Sunday, May 20, 2012

Waxing for hair, అవాంచిత రోమాలు,unwanted hairs



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మా అమ్మాయికి మొహం నిండా వెట్రుకలు చూసి పెళ్ళి సంబంధాలు తప్పిపోతున్నాయి. అవాంచిత రోమాలు ఎలా తీసివేయాలో తెలియజేయగలరు ?


జ : కొంత మందిలో అవాంఛితరోమాలు, కాళ్లు, చేతులపై విపరీతంగా వచ్చి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. అవాంఛితి రోమాల సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోంది. అందుకోసం రకరకాల కృత్రిమ పద్దతులతో ఎటువంటి మార్పు లేనందున వారిలో చిరాకు మొదలవుతుంది. అలాంటప్పుడు త్రెడింగ్, షేవింగ్ లాంటి పద్ధతుల కన్నా.. వ్యాక్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం. వ్యాక్సింగ్ కొందరికి పడకపోవచ్చు. కొన్ని సార్లు సరిగ్గా చేయకపోతే చర్మంపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు వస్తాయి. ఇక చేతులు, భుజాల దగ్గర బ్యాక్టీరియా ఉంటే ఇన్ ఫెక్షన్ కు కారణమై మచ్చలకు దారితీస్తుంది. కొందరిలో అవి త్వరగా తగ్గితే..మరికొందరిలో చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి వాక్సింగ్ చేసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...

దీన్ని తరచూ చేయించుకోవడం వల్ల అవాంచిత రోమాలు బలహినమై వాటి ఎదుగుదల క్రమంగా తగ్గిపోతుంది. వ్యాక్సింగ్ అలవాటు పడితే ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

  • 1. వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి. వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.
  • 2. వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకొని యాంటీబయోటిక్స్ కూడా వాడాలి. యాంటిబయోటిక్ క్రీంను వారం రోజులు ముందు వాడాలి. తరవాత మరో రెండుమూడు రోజులు రాసుకుంటే అలర్జీ, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
  • 3. బహుమూలాల్లో చేస్తున్నప్పుడు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి ఐదునిమిషాల అనంతరం వ్యాక్సింగ్ చేసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది. ముఖానికి వ్యాక్సింగ్ చేసుకుంటున్నప్పుడూ రెండు మూడు అంగుళాల మేర వేసి..ఆ భాగం సాగకుండా బొటనవేలు, చూపుడు వేలితో గట్టిగా నొక్కిపట్టుకుని వ్యాక్స్ పట్టీతో తొలగించాలి. అప్పుడు చర్మం కందిపోకుండా.. దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో రకరకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో...
  • 1. పాట్‌వ్యాక్స్ : ఇవి చిన్నచిన్న పాత్రల్లో వస్తాయి. పై పెదవి, ముఖంపైన ఉన్న అవాంఛిత రోమాల్నితొలగించేందుకు ఇవి సరైన ఎంపిక. కానీ దీనివల్ల చాలా త్వరగా అంటే మూడో రోజుకే మళ్లీ సమస్య మొదలవుతుంది.
  • 2. హాట్ వ్యాక్స్: ఈ రోజుల్లో చాలామంది దీన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అవాంఛిత రోమాల్ని సులువుగా తొలగిస్తుంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో వేసుకోవాలి.
  • 3 కోల్డ్ వ్యాక్స్: దీన్ని పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి. సరిగ్గా తొలగించలేకపోతే.. చర్మం పైపొర కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.
  • కొంత మంది స్త్రీలలో ముఖంపైన ఎక్కువగా అవాంచిత రోమాలు కన్పిస్తుంటాయి. ముఖంపైనే కాకుంటా చేతులు, కాళ్లు, మెడ తదితర భాగాలలో కూడా ఎక్కువగా కన్పిస్తాయి. ఈ అవాంచిత రోమాలతో బాధపడే స్త్రీలు దానికి తగిన పరిష్కారం చేసుకోండిలా...
  • * పసుపు కొమ్ముని బాగా గ్రైండ్ చేసి రాత్రిపూట ముఖంపైన పూతలా వేసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకునట్లైతే అవాంచిత రోమాలు మాయమైపోతాయి.
  • * బొప్పాయి కాయని, పసుపుని కలిపి గ్రైండ్ చేసి ముఖంపైన రుద్దినట్లైతే అవాంచిత రోమాలు తొలగిపోతాయి.
  • * కస్తూరి పసుపుని, జున్నుని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి వాడుతూవచ్చినట్లైతే కూడా ముఖంపైన ఉన్న రోమాలను తగ్గించవచ్చును.
  • * కందుల పైతోలు, ఆవు పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖంపైన అప్లైచేసి ఆరిన తరువాత శుభ్రపరచినట్లైతే అవాంచిత రోమాలు ఇట్టే మాయమైపోతాయి.
  • * కొంతమంది స్త్రీలలో కాళ్లు, చేతులపై ఉండకూడనిచోట వెంట్రుకలు పెరుగుతాయి. ఇటువంటివారు హరి దళం మోదుగ పుల్లలు కాల్చిన బూడిదను సమభాగాలుగా తీసుకుని అరటి దుంప రసంతో మర్దన చేసి పైన రాస్తూంటే వెంట్రుకలు ఊడిపోయి తిరిగి పుట్టవు.--మూలము : వెబ్ దునియా
  • * కురసాని వామును చూర్ణం చేసి + నువ్వుల నూనె ను కలిపి శరీరము పై వ్రాస్తూ ఉంటే అవాంచిత రోమాలు పోతాయి.--మూలము : ఏచూరి
  • * జమ్మి ఆకు రసం పూస్తూ ఉంటే అవాంచిత రోమాలు పోతాయి.--మూలము: ఏచూరి.
WAXING


salons we offer two different types of wax treatments to clients, hot wax and strip wax. The type you choose will depend on your preference, the area you are having waxed and how it suits your skin. therapists will be discuss the options available to help you choose the most suitable for you.

HOT WAX:

This wax consists of beeswax and resin and is melted to a thicker consistency than warm wax. Applied to the skin with a wooden spatula, it coats the hair with a thick layer and hardens around the hair to grip it tightly. Once dry, the wax is flipped up at the corner and pulled off quickly by the therapist. Many people find hot wax less painful than strip wax as the heat allows the pores to open so hair is removed more easily and it is the less sticky option more able to remove shorter hair than warm, strip wax.

STRIP(WARM) WAX:

This is the most popular method of waxing. It consists of resin, paraffin wax, glucose syrup and honey. Warm wax is smoothed onto the skin in a thin layer and immediately covered with a fabric or paper strip which is pressed/rubbed onto the waxed area before being removed in a quick swipe. Strip waxing is quicker than hot wax and larger areas can be waxed at one go.
  • ==========================

visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.