Saturday, November 23, 2013

What food care should Diabetics observe?,షుగరు వ్యాధి ఉన్న వారు ఆహారం విషయములో జాగ్రత్తలేమిటి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : షుగరు వ్యాధి ఉన్న వారు ఆహారం విషయములో జాగ్రత్తలేమిటి ?

జ : షుగరు వ్యాధి ఉన్నవాళ్లు తీపి మానెయ్యడం కాదు, పసుపు, మెంతులు, నేరేడు, వాము, మెంతికూర, దొండకాయ, కాకరకాయ, ములక్కాడ, దోసకాయ , చిక్కుడు వంటివి తినాలి. సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకోండి. అన్నం కన్నాకూరలు ఎక్కువ తినడం మంచిది. ఉపవాసాలు చేయకండి.

పెద్దవారిలో ముఖ్యంగా గొంతుకలో మింగడం కష్టమవుతుంది. దీన్ని డిస్‌ప్రాజియా అంటారు. వాళ్లు మెత్తని ఆహారాన్ని పల్చగా చేసుకుని తినాలి. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు కొద్దికొద్ది ఆహారాన్ని రోజుకు 4 సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. అన్నం తింటూ కాకుండా అన్నంతిన్నాక నీళ్ళు తాగండి. లేదా రసాలు, మజ్జిగతీసుకోండి. మీరు చిక్కిపోతున్నారనుకోండి. అన్నానికి అన్నానికి మధ్య సుగర్ లెస్ బిస్కెట్లు, పాలుతీసుకోండి. వీరికి పెరుగు మంచిది. ముల్లంగిదుంపలు, ఆకుకూరలు కూడా తినాలి. వారానికి కనీసం మూడుసార్లు మినపగారి తినడం మంచిది. మలబద్దకం ఉన్నవాళ్ళు అన్నంలో చారు (రసం) పోసు కోవడం మానకూడదు. నువ్వుల నూనెతో ప్రతివారం ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేయడం, రాత్రి  పరుండేముందు అరికాళ్ళకి నువ్వుల నూనె మర్దన చేసుకోవడం మనస్సుకి శరీరానికి ప్రశాంతతనిస్తాయి.

 ఏ విధమైన పండ్లూ ఎక్కువగా తినకూడదు. పండ్లలో 50% సుక్రోజ్ ,50% ఫ్రక్టోజ్ ఉంటుంది . సూక్రోజ్ మధుమేహవ్యాధికి శతృవు . నిమ్మ జాతి పండ్దలలో సూక్రోజ్ తక్కువగా ఉంటుంది కావున ఇవి తినవచ్చును. అరటి , జామ , సపోట , యాపిల్ , సీతాఫలం వంటి అధిక సూక్రోజ్ ఉన్న పండ్లు తినకూడదు. నీరు అధీకముగా ఉన్న గరుబుచ్చకాయను మితముగా తినవచ్చును .

ఏది ఏమైనా తిన్న ఆహారములో కేలరీలు తక్కువగా ఉండాలి. తక్కువ తక్కువ గా ఎక్కువసార్లు తినాలి. . . అలాగని కడుపునిండా తినకూడదు .

 *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.