Tuesday, November 19, 2013

Causes for teeth gap in children,పిల్లలకు పళ్ళమధ్య ఎక్కువ గ్యాప్ ఉండడము దేనివల్ల?



  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలకు పళ్ళమధ్య ఎక్కువ గ్యాప్ ఉండడము క్యాల్సియం లోపము వల్ల వస్తుందా?.

జ : ఎంతమాతమూ కాదు . పళ్ళ మధ్య సందులనేవి కాల్సియం లోపము వలన వచ్చేవి కావు ... ఇతత కారణాలు ఎన్నో ఉంటాయి.ఈ కండిషన్‌ ని డైఆస్టిమాస్ (Diastemas)అంటారు.

  • వారసతము కావచ్చు ,
  • నోటి పరిశుభ్రత పాటించకపోవడము కావచ్చు ,
  • చిన్న పిల్లలలో దౌడ పెరగడము వలన ... పాలపళ్ళు సైజు అదేసైజు లో ఉండిపోవడము కావచ్చు .
  • కొన్ని రకాల గమ్‌ వ్యాధుల వలన కావచ్చు ,
  • అదేపనినా నాలుకతో పళ్ళను ముందుకు తోయడము ... ఒక మానసిన అలవాటు కావచ్చు,
  • కొన్ని దౌడ , గమ్‌ క్యాన్సర్ లు అరుదుగా కుడా గ్యాప్ కి కారణము కావచ్చు .

గాప్ ఉంటే దంత వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి . 7 ఏళ్ల లోపే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 


  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.