Sunday, March 30, 2014

Is mother milk increase baby memory?,తల్లిపాలు బిడ్డ జ్ఞాపకశక్తిని పెంచుతుందా?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : తల్లిపాలు బిడ్డ జ్ఞాపకశక్తిని పెంచుతుందా?
జ : తల్లిపాలు బిడ్డకు సంపూర్ణాహారము . స్తన్యము ఇవ్వడము తల్లీబిడ్డలకు ఎంత ప్రయోజనమైనదో ప్రత్యేకముగా చెప్పనవరములేదు. ఈ ప్రయోజనాలతో ... 6 నెలలకు పైబడి పిల్లలకు పాలిస్తే ,వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలు , భాష , నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. 9 మాసాలు వచ్చేవరకు తల్లిపాలు తాగేవారిలో ఎక్కువ చురుకుదనము ఉంటుంది. మాటలు త్వరగా స్పస్టం గా వస్తాయి.  వీరిలో శీఘ్రం గా గ్రహించేశక్తి , కమ్యూంకేషన్‌ ను చటుక్కున అందుకోవడము వంటి గుణాలు అధికము గా కనిపిస్తాయి.

తల్లిపాలు గురించి ఇంకా కొంచము తలుసుకోండి :
స్ర్తీకి సంపూర్ణత్వం సిద్ధించేది మాతృత్వంతోనే అని అంటారు. అలాంటి మాతృత్వం పరిపూర్ణమయ్యేది బిడ్డకు తల్లి పాలను ఇచ్చినప్పుడే. అందం తగ్గిపోతుందనే అపోహతో చాలామంది పసిపిల్లలకు పాలు ఇవ్వడం లేదు. చంటిపిల్లలకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే పసిబిడ్డకు అమృతం తల్లిపాలు. భవిష్యత్తులో వారు ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని తల్లిపాలే అందిస్తాయి.

తల్లిపాలను మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే తల్లికి పాలు పడనప్పుడు మరో తల్లి పాలను సైతం పట్టిస్తుంటారు. అలా పాలు ఇచ్చే తల్లి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడినట్లే లెక్క. నిలువెత్తు ధనమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేనిది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నేడు తల్లిపాలు కరవైన పిల్లలను తల్లిపాలు అందించే తల్లిపాల బ్యాంకులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఇంతటి విలువైన తల్లిపాలను అపహాస్యం చేసే రీతిలో తల్లిపాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి విక్రయించే అనైతిక సంస్థలూ వచ్చాయి. తల్లిపాలు బిడ్డకు ఎంత కాలం ఎక్కువగా ఇస్తే అంత మంచిదే.

బిడ్డను ప్రసవించిన 3-4 రోజుల నుంచి తల్లిపాలు స్రవిస్తాయి. కాన్పు అయినప్పటి నుంచీ మూడో రోజు వరకూ కొలొస్ట్రమ్‌ అనే ద్రవం స్రవిస్తుంది. ఈ పదార్థంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ బాడీలు కూడా ఈ ద్రవంలో అధికంగానే ఉంటాయి. పాపాయి ఆరోగ్యానికి అవసరమైన దీన్ని తప్పకుండా పాపాయిచేత తాగించాలి.

తల్లిపాలు పోషక విలువలు:
పాపాయికి అవసరమైన అన్ని పోషక పదార్థాలూ తల్లిపాలలో ఉంటాయి. అంతకంటే ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ పోషక పదార్థాలన్నీ పాపాయి జీర్ణించుకోగల స్థితిలో, తగు పరిమాణంలో ఉంటాయి.తల్లిపాలలో ప్రొటీన్లు తక్కువ శాతంలో ఉంటాయి. అయితే ఇతర రకాలైన పాలలోలా కా, తల్లిపాలలో ప్రొటీన్లు పూర్తిగా జీర్ణం అయి, శక్తిగా మారే స్థితిలో ఉంటాయి. చంటి పాపాయి జీర్ణమండలానికి ఎక్కువ ప్రొటీన్లు జీర్ణించుకోగల శక్తి ఉండదు. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న పాలవలన పసిపిల్లల్లో ఎలర్జీ సమస్యలు వస్తాయి. పాపాయికి అవసరమైనంత కాల్షియం కూడా తల్లిపాల ద్వారా అందుతుంది.

