Friday, January 10, 2014

Some are obese though eating less why?,కొందరు తక్కువ తింటున్నా లావుగా ఎందుకు ఉంటారు ?








ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : కొందరు తక్కువ తింటున్నా లావుగా ఎందుకు ఉంటారు ?

జ : శరీరములో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ఒక ''సెట్ పాయింట్'' నిర్ణయిస్తుంది . దీనిని " సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ " అంటారు. ఉదాహరణకు 70 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 110 కేజీలు ఉంటే ఆ వ్యక్తి శరీరములో అదనముగా 40 కేజీల కొవ్వు ఉన్నట్లు . అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్ పాయింట్ 40 కీజీలు . కొంతమంది తక్కువ తింటున్నా లావుగా ఉంటారు . ఇంకొంతమంది ఎక్కువ తింటున్నా సన్నగా ఉంటారు . దీనికి కారణము లావుగా ఉన్నవారిలో కొవ్వు ''సెట్ పాయింట్ '' ఎక్కువగాను , సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగాను ఉండడమే . అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల  వలన కొవ్వు ' సెట్ పాయింట్ '  పెరుగుతుంది . ఒకసారి పెరిగిన సెట్ పాయింట్ మళ్ళీ తగ్గదు . ఈ సెట్ పాయింట్ ను జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోనులు ( గ్రెలిన్‌, జిఎల్ పి-1) నిర్ణయిస్తాయి. ఈ సెట్ పాయింట్ మన మనస్సు అధీనములో ఉండదు .


*===========================

* visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.