Sunday, November 10, 2013

precautious Puberty,ప్రికాషియస్ ప్యుబర్టీ





ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

Q ; నాకు 9 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. చదువులో చురుగ్గా ఉంటాడు.  ఆకారం నార్మల్‌గా ఉండదు. మూడు నెలల నుంచి బాబుకు మీసాలు, గడ్డం రావడం మొదలయింది. ఆరవ తరగతి చదివే బాబుకు ఇంత త్వరగా ఇలాంటి లక్షణాలు రావడం షాక్‌గా ఉంది. వాడు కూడా స్కూల్‌లో నామోషీగా ఫీలవుతున్నాడు. టీచర్లు కూడా డాక్టర్‌కి చూపించమంటున్నారు. మాకు భయంగా ఉంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు.


Ans : మీ అబ్బాయిలోని సమస్యను ప్రికాషియస్ ప్యుబర్టీ (precautious Puberty) అంటారు. నార్మల్‌గా 13-14 సంవత్సరాలలో మెదడులోని హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్రంథికీ, అక్కడి నుంచి జననాంగానికీ హార్మోన్ సంకేతాలు అందుతాయి. ఆ తరువాత 6 నుంచి 10 సంవత్సరాలలో క్రమేపీ మగ లక్షణాలు సంతరించుకుంటారు. మీ అబ్బాయిలో ఈ లక్షణాలు త్వరగా రావడానికి గల కారణాలను అన్వేషించాలి. తలకు సంబంధించిన పుర్రె ఎముకలు సవ్యంగా లేకపోతే మెదడులోని కేంద్రాలు ముందస్తుగా హార్మోన్లను విడుదల చేస్తాయి. వాటిని ఆపడం సాధ్యమే. జి.ఎన్.ఆర్.హెచ్. ఎనలాగ్స్ (బ్యూసెరిలిన్, గోసెలిన్) ఇంజెక్షన్లను తగు మోతాదులో వాడి ముందస్తు యవ్వనాన్ని అయిదారు సంవత్సరాలు వెనక్కి నెట్టవచ్చు.


  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.