Wednesday, March 19, 2014

Health-checkups needed for a normal person?ఆరోగ్య సమస్యలూ లేవు-హెల్త్ చెకప్స్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు అయినా హెల్త్ చెకప్స్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము ఉందా?.
జ : తప్పకుండా వెళ్ళాలి . హెల్త్ చెకప్స్ కు వెళ్ళడము వలన ఎటువంటి రుగ్మతల్ని  అయినా తొలి దశలో గుర్తించే వీలు ఉంటుంది. ఫ్యామిలీ ఫిజీషియన్‌ వద్దకు వెళ్తుండాలి. ఆయనకు మీ కుటుంబ చరిత్ర , వ్యక్తిగత సమస్యలు తెలుస్తాయి.. . . కాబట్టి అవసరాన్ని బట్తి టెస్ట్ లు సూచిస్తారు. వయసును దృష్టిలో ఉంచుకొని అవసరమైన పరీక్షలు చేస్తారు. హైటు , వెయిట్ ఎప్పటికప్పుడు మెజర్ చేస్తారు. కొలెస్టరాల్ ప్రొఫైల్ , చెక్కెర స్థాయిలు , హిమోగ్లోబిన్‌ , కిడ్నీ ఫంక్షన్‌ పరీక్షలు వంటివన్నీ పరిశీలిస్తారు.  ఆడవారైతే గైనకాలజిస్ట్ ను సంప్రదించడమూ అవసరము .
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.