Monday, May 14, 2012

What are the Ways to Get Rid Baby Gas? ,బేబీ లోఅపానవాయువు అరికట్టడమెలా?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : బేబీ లోఅపానవాయువు అరికట్టడమెలా?

A : బిడ్డ పుట్టింది కొత్తగానే అయినా వారికికూడా ఆరోగ్య సమస్యలుంటాయి. మీరు తల్లిపాలు పడుతున్నప్పటికి కొన్నిసార్లు మీ బేబీ పొట్టలో గ్యాస్ లేదా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడుతూంటుంది. దీనికి కారణం బేబీ జీర్ణ వ్యవస్ధ ఇంకా అభివృధ్ధి చెందుతూంటుంది. అయితే, బేబీలో కలిగే ఈ Gas అనారోగ్య సమస్యకు కొన్ని చిట్కాలు చూడండి.

వీపు తట్టండి - పాలు తాగిన ప్రతిసారి, బేబీని మీ చేతుల్లోకి తీసుకొని మెల్లగా వీపుపై తట్టండి. బేబీ త్రేన్చే వరకు ఒకటి నుండి రెండు నిమిషాలు ఈ పని చేయండి. ఈ త్రేన్పులు బేబీకి గ్యాస్ కలిగించకుండా చేస్తాయి.

బేబీ పొట్ట నిమరండి - గ్యాస్ పోగొట్టటానికి బేబీ పొట్టను మెల్లగా రుద్దండి. బేబీని వీపుపై పడుకో పెట్టండి. పొట్ట వేళ్ళతో సున్నితంగా రుద్దండి. గ్యాస్ జీర్ణ వ్యవస్ధగుండా బయటకు వస్తుంది.

వేడి నీరు - బేబీ కనుక బాగా గ్యాస్ తో బాధపడుతూంటే, గోరు వెచ్చటి నీరు పట్టండి. బేబీ గొంతు సున్నితం వేడి ఎక్కువ ఉండరాదు. బేబీని వేడినీటిలో స్నానం కూడా చేయించవచ్చు. ఆ వేడికి గ్యాస్ తగ్గే అవకాశం వుంది.

పోత పాలు - బేబీకి కనుక బాటిల్ పాలువంటివి ఇస్తుంటే వాటిని ఆపండి.దీనివలన కూడా గ్యాస్ వచ్చే అవకాశం వుంది.

వ్యాయామం - బేబీని వీపుపై పడుకోబెట్టి మెలలగా కాళ్ళు, చేతులు ఆడించండి. బేబీ కాళ్ళతో పైకి కిందకు సైకిల్ తొక్కుతున్నట్లు చేయండి. ఇది బేబీ పొట్టలో కండరాలను సడలించి గ్యాస్ బయటకు వచ్చేలా చేస్తుంది.

బేబీతో ఆడండి. కూర్చో పెట్టి ఆడించండి. ఇది బేబీ శారీరక కదలికలను పెంచుతుంది. గ్యాస్ త్రేన్పు లేదా అపానవాయువుల ద్వారా బయటకు వచ్చేస్తుంది. బేబీ నోటిద్వారా గాలి పీల్చకుండా కూడా చూడండి.

  • ==========================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.