Friday, January 24, 2014

What to do for weight gain?,వెయిట్ పెరిగేందుకు ఏమైన మార్గాలు ఉన్నాయా?.

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నేను చాలా సన్నముగా ఉంటాను . ఎత్తు 5'6'' . ఏబై కిలోల బరువు మాత్రమే ఉన్నాను . వెయిట్ పెరిగేందుకు ఏమైన మార్గాలు ఉన్నాయా?.

జ : ట్రెయినింగ్ ఉంటేనే కండరాల్ని పొందగలరు .అయితే ట్రెయినింగ్ కు సరియైన ఆహారపదార్ధాలనుండి ఎనర్జీ కావాల్సి ఉంటుంది .  కార్బోహైడ్రేట్స్ అధికం గా ఉండె పదార్ధము తినండి . ప్రతిరోజు అదనముగా 500 కాలరీల కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము వలన ప్రతి నెలా సగటున నెలకి ఒక కిలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. టోస్ట్ తో ఒక బౌల్ సెరల్స్ తినండి . మిడ్ మార్నింగ్ స్నాక్స్ గా అరటిపండు , ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి . లంచ్ తో ' చికెన్‌' ,సాయంత్రము యాపిల్ , డిన్నర్ లో రైస్ ... ప్రతిరోజూ తినండి . వీటికి తోడు వ్యాయామము చేస్తూ ఉండాలి.


  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.