Sunday, November 10, 2013

Do we spend normal life after bypass surgery?,బైపాస్ సర్జరీ అయిన తరువాత మామూలుగానే ఉండవచ్చా?


  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .!



Q : -నాకు రెండేళ్ల క్రితం బైపాస్ సర్జరీ అయింది. ఇప్పుడు నేను మామూలుగానే ఉండవచ్చా? ఇంకా మందులు వాడుతూ జాగ్రత్తగానే ఉండాలా?

A : -సర్జరీ అయిన తరువాత చాలామంది పేషెంట్లు నిర్లక్ష్యం చేసేది మందులను టైమ్ ప్రకారం వాడరు. ఇక తగ్గిపోయింది కదా అని అంతగా శ్రద్ధ పెట్టరు. కానీ ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం తప్పనిసరిగా మీ డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. దానివల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. తద్వారా ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది రావచ్చు. మీరు షుగర్ పేషెంట్ అయితే డాక్టర్‌తో మాట్లాడి మందుల డోస్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ పడిపోకుండా చూసుకోవాలి. లేకపోతే గుండెకు మళ్లీ సమస్య అవుతుంది.

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.