Saturday, November 23, 2013

Why do we get spine problems?,వెన్ను సమస్యలు ఎందుకొస్తున్నాయి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : వెన్ను సమస్యలు ఎందుకొస్తున్నాయి?

జ : నడుము కిందభాగం నొప్పితో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది బాధపడుతున్నారని ‘గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ 2010’ ద్వారా తెలుస్తోంది. పనిచేస్తున్న అమెరికన్స్‌లో సగం మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లే వ్యాధుల్లో రెండోస్థానం బాక్‌పెయినే. చాలా వెన్ను నొప్పులు మెకానికల్‌ కారణాలవల్ల వస్తున్నాయి. మన భంగిమల్ని సరిగ్గా ఉండేట్లు చూసుకోకపోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లాంటివి కారణాలు. ఇవి కాకుండా ఆర్థరైటిస్‌, ఇన్‌ఫెక్షన్స్‌, ఫ్రాక్చర్లు, క్యాన్సర్‌ లాంటి వాటివల్లా తీవ్ర వెన్ను నొప్పి వస్తోంది. అమెరికాలో ఈ వెన్ను సమస్యల నివారణకి ఏటా యాభై బిలియన్స్‌ డాలర్స్‌ ఖర్చుపెడుతున్నట్లు ఓ అంచనా.

ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే 37 శాతం మందిలో బ్యాక్‌పెయిన్‌తో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ఇది ఆడవాళ్ళల్లో కన్నా మగవాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే నడుముని సరైన భంగిమల్లో కదలించకుండా చేసే పనులు చేయటమే కాకుండా బరువుల్ని ఎత్తుతుంటారు. అందుకని ఈ ఇబ్బందులు మగవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఈ మధ్య హైదరాబాద్‌లో కూర్చొని పనిచేసే వాళ్ళల్లో నడుమ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. కాల్‌సెంటర్లు, కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేవాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అందుకనే తిన్నగా కూర్చోవడం, వంగడం అందరూ అలవాటు చేసుకోవాలి . కూర్చున్నప్పుడు కాని నిల్చున్నప్పుడు కాని భంగిమలు సరిగ్గా ఉండాలి,  అనేది ముఖ్యం. ఇది అందరూ తెలుసుకోవాలి.


*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.