు రాయండి . రాసినతరువాట క్లింగ్ ఫిలిం లేదా ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టండి ... దీనివల్ల క్రీమ్ దుప్పట్లకు అంటకుండా ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ పాదాలను మృదువుగా ఉంచడమే కాకుండా చర్మం పై మ్రుతకనాల్ని తొలగిస్తుంది .
ఇలా క్రీమ్ 6-7 రోజులు రాశాక గోరు వెచ్చని నీటిలో పాదాల్ని అరగంట ఉంచి ప్యూమిక్ స్టోన్ తో మృదువుగా రుద్దాలి ... రుద్దడం వల్ల మ్రుతకనాలు రాలిపోతాయి . ఇలా కనీసము రెండు మాసాల పాటు చేస్తూ ఉండాలి . పగటి పుట ఏదైనా మాయిస్చరైజర్ క్రీమ్ ను రాస్తూ ఉండాలి . ఇంట్లో సైతము ఒట్టి పాదాలతో నడవకూడదు .. రబ్బరు (హవాయి) చెప్పులు వేసుకోవాలి .


తరచూ కాళ్లపగుళ్లు బాధిస్తున్నాయంటే.. క్యాల్షియం లోపం కావచ్చు. అలాగే జింక్‌, క్యాల్షియం లోపం వల్ల కాలిగోళ్లు కూడా పొడిబారతాయి. కాళ్లపగుళ్లను నివారించేందుకు ఈ రోజుల్లో రకరకాల ఫుట్‌క్రీంలు అందుబాటులో ఉన్నాయి. కాస్త నాణ్యమైనదాన్ని ఎంచుకొంటే సరిపోతుంది. అలాగే రాత్రిళ్లు ఆముదంలో చిటికెడు పసుపు వేసి అరిపాదాలకు రాసి.. బాగా మర్దన చేసుకుని సాక్సులు ధరించినా కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఇంట్లో తిరిగేటప్పుడు పాదరక్షలు తప్పనిసరి. గోళ్ల విషయానికొస్తే.. బాదం, ఆలివ్‌నూనె, ఆముదం.. ఇలా ఓ నూనెను తీసుకుని ప్రతి గోరుపై నిమిషం సేపు మర్దన చేయాలి. రక్తప్రసరణ వేగవంతమై గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే విరిగిపోయిన గోళ్లకు ఎప్పటికప్పుడు తీసేయాలి. లేదంటే.. అవి ఇంకా విరిగిపోతాయి. సాధ్యమైనంతవరకు లేత చాయల్లో ఉండే నాణ్యమైన గోళ్లరంగును ఎంచుకోవడం వల్ల ఎంతో మార్పు ఉంటుంది. ఈ కాలమంతా పాదాలకు మాయిశ్చరైజర్‌ను రాసుకున్నా కూడా ఎంతో మార్పు ఉంటుంది. నెలకు కనీసం రెండుసార్లు పెడిక్యూర్‌ చేయించుకోవడాన్ని ఓ అలవాటుగా పెట్టుకోవాలి. (ఈనాడు వసుందర)
  • ===============================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, February 17, 2010