రోగనిరోధక శక్తి
అనేక రకాలైన వ్యాధులు రాకుండా నిరోధించగల పదార్థాలు తల్లిపాల ద్వారా పాపాయికి అందుతాయి.
- విరేచనాలు (డయేరియా) కావడానికి కారణమైన సూక్ష్మజీవుల్ని నాశనం చెయ్యగల రక్షక కణాలు తల్లిపాలలో ఉంటాయి. అందువల్లనే తల్లిపాలు తాగే పిల్లల్లో ఈ సమస్య అరుదు.
- మలేరియా రాకుండా కాపాడే - పారా ఎమినో బెంజాయిక్‌ ఆమ్లం తల్లిపాల ద్వారా అందుతుంది.
- మధ్యవయస్సులో వచ్చే ఎథిరోస్ల్కీరోసిస్‌ వ్యాధి రాకుండా రక్షణ ఇస్తాయి తల్లిపాలు.
- రకరకాలైన వ్యాధులకు కారణమైన బాక్టీరియా, వైరస్‌ల నుంచి తల్లిపాలు రక్షణ ఇస్తాయి.

ఇతర ప్రయోజనాలు
- తల్లిపాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఏ విధమైన వ్యాధికారక క్రిములు తల్లిపాలలోకి ప్రవేశించవు.
- పాపాయికి ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు సిద్ధంగా ఉంటాయి.
- పాపకి ఏదైనా అనారోగ్యం కలిగినా తల్లిపాలయితే మాన్పించవలసిన అవసరం లేదు.
- తల్లిపాలు పాప మానసిక ఆరోగ్యానికి అవసరమే. బిడ్డ తల్లిపాలు తాగే సమయంలో ఇద్దరి మధ్యా అనుబంధం ఏర్పడుతుంది. తల్లి ఒడిలో ఉన్న పాపాయికి రక్షణ భావం ఏర్పడుతుంది. ఈ భావం బిడ్డ మానసిక ఎదుగుదలకి ఎంతో అవసరం.

 పాలిచ్చే తల్లులు బరువు పెరగరు.
- పిల్లలకి పాలిచ్చిన స్ర్తీలలో కంటే, ఎప్పుడూ పాలివ్వని స్ర్తీలలో రొమ్ముక్యాన్సర్‌ ఎక్కువగా కనబడుతోందంటున్నారు పలువురు శాస్తవ్రేత్తలు.
అంటే ఈ క్యాన్సర్‌ నుంచి కాపాడుకోగల శక్తి బిడ్డకి పాలివ్వడం ద్వారా స్ర్తీ పొందుతోందన్న మాట.

పాలు ఇవ్వకూడని పరిస్థితులు
- తల్లి కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు బిడ్డకు పాలివ్వకూడదు.
- క్షయ, కొన్ని రకాల హృద్రోగాలు, అంటు వ్యాధులు ఇటువంటివి ఉన్న తల్లి, బిడ్డకు పాలు ఇవ్వకూడదు.
 చనుమొనల్లో పగుళ్ళు, రొమ్ముల్లో గడ్డలు ఏర్పడినప్పుడు పాలివ్వకూడదు.

తల్లిపాలు తక్కువగా స్రవిస్తుంటే...
సాధారణంగా తల్లిపాలు సరిపోయినంతగా స్రవించాలంటే
- తల్లి మనస్సు పాపాయి మీద మమకారంతో నిండి ఉండాలి
- పాపాయిని దగ్గరగా ఎత్తుకోవాలి.
- తల్లి మనస్సు ఆనందంగా ఉండాలి. బాధలు, చికాకులతో ఉంటే ఆ ప్రభావం వల్ల పాలు సరిగా స్రవించవు.
- సరిపోయినంత విశ్రాంతి తీసుకోవాలి.
- సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలి.
- ప్రసవించిన తరువాత వీలైనంత త్వరగా పాపాయి చేత పాలు తాగించే ప్రయత్నం చేయాలి. ఇది పాలు స్రవించేందుకు అత్యవసరమైన ప్రేరణ.

తల్లి సౌందర్యం చెడదు
శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే కొందరు స్ర్తీలు, పిల్లలకు పాలు ఇస్తే, తమ సౌందర్యం దెబ్బ తింటుందని భ్రమపడుతుంటారు. పిల్లలకి పాలిస్తే సౌందర్యం ఏమీ పాడవదు. ఏదయినా మార్పంటూ వస్తే అది ‘గర్భం ధరించడం’ వల్లనే వస్తుంది తప్ప, పాలివ్వడం వలన ఏ మాత్రం కాదు. కన్నబిడ్డ కోసం ప్రకృతి ప్రసాదించిన పాలు ఇవ్వడం వలన పాపాయికే కాదు, తల్లికీ ఆరోగ్యమే. గర్భవతి అయిన నాటి నుంచీ పెరిగిన గర్భాశయం, కాన్పు అయిన వెంటనే యథాస్థితికి రాదు. సామాన్యస్థితికి రావడానికి దాదాపుగా 6-10 వారాల సమయం పడుతుంది. అయితే పిల్లకి పాలిచ్చే తల్లుల్లో గర్భాశయం త్వరగా మామూలు స్థితికి వస్తుంది.

--- Courtesy with : డాక్టర్‌ గాయత్రీ దేవి-మోతీనగర్‌,-హైదరాబాద్‌
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.