Tuesday, November 5, 2013

Do fertility capacity lessen as age advance?,వయసు పెరిగే కొద్దీ స్త్రీసంతాన అవకాశాలు తగ్గిపోతాయా?.




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : వయసు పెరిగే కొద్దీ సంతాన అవకాశాలు తగ్గిపోతాయా?.

జ : అవును తగ్గిపోతాయి. సాధారణంగా పెళ్లయి ఏడాది గడిచినా సంతానం కలగకపోతే సంతానలేమి సమస్య ఉందన్నమాట. 35 ఏళ్లు దాటినవాళ్లయితే ఆరు నెలల్లోగా సంతానం కలగకపోతే సమస్య ఉన్నట్టే. వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వయసు పెరిగిన కొద్దీ ఓవరీలకు అండాలను తయారుచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. విడుదలయ్యే అండాలు కూడా అంత ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. వాస్తవానికి 20-25 ఏళ్ల మధ్య స్త్రీలలో సంతానావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 30లలో క్రమేపీ సన్నగిల్లుతూ, 35 ఏళ్ల తర్వాత మరింతగా తగ్గిపోతాయి. కానీ ఉద్యోగ బాధ్యతలు, లేటు వయసు పెళ్లిళ్ల వంటి వాటి వల్ల నేడు ఎంతో మంది స్త్రీలు వయసు మీరే వరకూ సంతానాన్ని కోరుకోవటం లేదు. దీనివల్ల కూడా సంతాన రాహిత్యం పెరుగుతోంది. స్త్రీకి 32 ఏళ్లు దాటాక అండాశయం సామర్థ్యం ప్రతి ఏడాదికి తగ్గతూ పోతుంది.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.