Monday, February 3, 2014

How to fulfil balanced diet to children,పిల్లలకు సమతులాహారం ఎలా?


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : మా అబ్బాయికి ఎనిమిదేళ్లు. ఈ వయసులో పిల్లలకు సమతులాహారం ఇవ్వాలంటారు కదా.. వాడికి అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా లేదా అన్న సందేహం నాలో మొదలయ్యింది. ఒకవేళ అదే జరిగితే.. ఆ లోపాన్ని ఎలా భర్తీ చేయాలి. నా సందేహం తీర్చగలరు..

- ఓ సోదరి

A : మీ అబ్బాయి ముందు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అన్నది గమనించుకోవాలి. తరవాత చదువులోనూ చురుగ్గా ఉంటున్నాడా, తరచూ ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా ఉంటున్నాడా చూడాలి. ఒకసారి అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడు సమతులాహారంపై శ్రద్ధపెట్టండి. ఎంత తింటున్నాడనేది కాకుండా ఎలాంటి నాణ్యమైన పదార్థాలను మీరు పెడుతున్నారనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వండి. పిల్లల ఎదుగుదలలో సరైన మాంసకృత్తుల పాత్ర కీలకం. అంటే గుడ్డూ, పాలూ, పాల పదార్థాలూ, పప్పుదినుసులూ మాంసాహారం లాంటివి వాళ్ల వయసుకు తగినట్లుగా అందివ్వాలి. అన్నిరకాల కూరగాయలూ, ఆకుకూరలూ మేలుచేసే కొవ్వుపదార్థాలూ మంచి ఫ్యాటీయాసిడ్లు తినేలా చూడాలి. అలాగే వేరుసెగనలూ, నువ్వులూ లాంటివి కూడా అందివ్వడం మొదలుపెట్టాలి. దానివల్ల మేలుచేసే ఫ్యాటీయాసిడ్లు పిల్లలకు అందుతాయి. రోగనిరోధకశక్తి పెరగడానికి విటమిన్‌ ఎ, సి ఎక్కువున్న ఆహారపదార్థాలు ఇవ్వాలి. ముదురు పసుపు రంగు పండ్లూ, కూరగాయలూ తినిపించాలి. పిల్లలకు అన్నిరకాల పోషకాలు సమగ్రంగా అందాలంటే ఆకుకూరలను మించిన పరిష్కారం లేదు. ఇక, చక్కెరను పిల్లలు ఎంత మోతాదులో తీసుకుంటున్నారనేదీ చూడాలి. సాధారణంగా అయితే పాలల్లో వేసుకున్నా, చాక్లెట్‌లా తిన్నా.. చక్కెర రోజుకు రెండు చెంచాలు మించకూడదు. చివరగా జంక్‌ఫుడ్‌ వల్ల కెలొరీలు పెరగడం తప్ప ఎలాంటి పోషకాలు అందవు. వాళ్ల ఎదుగుదలకు తోడ్పడవు. అందుకే వాటిని పూర్తిగా తగ్గించాలి.

  • *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.