కాన్పు తర్వాత భార్యాభర్తల సంసారము , Sex after delivary




ప్రసవం తర్వాత శృంగారం విషయంలో భార్యాభర్తలకు అనేక సందేహాలుంటాయి. వాటన్నిటికీ వైద్యనిపుణులు సమాధానం చెబుతున్నారిలా.
* సాధారణ కాన్పు అయిన ఆరు వారాల నుంచి మళ్లీ శృంగారంలో పాల్గొనవచ్చు. సిజేరియన్‌ అయిన మహిళల్లో ఈ సమయం 8 నుంచి 12 వారాలదాకా ఉంటుంది.
* కొందరు మహిళలు అప్పటికి కూడా మానసికంగా శారీరకంగా శృంగారానికి సంసిద్ధమై ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలి. ఇంకొందరిలో ప్రసూతి వైరాగ్యం (పోస్ట్‌నేటల్‌ డిప్రెషన్‌) వల్ల శృంగార కోరికలు అంతగా కలగవు. అలాంటి సమయాల్లో వైద్యుల కౌన్సెలింగ్‌ తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
* గర్భధారణ సమయంలో రకరకాల కారణాల వల్ల మహిళల పొత్తికడుపు కండరాలు చాలావరకూ బలహీనపడతాయి. వైద్యుల సలహాతో పెల్విక్‌ఫ్లోర్‌ ఎక్సర్‌సైజులు చేస్తే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. తద్వారా శృంగారానికి ధీమాగా సమాయత్తం కావొచ్చు.
* ప్రసవానంతరం జరిగే తొలి కలయికలో భర్త చాలా సున్నితంగా ప్రవర్తించాలి. భార్య పొత్తికడుపుపై ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. స్త్రీ పైన పురుషుడు కింద ఉండే భంగిమతో ఈ సమస్యను అధిగమించవచ్చు.




  • =================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS



Monday, January 11, 2010

గర్భిణీ లో రక్తపోటు ఉంటే ఆపరేసన్ , B.P and Caeserian Operation


ప్ర : నేను ఇపుడు ఏడు మాసాల ఇరవై అయిదు రోజుల గర్భవతిని ... రక్తపోటు అధికమైనదని డాక్టర్ చెప్పి , బిడ్డకు రక్త సరఫరా సరిగ్గా అందడం లేదని వెంటనే సిజేరియన్ చేయాలంటున్నారు . నెలలు నిండకుండా బిడ్డ పుడితే జీవించే అవకాశాలు తక్కువంటారు కదా ... మీ సలహా ఏమిటి ? (కమల ... రాయిపాడు)


జ : గర్భధారణ సమయం లో తల్లీ బిద్దలిద్దరకీ హానిచేస్తుంది రక్తపోటు (BP) , ఇలాంటి పరిస్తితుల్లో బిడ్డకు రక్త సరఫరా సరిగా అందనపుడు గర్భం లో బిడ్డ చనిపోయే ప్రమాదము ఉంటుంది . అలాగే రక్త సరఫరా సర్గా లేని కారణం గా ఉమ్మనీరు తగ్గి ... ప్రాణవాయువు అందని పక్షములో పుట్టిన పిల్లలలో బుద్ధిమాన్దవ్యము , ఫైట్స్ లాంటివి వచ్చే అవకాశముంటుంది . అందుకే గర్భాశయం లోని వాతావరణం బిడ్డకు అనుకులించనపుడు .. బయటే సురక్షితం గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపించినప్పుడు వైద్యులు చెప్పిన సిజేరియన్ సరియైన నిర్ణయమని ఆపరేషన్ కి తయారవడం మంచిది . ప్రస్తుత కాలములో ఇంటెన్సివ్ కేర్ , ఇంకుబేటర్లు ఇంకా మరెన్నో సదుపాయాలున్నాయి . నెలతక్కువ బిడ్డలు బ్రతికేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి .
==========================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

నడుము నొప్పి-గర్భాశయం తొలగింపు, Hysterectomy for Back pain


ప్ర : నాకు ఒక ఏడాదిగా విపరీతమైన వెన్ను నొప్పి , నడుము నొప్పి . నెలసరి కుడా ౧౫ -౨౦ రోజుల తేడాలో వస్తోంది . వైట్ డిశ్చార్జి అవుతోంది . ఆర్తోపెడిక్ డాక్టర్ ను సంప్రదిస్తే 'స్లిప్ డిస్క్ ' అన్నారు . అయితే ... ఇది నెలసరి సంబంధ నొప్పి అని ... గర్భసంచి తొలగించుకోవడం వల్ల తగ్గుతుందని స్నేహితులు సూచిస్తున్నారు ... ఇది నిజమేనా .. నా డౌట్ తీర్చగలరు ?



