Saturday, March 1, 2014

Is morning sickness of pregnancy Hereditary?,వేవిళ్లు వంశపారంపర్యం?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : వేవిళ్లు వంశపారంపర్యం?
జ : గర్భం దాల్చినప్పుడు సహజంగా మహిళల్లో వేవిళ్లు రావడం జరుగుతుంది. కొందరు ఈ వేవిళ్లతో చాలా ఇబ్బంది పడతారు. మరికొందరికి మొదటి నాలుగు, ఐదునెలల వరకే ఈ ఇబ్బంది ఉంటుంది. వీటితో అంత ప్రమాదం లేకపోయినా.. వాంతులు కావడంతోబాటు కొన్ని వాసనలకు కడుపులో తిప్పినట్లు ఉంటుంది. ఇవి మరీ తీవ్రమైతే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అంతేకాదు బరువు కూడా కోల్పోతారు. ఈ సమస్య తక్కువమందిలో కనిపించినా, కొందరిలో దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు కావటం వంటి తీవ్ర పరిణామాలకూ దారి తీస్తుంది. ఈ తీవ్ర వేవిళ్ల సమస్య వంశపారంపర్యంగా వస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిం చాయి. తీవ్రమైన వేవిళ్లతో బాధపడిన తల్లులకు పుట్టిన ఆడపిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు నార్వే పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన వేవిళ్లతో బాధపడిన తల్లులకు పుట్టిన 5,44,037 మంది మహిళల వివరాలను U.S.A సేకరించి, అధ్యయనం చేశారు. గర్భం ధరించిన సమయంలో ఒకసారి వేవిళ్లతో ఇబ్బందిపడినా అది వారికి పుట్టిన అమ్మాయిల్లోనూ కనిపిస్తున్నట్టు గుర్తించారు. వేవిళ్లు- వంశపారం పర్య సంబంధాన్ని బాగా అర్థంచేసుకో గలిగితే.. స్త్రీలకు ముందు నుంచే చికిత్స చేయటంలో వైద్యులకు ఉపయోగ పడుతుంది.

 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.