ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
- ప్ర: నా వయస్సు 29. నేను ఒక గవర్నమెంట్ సంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నాను. నేను చాలా సన్నగా ఉంటాను. గత 3 సంవత్సరాలుగా నా జుట్టు ఒకేచోట గుడ్రముగా రాలిపోతోంది. పైగా తల వెనుక భాగంలో దురదగా కూడా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే పైపూతగా కొన్ని క్రీములు, ఇంజక్షన్లు కూడా ఇచ్చారు. అయినా ఏ మార్పూ లేదు. మరో డాక్టర్‌ను కలిస్తే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనీ, దీనికి మందులే లేవని అన్నారు. ఇప్పటికే చాలా భాగం జుట్టు రాలిపోయి వికారంగా ఉంది. ఇక కొద్ది రోజులలో మొత్తంగా రాలిపోతుందేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలుపుగలరు.
- జ: మీ సమస్యను ఆలోపేసియా అంటారు. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నది వాస్తవమే. దీనికి హోమియోలో చికిత్స ఉంది. పాస్పరస్-200 మందును ఉదయం, సాయంత్రం వారానికి ఒకరోజు చొప్పున వరసగా ఆరు వారాలు వాడండి. ఊడిపోయిన భాగాల్లో చాలా త్వరగా మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రక్తహీనత రాకుండా ఆకుకూరలు తీసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి.
- =================================================
visit my website - >
Dr.Seshagirirao-MBBS