Saturday, May 5, 2012

వయసులో చిన్న అయిన అబ్బాయితో కలిస్తే నష్టమా?, Any bad if have sex boy younger to me?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

Q : నా వయసు నలభై దాటింది. నాకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లల్లేరు. పెళ్లయిన కొత్తల్లో మేమిద్దరం కలిసి హనీమూన్‌కు వెళ్లినప్పుడు మాత్రమే శారీరకంగా దగ్గరయ్యాం. అప్పటి నుంచి నేటి వరకు మా మధ్య ఎలాంటి లైంగిక చర్య జరగలేదు. నాలో ఆ ఆసక్తి ఉన్నా.. ఇన్నేళ్లూ నా భర్తకు తెలియజేయకుండా మౌనం వహించా. ఇప్పుడు కొంతకాలం క్రితం నా కన్నా వయసులో చిన్నవాడైన ఒకబ్బాయితో పరిచయమైంది. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. అతని సాన్నిహిత్యాన్ని నేనూ ఆనందిస్తున్నా. ఓసారి లైంగికచర్యలో పాల్గొనే ప్రయత్నం చేస్తే.. ఇద్దరం విఫలమయ్యాం. నాకు వయసైపోవడమే కారణమా?

A : లైంగిక జీవితాన్ని ఆనందించడానికి వయసుతో సంబంధం లేదు. కొన్నిసార్లు స్త్రీలలో తక్కువ ఉండాల్సిన పురుష హార్మోను స్థాయి పెరుగుతుంది. అప్పుడు లైంగిక వాంఛలు ఎక్కువవుతాయి. మీ సమస్య కూడా అదే. లైంగిక చర్యలో విఫలమవడానికి కారణము మీ ఇద్దరిలో ఉన్న భయమే . అయితే మీరు భర్తతో కాకుండా మీకన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తితో లైంగికచర్యలో పాల్గొంటున్నారని రాశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సాధ్యమైనంత వరకు మీ స్నేహితుడిని దూరం పెట్టి మీరు, మీ భర్త దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. అంతకన్నా ముందు, మీరిద్దరూ ఇన్నేళ్లుగా దూరంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకోండి. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోండి. ఇద్దరి మధ్యా అనుబంధం పెరగడానికి ఎటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందో కలిసి ఆలోచించుకుని, వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడే మీ బంధం దృఢమవుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. మీ సమస్యల్లో చాలామటుకు తగ్గుతాయి.


  • =====================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.