Sunday, November 10, 2013

What is pre-mature menopause?,ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే ఏమిటి?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

Q : ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే ఏమిటి?

Ans : నలబై సంవత్సర్రలకంటే ముందే ఋతుక్రమము ఆగిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు . చిన్న వయసూలో ఇది రావడము వలన ఈస్ట్రోజెన్‌ లేమి హాట్ ప్లషెస్ , భావోద్రేక సమస్యలు , వెజైనల్ డ్రైనెస్ , దాంపత్యము పట్ల ఆసక్తి లోపించడము , వంటి సమస్యలు ఉంటాయి . ఈస్ట్రోజెన్‌ లేమివలన చర్మము  ముడతలు పడుతుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీనినే Early menopausal syndrome  అంటారు. హార్మోన్‌ రీప్లేస్మెంట్ ధెరఫీ వలన ఈ సమస్యలన్నింటినీ అధిగమించవచ్చును. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వల్ల అండోతపత్తి ఉండదు కాబట్టి డోనర్ ఎగ్ లేకుండా సంతాన అవకాశాలు ఉండవు .

కారణాలు :
రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత ఓవరీలపై దాడిచేయడము వలన రావచ్చును - దీనినే " ఆటోఇమ్యూన్‌ డిజార్డర్ " అంటారు . దీనివలం ఓవరీల పనితీరు ఆగిపోతుంది.
వంశ పారంపర్యము గా ఇలా రావచ్చును .
క్రోమోజోముల లోపాలు ఉండడము వలన కూడా రావచ్చును ,
కొంతమందిలో ఏకారనమూ తెలియకపోవచ్చు (idiopathic pre-menopause) ,

ఇటువంటి వారు కనీసము 45 సం.లు వరకూ హార్మోన్‌ రీప్లేష్ మెంట్ థెరఫీ తీసుకోవడము మంచిది.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.