Wednesday, January 9, 2013

Whitening(graying) of hair - నా జుట్టు నెరుస్తుంది (తెల్లబడుతుంది) ఏమిచెయ్యాలి?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

1. ప్ర ; నేను 20-25 సం. మధ్యలో ఉన్నా ఇప్పుడే నా జుట్టు నెరుస్తుంది (తెల్లబడుతుంది) తెల్లబడకుండా ఉండాలంటే ఏమిచెయ్యాలి?

జ : వెంటుకల ఎదుగుదల దశలో మెలనిన్‌ సింథసిస్ తో జుట్టు కుదుళ్ళ పిగ్మెంటేషన్‌ అనుసంధానమై ఉంటుంది. మనము 40 లోకి వచ్చేదాకా పిగ్మెంట్స్ రీసైక్లింగ్ ప్రభావవంతము గా ఉంటుంది. వారసత్వ లక్షణాలు, హైపర్ / హైపో థైరాయిడ్ వంటి  ఆటో ఇమ్యూన్‌ పరిస్థితులు జుట్టు త్వరితము గా తెల్లబడడానికి దారితీస్తాయి.  దెర్మటాలజిస్ట్ ను సంప్రదించిన తర్వాత ' కాల్సియంపెంటొథెనేట్  " ఓరల సప్లిమెంటేషన్‌ ద్వారా కొంత ప్రయోజనం ఉంటుంది. తెల్లజుట్టును పీకవద్దు . మరీ ఎక్కువగా ఉంటే వెజిటబుల్ , మెటాలిక్ డైయిలు వాడండి . ఒక సారి వచ్చేసిన తెల్ల వెంట్రుకల్ని ఏం చేయలేము ... ఇకపై రాకుండా లేదా వేగం తగ్గించడానికి మాత్రమే చర్యలు తీసుకోగలము .

జుట్టు నెరుస్తోంటే.. చికిత్సలున్నాయా?

  2. ప్ర  :  నా వయసు ముప్ఫైలోపే. కానీ ఇప్పుడే జుట్టు నెరవడం మొదలైంది. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నా జుట్టు మళ్లీ నల్లగా అవుతుందా లేక రంగు వేసుకోవాల్సిందేనా? మునుపటిలా నల్లగా అయ్యేందుకు సహజపద్ధతులు ఏవైనా పాటించొచ్చా. ఈ మధ్య వెజిటబుల్‌ డైల గురించి విన్నా. అవి ఎక్కడ దొరుకుతాయి. వాటిని వాడటం వల్ల సమస్యలేమైనా ఉంటాయా?
  

A : జుట్టు తెల్లగా అవుతోందనగానే ఏదో రంగు వేసుకోవడం ఆ సమస్యకు పరిష్కారం కాదు. ముందు దానికి అసలైన కారణం తెలుసుకోవాలి. సాధారణంగా విటమిన్‌ బి12 లోపం వల్ల ఇలా కావచ్చు. అలాగే గాఢత ఎక్కువగా ఉన్న షాంపూలు.. అంటే చాలా షాంపూల్లో పీహెచ్‌ 13, 14 అంతకన్నా ఎక్కువగా ఉన్నవి వాడినప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు నెరుస్తుంది. నేరుగా తగిలే ఎండా, ఐఫోన్లూ, కంప్యూటర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్లా, జన్యుపరంగా, బొల్లి లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా జుట్టు త్వరగా రంగు మారుతుంది.

చిన్న వయసులోనే ఈ సమస్య వస్తే గనుక దాన్ని నివారించేందుకు ప్రత్యేకమైన క్యాల్షియం పాంటోథినేట్‌ మాత్రలు ఉంటాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడాలి. అలాగే మరికొన్ని హెయిర్‌జెల్స్‌ ఉంటాయి. వాటిని గనుక వాడుతుంటే కొన్నినెలలకు జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది. అయితే సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. లేదంటే తలకు రంగు వేసుకోవడమే పరిష్కారం అవుతుంది. అవి కూడా ఏవి పడితే అవి కాకుండా అమోనియా, పీపీడీ లేని రంగుల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి కొందరికి పడకపోవచ్చు కూడా! అందుకే ఈ రెండు లేని ప్లాంట్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ వెజిటబుల్‌ డైలని ఎంచుకుంటే మంచిది. ఇవి మందుల దుకాణాల్లో దొరుకుతాయి. అవి శాశ్వత రంగులే కానీ వాటిని జీవితాంతం తగిన జాగ్రత్తలతో వాడాల్సి ఉంటుంది.

అంతకన్నా ముందు మీరు వైద్యుల సలహా తీసుకుంటే మీ సమస్యకు అసలైన కారణం తెలుస్తుంది. సమస్యను బట్టి ఏ మందులు వాడాలనేది వాళ్లే సూచిస్తారు.
  •  ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.