Thursday, February 6, 2014

Feeling anxious after sex , కలయిక తరవాత సమయంలో ఏడుపొస్తోంది

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



రెండేళ్ల క్రితం మాకు పెళ్లయింది. పిల్లలు లేరు. మా మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే కలయిక తరవాత నేనెందుకో చాలా ఉద్వేగానికి లోనవుతున్నా. ఒక్కసారిగా ఏడుపొచ్చినంత పనవుతోంది. పెళ్లయిన మొదటినుంచీ ఇదే పరిస్థితి. నా తీరు చూసి మా వారూ ఆందోళన పడుతున్నారు. ఇదేమైనా సమస్యా?
- ఓ సోదరి
మీరనుకుంటున్నట్లు ఇదేమీ సమస్య కాదు. మీరు చాలా సాధారణంగానే ఉన్నారు. కాబట్టి ముందు భయపడటం మానేయండి. కొన్నిసార్లు కలయిక తరవాత ఉద్వేగాలు చోటుచేసుకోవడం అనేది సర్వసాధారణం. అది భాధ కావచ్చు.. కోపం కావచ్చు. లేదంటే ఆనందం కూడా కావచ్చు. కలయిక సమయంలో కొందరు మహిళల్లో ఎదురయ్యే కొన్ని రకాల ఆలోచనలు ఇలాంటి ఉద్వేగాలకు లోనుచేస్తాయి. ఉదాహరణకు.. 'మేం ఒకప్పటిలా ఆనందంగా ఉంటున్నామా?', 'పిల్లలు కలుగుతారా?', 'వైవాహిక బంధాన్నీ, లైంగిక జీవితాన్నీ సంపూర్ణంగానే ఆనందిస్తున్నానా?' లాంటి ప్రశ్నలు మహిళల్లో మొదలవుతాయి.. వీటన్నింటికీ తోడు.. కలయిక సమయంలో ఆర్గాజమ్‌ ఆక్సిటోసిన్‌, డొపామైన్‌, నోర్పినెఫ్రైన్‌' లాంటి న్యూరో కెమికల్స్‌ని విడుదలవుతాయి. అవి స్త్రీ మెదడులో ఉద్వేగాలను ఉత్తేజిత పరుస్తాయి. అలాంటప్పుడే ఈ పరిస్థితి ఎదురవుతుంది. మీ తీరుకీ అదే కారణం. అయితే కలయికలో పాల్గొన్న తరవాత లేదా లైంగిక చర్య గురించి ఆలోచించినప్పుడల్లా మీలో ఉద్వేగాలు పెరగడం, మీరు చెప్పినట్లు ఏడుపొచ్చేయడం, అతిగా ఆందోళన పడటం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటే సెక్సాలజిస్టును సంప్రదించడం మంచిది. డాక్టర్లు వాటిని అదుపులో ఉంచేందుకు ఏం చేయాలనేదీ సూచిస్తారు.

Courtesy with : Dr.Sharmila Majundar@eenadu vasundhara

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.