Saturday, November 2, 2013

Is hypertension dangerous in pregnancy?,గర్భిణీ స్రీలలో రక్తపోటు ప్రమాదకరమా?






Hypertension in pregnancy .

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

Q : గర్భిణీ స్రీలలో రక్తపోటు ప్రమాదకరమా?
Ans: ఆరోగ్యవంతమైన నడివయసు వారికి 120 సిస్తోలిక్ , 80 డయాస్టోలిక్ ఉంటుంది . పుల్సు ప్రజర్ 4౦ ఉంటుంది . ఈ రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే " అధిక రక్తపోటు(Hypertension) హై ప్రజర్ " గాను , 90/60 కంటే తక్కువైతే " అల్ప రక్తపోటు (Hypotension) లో ప్రజర్ " గాను అంటాము . ఈ రెన్దూ ప్రమాదకరమైనవే .

తల్లీబిడ్డల శ్రేయస్సు దృష్ట్యా గర్భిణులు క్రమం తప్పకుండా.. ఆర్నెల్లు నిండే వరకూ నెలకోసారి, 28 నుంచి 36 వారాల వరకూ రెండు వారాలకోసారి, 36 వారాల తర్వాత కాన్పయ్యే వరకూ వారంవారం గైనకాలజిస్ట్‌ను కలిసి చూపించుకోవాలి. వైద్యుని వద్దకు వెళ్లిన ప్రతి సారీ బరువు, బీపీ రెండూ చూస్తారు. కాళ్ల వాపు ఉందేమో గమనిస్తుంటారు. గర్భిణులకు కాళ్ల వాపు కొంత సహజమేగానీ బీపీ పెరగకుండా కేవలం కాళ్ల వాపు ఉంటే పెద్ద సమస్య కాదు. కాళ్ల కింద ఎత్తుగా దిండుపెట్టుకు పడుకోవటం, కాళ్లు మెలికేసుకుని కూర్చోకుండా ఉండటం అవసరం. అయితే బీపీ పెరుగుతూ, కాళ్ల వాపులూ పెరుగుతుంటే మాత్రం దానిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. ముఖం ఉబ్బరించినా, కళ్ల చుట్టూ వాపు వచ్చినా, చేతులు వాచినా, కాళ్లు చీలమండలు మరీ ఎక్కువగా వాచిపోయినా, ఒక కాలు ఎక్కువగా వాచి నొప్పిగా ఉన్నా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. 

గుర్రపువాతం (ecloumpsia) : గర్భవతుల్లో రక్తపోటు పెరిగి అది నియంత్రణలోకి రాకపోవడం వల్ల అది మెదడుపై ప్రభావం చూపి ఫిట్స్ కారణమవుతుంది. ఈ కండిషన్‌ను ఆక్లాంప్సియా అని అంటారు.ఇది తల్లీ-బిడ్డలకు ఇద్దరికీ చాలా ప్రమాదకరమైనది . దీన్నే వ్యావహారికంగా ‘గుర్రపువాతం’ అని కూడా చెబుతుంటారు. ఈ కండిషన్‌లో తగిన మందులు వాడి అక్లాంప్సియా కండిషన్‌ను నివారించవచ్చు.

అధిక రక్తపోటు ఎవ్వరికైనా అనర్థదాయకమే. మరీ ముఖ్యంగా మహిళలకు రక్తపోటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గర్భిణిగా ఉన్న సమయంలో వారికి రక్తపోటు వస్తే గుండెపోటు త్వరగా వచ్చే ప్రమాదం పొంచివుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణి ప్రశాంతంగా ఉండాలని, బీపీ తెచ్చుకోవటం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనర్థాలు జరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. 32 ఏళ్ల తరువాత గర్భం వచ్చిన మహిళలపై వీరు అధ్యయనం చేశారు. ఈ బీపీ పెరగటం వల్ల రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని వీరి అధ్యయనంలో వెల్లడైంది. గర్భిణి బాధ, కోపం, దుఃఖం వంటి ప్రతికూల భావాలు లేకుండా సుఖంగా, సంతోషంగా ఉండటం వల్ల బిడ్డకి, తల్లికి ఎంతో శ్రేయస్కరం. నీరు గర్భిణులకు మరీ మంచిది. అందుకే వీరు రోజుకు కనీసం 1.5 నుంచి రెండు లీటర్ల నీరు తాగటం కూడా వారికి ఎంతో మంచిది.

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.