Saturday, November 2, 2013

Is morning exercise better than evening?ఉదయం వేళ వ్యాయామం మేలు అంటారు నిజమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .




Q : Is morning exercise better than evening?ఉదయం వేళ వ్యాయామం మేలు అంటారు నిజమేనా?

Ans : పూర్వకాలం నుంచి పనులు ప్రాత:కాలంలోనే మొదలుపెట్టి ఎండముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వాటిని సూర్యోదయం కాక ముందునుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట, త్వరగా చెమటపట్టడం పెరుగుతుంది. ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. న్యూరోట్రాన్స్‌ మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్‌ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది. ఇక ఉదయపు సూర్యకాంతి విటమిన్‌-డి ఉత్పాదనకు తోడ్పడుతుంది. ఆ వేళలో ప్రసరించే అల్ట్రా వయులెట్‌ కిరణాలు ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని అరికడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మంచిది.
అయితే వ్యాయామము రోజులో ఏ సమయములో చేసినా మంచిదే. దానికున్న లాభాలన్నీ అలానే ఉంటాయి. 

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.