Monday, November 11, 2013

Is congenital Hydrocoel dangerous?,కంజెనిటల్ హైడ్రోసిల్ ప్రమాదకరమా?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : బాబు వయసు 2 సంవత్సరాలు. ఆరోగ్యంగానే ఉంటాడు కానీ ఎడమ వృషణం, దాని సంచి పెద్దవిగా ఉంటాయి. ఏడ్చినపుడు మరింత పెద్దదిగా కనిపిస్తోంది. నిద్రపోతున్నపుడు నార్మల్‌గానే అనిపిస్తోంది. మూత్ర విసర్జనలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పుట్టుకతోనే ఉందేమోనని నా అనుమానం. మా బాబు సమస్య ఏమిటి? పరిష్కారం సూచించగలరు?

A : మీ అబ్బాయిలో ''కంజెనిటల్ హైడ్రోసిల్'' ఉందని అనిపిస్తోంది. పొట్టలో ఉండే పెరిటోనియల్ పొరలు వృషణాల చుట్టూ అమరికగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ పుట్టేటప్పటికే మూసుకుపోయి రెండూ వేర్వేరు కంపార్ట్‌మెంట్స్‌గా ఉంటాయి. ఒకవేళ ఈ కనక్షన్ మూసుకోకపోతే పొట్టలోని పెరిటోనియల్ ద్రవం, పేగులు గజ్జలగుండా వృషణాల వద్దకు చేరుతాయి. దీనిని నిర్ధారించిన తర్వాత సర్జరీ ద్వారా ఆ భాగాన్ని రిపేర్ చేస్తాం. తిరిగి రావడము(recurrence) సర్జరీ తరువాత అరుదు. ఎంత త్వరగా సర్జరీ చేయిస్తే అంత మంచిది.

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.