జ : నడుము నొప్పికి అనేక కారణాలు ఉంటాయి . నెలసరి అయ్యేటపుడు కుడా నడుము , కడుపు నొప్పి గా ఉండును కదా . ఎముకలు కీళ్ళు సంభందిత నొప్పి కి ... బిడ్డ సంచి వ్యాదుల వల్ల వచ్చే నడుము నొప్పికి వేరు వేరు గా ట్రీట్ మెంట్ చేయవలసి ఉంటుంది .
ఇక నెలసరి త్వరగా రావడము , వైట్ డిశ్చార్జి వంటివి హార్మోనుల అసమతుల్యం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చును . గర్భ సంచి తొలగించడం వల్ల ఈ బాధలు తగ్గుతాయనుకోవడం కేవలం అపోహ మాత్రమె . కాబట్టి మంచి డాక్టర్ ని సంప్రదించి నడుము నొప్పికి , స్త్రీ సంబందిత కంప్లైంట్స్ కి వేరు వేరు గా చికిత్స చేయించుకోవాలి .
=========================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

ట్యూబ్ రికేనలైజేషన్ సంతానము , Tube Recanalization-Conception


ప్ర : మాకు ఒక బాబు . పిల్లలు వద్దనుకుని త్యుబెక్టమి (Tubectomy) చేయించుకున్నాను . మళ్ళీ పిల్లలుకావాలని రి-కేనలైజేసన్ చేయించుకొని మూడేళ్ళు అయినా పిల్లలు కలగలేదు . ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా?




జ : పిల్లలు కావాలనే ట్యుబాల్ రీకేనలైజేశన్ చేయించుకున్నా వెంటనే గర్భము ధరిస్తారని లేదు . ఎందుకలా అంటే ఈ కింది విషయాలు పరిగణలోకి తీసుకోవాలి .
  • ఒకసారి వేరుచేసి తిరిగి జతచేసిన ట్యూబులు కనీసం 6 - 7 సెంటీ మీటర్లు పొడవు ఉండాలి .
  • జతచేసిన బాగాలు రెండు వైపులా సరిగా అమరాలి .
  • ఇన్ఫెక్షన్ రాకూడదు ,
  • అండోత్పత్తి జరుగుతూ ఉండాలి ,
  • భర్త స్పెర్మ కౌంట్ సరిపడినంత ఉండాలి .
అప్పుడే గర్భము ధరించడానికి 25 నుండి 75 శాతము దాకా అవకాశము ఉంటుంది . గర్భధారణ జరుగుతుందా లేదా అన్నది తెలుసుకునేందుకు లాప్రోస్కోపి , ఎహ్.యస్.జీ. పరీక్షలు ఉపకరిస్తాయి. వీటన్నింటి బట్టే వైద్యులు గర్భం వచ్చే అవకాశం ఉన్నదీ లేనిదీ నిర్ణయిస్తారు . ఒక వేల వాటి పని తీరు సరిగా లేకపోయినా , ట్యూబులు మూసుకు పోయినా టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రయత్నించవచ్చును . మీ డాక్టర్ని సంప్రదించండి .

------------------------

Q : నా వయసు 29. ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం పిల్లలు వద్దనుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. అయితే రెండేళ్ల క్రితం మా పెదబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు చిన్నబాబు లోన్లీగా ఫీలవుతున్నాడు. బాబో, పాపో ఇంకొకరుంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకున్నాను కదా, ఇప్పుడు పిల్లలు పుట్టడానికి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవచ్చా? ఆరోగ్యరీత్యా ఇదేమైనా సమస్యగా మారుతుందా? తెలుపగలరు.
- భవాని, ఇ-మెయిల్

