Tuesday, May 1, 2012

If no enough Sleep,sleeplessness,తగినంత నిద్ర లేకపోతే




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 40 సం.లు. నాకు రాత్రులందు సరిగా నిద్రపట్టదు. పగలు చిరాకుగాను , నీరసముగాను ఉంటుంది తగిన సలహా ఇవ్వండి. సరియైన నిద్ర లేకపోతే వచ్చే అనర్ధాలు ఎమిటి ?----- రాము - దేశిళ్ళ వీది ,శ్రీకాకుళం టౌన్‌.

జ : ఏ వయసు వారికైనా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడము చాలా పెద్ద ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. రాత్రు అటు ఇటు దొర్లుతారు , నిద్ర రాదు , కలతనిద్రగా ఉంటుంది. మెలకువచ్చి మళ్ళీ నిద్ర పోవడము జరుగదు . కొంతమంది అతిగా టి.వి ల దగ్గర , కంప్యూటర్ల దగ్గర ఉండి ,లేదా కొన్ని రకాల అశ్లీల పుస్తకాలు , డిటెక్టివ్ నవలలు చదువుతూ నిద్రపోరు .

ఏవిధముగా నైనాసరే ఎక్కువకాలము నిద్రపట్టని పరిస్థితి ఉంటే అది శరీరములో వస్తున్న మార్పులను సూచిస్తుంది . తగింనంత నిద్ర లేకపోతే శరీరానికి విశ్రాంతి ఉండదు . అనేక అనారోగ్యాలకు తారితీస్తుంది .

తగింనంత నిద్ర లేకపోతే---?
  • పగలంటా మత్తుగా జూగుతూ ఉంటారు .
  • పనిమీద దృస్టి నిలపలేరు ,
  • ఏకాగ్రత ఉండదు .
  • కోపము , చిరాకు పెరుగుతాయి.
  • బి.పి . పెరుగుతుంది . వీరిలో వయసు పెరిగిన కొద్దీ మధుమేహము వచ్చే శాతము ఎక్కువ .
  • లోపలి అవయవాల పనితీరు మారిపోతుంది .
  • చిరాకుగా ఉండడము వలన ... సామాజిక సంబధాలు తెగిపోతాయి ,
  • మూడ్ సక్రమముగా ఉండదు ,
  • వృత్తి నైపుణ్యము తగ్గుతుంది ,
  • ఆడవారికి ఇంటి పనులలోనూ పొరపాట్లు జరుతుంటాయి.
  • సంసార బాంధవ్యాలలోనూ విబేదాలు వస్తాయి.
నిద్రపోకుంటే ఇన్నిరకాల ఇబ్బందున్నాయి. డాక్టర్ని సంప్రదించి తగిన సలహా తీసుకొని హాయిగా నిద్రపోవడము మంచిది .

చికిత్స :పెద్దవారికి --

Tab. Triptomer(Amitryptoline Hcl) 10 or 25 mg .... daily one at bed Time . లేదా,

Tab. Decolic (Dizepam 2mg + Dicyclomin Hcl) ... Daily one at bed time.
లేదా,

Tab. Stresnil (Alprozolam 0.25 +Melatonin 5mg) ... Daily one at bedtime.

  • .===============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.