Tuesday, January 14, 2014

do sex desire reduec if uterus removed?,గర్భాశయాన్ని తొలగించివారిలో లైంగిక వాంఛలు తగ్గేనా

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q  : మాకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. కొన్ని కారణాల వల్ల వైద్యులు గర్భాశయాన్ని తొలగించాలి అంటున్నారు. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి రావచ్చు. అదే జరిగితే ఆ ప్రభావం లైంగిక వాంఛలపై పడుతుందా?

- ఓ సోదరి

Ans : గర్భాశయాన్ని తొలగించుకున్న చాలామందిలో లైంగిక జీవితానికి సంబంధించి కొన్ని మార్పులు జరగడం సాధారణం. అయితే లైంగిక వాంఛ కొంతవరకూ తగ్గొచ్చు. జననేంద్రియ భాగాల నుంచి స్రావాల విడుదల తక్కువగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ భాగంలో అసౌకర్యంగా కూడా  అనిపించొచ్చు. గర్భాశయాన్ని తొలగించినప్పుడు జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దాంతోపాటూ శస్త్రచికిత్స జరిగే  సమయంలో లైంగిక పనితీరుకు సంబంధించి నరాలూ, కొన్ని రక్తనాళాలూ కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అయితే గర్భాశయాన్ని  తొలగించుకున్న వారందరికీ ఇలా జరుగుతుందని కాదు. మెనోపాజ్‌ దశకు చేరుకోని వారిలో ఈ శస్త్రచికిత్స తరవాత లైంగిక వాంఛలు ఇంకా  పెరగొచ్చు. గర్భం రాదనే ఆందోళన తగ్గడమే అందుకు కారణం. మెనోపాజ్‌ దశ దాటిన వారిలో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. హార్మోన్ల ప్రభావం  వల్ల మానసికంగానూ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కలిసి లైంగిక వాంఛలు తగ్గేలా చేస్తాయి. ఒకవేళ మీది మెనోపాజ్‌   వయసయితే హార్మోన్లను మాత్రలుగా వాడుకోవచ్చు. దాన్నే హెచ్‌ఆర్‌టీ అంటారు. దాంతో జననేంద్రియ భాగాల్లో స్రావాలు విడుదల కాకపోవడం   లాంటి సమస్యలు తగ్గుతాయి. ఏదేమైనా ఇదేమీ పెద్ద సమస్య కాదు. భయపడాల్సిన అవసరం లేదు.

courtesy with : Dr.sarmila majundar@eenadu vasundara(14-1-2014)



  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.