Friday, February 14, 2014

సాల్యుబుల్ ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటుంటారు కదా ఈ రెండింటికీ తేడా ఏమిటి ?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ అని అంటుంటారు కదా, ఈ రెండింటికీ తేడా ఏమిటి ?

జ : పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు.. వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని.. జీర్ణం చేసేసుకుంటుంది. కానీ పీచు ఇలా పూర్తిగా 'జీర్ణం' అయిపోదు. అందుకే దీనివల్ల 'మలం' పరిమాణం పెరుగుతుంది. పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి. రెండు రకాలు ..............>

* కరగని పీచు: మన ఆహారంలోనే ఉంటుందిగానీ.. నీటిలో కరగని రకం పీచు ఇది. దీన్ని 'ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా అలాగే బయటకు వెళ్లిపోతుంది. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఉండే 'సెల్యులోజ్‌' అనే ముతకరకమైన పీచు, దాని కన్నా కొద్దిగా పల్చగా ఉండే హెమీసెల్యులోజ్‌, లిగ్నన్స్‌ వంటివి ఈ తరహావి. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలూ పెరుగుతాయి.

* కరిగే పీచు: ఇది బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి, ఒక రకమైన జిగురులా తయారయ్యే రకం పీచు. దీన్నే 'సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఓట్స్‌, బార్లీ, చిక్కుళ్లు, బఠాణీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు.. ఇలాంటి వాటిలో ఉండే జిగురుగా తయారయ్యే గమ్స్‌, పెక్టిన్స్‌, మ్యూసిలేజస్‌.. ఇవన్నీ ఈ తరహావి. ఈ రకం పీచుకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయుల వంటివి తగ్గించటం వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది వీటన్నింటిలో ఎక్కువగా ఉంటుంది.

- ఈ కరిగే పీచు, కరగని పీచుల స్థాయులు.. ఒక్కో పదార్థంలో ఒక్కో మోతాదులో ఉంటాయి. మొత్తానికి మన ఆరోగ్యానికి రెండూ ముఖ్యమైనవే.
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.