A : స్ర్తీలలో విడుదలయ్యే అండం గర్భసంచి పక్కనే ఉన్న అండాశయం నుంచి నెలకొకటి రిలీజ్ అవుతుంటుంది. ఇది అండాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ప్రయాణించి గర్భసంచికి చేరి అక్కడ ఫలదీకరణం చెందడం వల్ల గర్భం నిర్ధారణ అవుతుంది. కాని ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్‌ఫెక్షన్ వల్ల, మ్యూకస్ వల్ల, ఇతర సమస్యల వల్ల మూసుకుపోతాయి. అలాంటప్పుడు ఇక అండం గర్భసంచికి చేరే మార్గం ఉండదు. దీని వల్ల గర్భం రాదు. సర్జరీ ద్వారా ఒకసారి మూసివేసిన ట్యూబ్‌ని తిరిగి ఓపెన్ చేయడాన్ని రీకెనలైజేషన్ అంటారు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్. ఇది చెయ్యడానికి ముందు మీకు ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయా? పొత్తికడుపుకు సంబంధించిన ఆపరేషన్లు ఏమైనా అయ్యాయా? ఇన్‌ఫెక్షన్లు, టీబీ వంటివి ఏమైనా వచ్చాయా? ట్యూబెక్టమీ ఆపరేషన్ డెలివరీ అయిన వెంటనే చేశారా? లేక కొద్దికాలానికా? అలాగే అది ఓపెన్ సర్జరీనా? లేక లాప్రోస్కోపిక్ సర్జరీనా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో ట్యూబల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ట్యూబ్స్ మళ్లీ అతుక్కుపోవచ్చు. వీటన్నింటికీ మీరు సమ్మతిస్తే అప్పుడు లాప్రోస్కోపీ చేసి ... గర్భసంచి ఎలా ఉంది? ట్యూబ్స్ కండిషన్ ఎలా ఉంది? ట్యూబెక్టమీ అప్పుడు ఎంత ట్యూబ్ కట్ చేశారు? వంటి అంశాలను చెక్ చేస్తారు. వాటన్నింటి తర్వాతే సర్జరీ చేస్తారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ని సంప్రదించి, వారి సలహా పొందండి.


========================================================

visit my website - > Dr.Seshagirirao-MBBS

Wednesday, January 6, 2010

గర్భావతుల్లో యోని ఇంఫెక్సున్ , Pregnancy -vaginal infection


వేజైనల్ ఇన్ఫెక్షన్ ఉందని ఫ్యామిలీ డాక్టర్ యాన్తిబాయోటిక్స్ ఇచ్చారు . మాత్రల వార్నింగ్ లో గర్భిణీ స్త్రీలు వాడకూడదు అని వ్రాసిఉంది . ఏమైనా ప్రమాదమా?



జ : మొదటి మూడు నెలల కాలం లో వీలైనంత వరకు మందుల్ని తీసుకోకుండా ఉండడమే మంచిది . చాలా రకాల మందులు తోలి మూడు నెలల కాలము లో బిడ్డ ఎదుగుదల పై రాభావాన్ని చూపుతాయి . కాబట్టి వాటికి దూరం గా ర్న్డడం మంచిది . వేజినల్ ఇంఫెక్సున్ తగ్గాలంటే పరిస ప్రాంతాల్ని పరిశుబ్రం గా ఉంచుకోండి . మూత్రానికి వెళ్ళిన ప్రతిసారీ సబ్బునీటి తో మీ వ్యక్తిగత ప్రదేశాలను శుభ్రపరచుకోండి .పొడిగా ఉంచుకోవాలి .

కాటన్ దుస్తులు ధరించి , రోజుకు రెండు మూడు సార్లు మార్చుకోండి . వేజినల్ ఇంఫెక్షున్ రాకుండా చూసుకోండి ... వస్తే తగ్గించుకొలనుకున్నా వ్యక్తిగత పరిశుభ్రతకు మించిన మందు లేదు . దాకతర్ సలహా మేరకు మందులు వాడవచ్చును .

===================================================
visit my website -> dr.seshagirirao-MBBS