Thursday, January 2, 2014

Intrauterine Insemination(IUI), ఇన్ట్రా యూటేరియన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ)

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  ఇన్ట్రా-యుటెరైన్‌ ఇన్సెమినేషన్ (ఐయూఐ) అంటే ఏమిటి?.
జ : సంతానము కలుగని దంపతులకు సంతానము భాగ్యము పొందేందుకు డాక్టర్లు వాడే పద్దతులలో ''ఇన్ట్రా యూటేరియన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ)'' ఒక విధానము . దీనిలో భర్త ఇంద్రియం (స్పెర్మ్‌) భార్య గర్భాశములో ప్రవేశపెడతారు. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఆడువారి అండాలు (eggs) సంభందించి ఏవిధమైన చికిత్సా ఉండదు ... కావున దీనిని " ఎసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(ART) గా పరిగణించరు.

ఎలా చేస్తారు ?:
ఇన్‌ఫెక్షన్‌ రాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ్ ఒక కెతెటర్ (రబ్బరు లేదా ప్లాస్టిక్ గొట్టం) ద్వారా లేబొరిటరీలో బాగా washed sperms  ను గర్భాశములో ప్రవేశపెడతారు. ఆ విధము గా ఫెలోఫియన్‌ ట్యూబ్  లలోనికి ఎక్కువ సంఖ్య లో పురుష బీజ కణాలు (స్పెర్మ్‌స్ ) వెళ్ళేటట్లు చేసి సంయోగ ప్రక్రియ (ఫెర్టిలైజేషన్‌) అవకాశాలు ఎక్కువయ్యేటట్లు చేస్తారు.

ఐయూఐ ని ఎప్పుడు వాడుతారు? :
1. సరియైన కారణము తెలియని సంతానలేమి ,
2.తక్కువ స్పెరమ్‌ కౌంట్ (పురుష బీజ కణాలు సంఖ్య చాలా తక్కువ ఉన్నపుడు )
3. స్పెర్మ్‌ కదలిక తక్కువగా ఉన్నప్పుడు ,
4.డోనర్ స్పెర్మ్‌ అవసరమైనపుడు ,
5.సెర్వైకల్ మ్యూకస్ చిక్కగా ఉండి ... స్పెర్మ్‌ కదలిక కస్టమైనపుడు ,
6.సెర్విక్ష్ లో స్కార్ (cervical Scar) ఉండి స్పెర్మ్‌ కదలికకు అవరోధము ఉన్నపుడు .
7.పురుషునిలో ఇజాక్యులేషన్‌ సరిగాలేనపుడు ,



*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.