Saturday, January 26, 2013

Young Children behave differently?, చిన్న వయస్సు పిల్లల్లో చిరాకు పరాకులు ఎందుకు కనిపిస్తాయి ?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : చిన్న వయస్సు పిల్లల్లో చిరాకు పరాకులు ఎందుకు కనిపిస్తాయి ? వీటిని ఎలా ఎదుర్కొనాలి ?

జ : పిల్లల్లో అవగాహన పెరిగి కొంచెం ఎదిగేకొద్దీ కోపం , అసహనం , పెంకితనం  ప్రదర్శిస్తుంటారు . తనలోని స్వతంత్ర ధోరణిని , తన అభిప్రాయాన్ని పరిగణించాలన్న దృక్పధాన్ని వ్యక్తం చేసే తొలి ప్రయత్నాల్లో భాగం ఇవి . పిల్లలకు రెండు మూడేళ్ళు దాటాక ఈ ధోరణి పెరుగు తుంటుంది. అందరూ ఒకేమాదిరి ఉండాలని కూడా ఏం లేదు .

పిల్లల టెంపర్మెంట్ ను బట్టి వారి ధోరణి మారుతుంటుంది . వారి నోటివెంట " నో ' అనే వ్యతిరేక పదం ఎక్కువ సందర్భాలలో వినబడుతుంది. ఆకలి , అలసట , నిద్ర , తమను పట్టించుకోవడం లేదన్న భావం ఎక్కువగా ఉన్నప్పుడు వారిలో ఈ ధోరణి మరింత గా బయటపడుతుంటుంది. కొందరు మరీ సున్నితము గా ఉంటారు.  మార్పును సులువు గా జీర్ణించుకోలేరు . ఇటువంటి వారిని జాగ్రత్త గా టాకిల్ చేయాలి . వారు వ్యతిరేక పంధాలో ఉన్నప్పుడు పెద్దలూ అదే మొండివైకరి ప్రదర్శిస్తే లాభం ఉండదు. బుజ్జగింపు అవసరమవుతుంది.  ఒక్కోక్క సారి విపరీతంగా ప్రవర్తించినప్పుడు ... వారేదైనా ఒత్తిడికి గురి అవుతున్నారేమో గమనించాలి.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.