Sunday, November 10, 2013

Male infertility,మగవారిలో సంతానలేమి

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *


ప్ర :
నాకు 28 సంవత్సరాలు. పెళ్లయ్యి మూడేళ్లు అయింది. ఇంతవరకూ పిల్లలు లేరు. నాలో వీర్యకణాల సంఖ్య 40 మిలియన్/మిల్లీలీటర్ ఉన్నాయి. కానీ అన్నీ చలనం లేనివని తేలింది. టెస్టిస్ స్కాన్ చేసి వేరికోసిల్ లేదని తేల్చారు. కానీ యాంటీ స్పెర్మ్ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయని రక్తపరీక్షలో వచ్చింది. నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు ఎడమ టెస్టిస్‌కి క్రికెట్ బాల్ తగిలి గాయం అయింది. అప్పుడు ఆపరేషన్ చేశారు. నాకు ఎటువంటి అనైతిక సంబంధాలూ లేవు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.


జవాబు  : సాధారణంగా మన పుట్టుకతో శరీరంలో ఏమేమి కణాలున్నాయో వాటిని మాత్రమే తనవిగా భావిస్తుంది మన శరీరం. టెస్టిస్ లోని సెమినిఫెరస్ ట్యూబ్యుల్స్‌లో వీర్యకణాలు యవ్వనదశలో తయారవుతాయి. ఇవి పుట్టుకతోనే ఉండవు కాబట్టి వీటిని తన శరీరానికి సంబంధించని ఫారిన్ బాడీగా భావించే అవకాశం ఉంటుంది. తద్వారా మన శరీరమే మన కణాలపై దాడిచేయవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితిని నివారించడానికి వీర్యకణాలను తయారుచేసే సెమినిఫెరస్ యూనిట్ల చుట్టూ ‘సెర్టోలీసెల్స్’ అనే కణాల ద్వారా ఒక అడ్డుగోడ నిర్మితమవుతుంది. మీకు అయిన గాయం వల్ల ఈ టెస్టిస్ బ్యారియర్ పొర డ్యామేజి అయివుంటుంది. అందువల్ల వీర్యకణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారవుతున్నాయి. స్టెరాయిడ్ మాత్రలు, ఇంజక్షన్లు, స్పెర్మ్‌వాష్ టెక్నిక్ ద్వారా దీనికి చికిత్స సాధ్యమవుతుంది.


  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.