Saturday, November 2, 2013

ఆహారము తీసుకోవడము లో ఏదైనా పద్దతి ఉంటుందా?.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
  •  

  •  image : Courtesy with Surya Telugu news paper
 ప : ఆహారము తీసుకోవడము లో ఏదైనా పద్దతి ఉంటుందా?.

జ : ఆహారం తీసుకోవడానికీ ఓ పద్ధతుంది---ఆహారాన్ని పద్ధతి ప్రకారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు.

* 4 గంటలకు ఒకసారి ఏదైనా ఆహారం తీసుకుంటూ ఉండాలి,
* తినే ప్రతిసారీ కడుపు నిండా తినేయకూడదు,
* ఒకసారి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బాగా జీర్ణమయ్యాకే తరువాతి వేళకు ఆహారం తీసుకోవాలి.
* ప్రోటీన్‌, ఫైబర్‌ మరియు ఫాట్‌తో కూడిన ఆహారాన్ని కూడా తీసుకుంటూ వుండాలి.
* ఉప్పు అధికంగా తీసుకోకూడదు. కొవ్వుతో నిండిన ఆహారాన్ని తీసుకునేలా చేసేది ఉప్పే కాబట్టి.
* కార్బోహైడ్రేడ్లు అధికంగా గల అన్నాన్ని మితంగా తీసుకోవడం మంచిది.
* తాజా కూరగాయల్ని మీ ఆహారంలో మూడుపూటలా తీసుకోండి.
* పండ్లను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. కానీ నాలుగైదు పండ్లను ఒకసారి తినేయడం మంచిది కాదు.
* ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు తీసుకున్న 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవచ్చు.


===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.